/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిఎస్ రామానంద ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటిఐ భువనగిరి Vijay.S
స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిఎస్ రామానంద ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటిఐ భువనగిరి

విద్యార్థులు, చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భువనగిరి పారిశ్రామిక శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ జి. ఎస్ రామానంద అన్నారు. గురువారం భువనగిరి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం లో కేంద్ర ప్రభుత్వ "సంకల్ప్ ప్రాజెక్టు" లో భాగంగా 15-05-2024 నుండి 31-05-2024 వరకు శిక్షణ పొందిన విద్యార్థులకు *సర్టిఫికెట్ల ప్రదానోత్సవ* కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు "ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ డెవలప్మెంట్" శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న పరిజ్ఞానం, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ ప్రాజెక్టు స్టేట్ కన్సల్టెంట్ నజీర్ సిద్దిఖీ, యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు ఎర్ర శివరాజ్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు బొక్క రాంబాయి, జిల్లా అధ్యక్షులు ఆవుల వినోద్ కుమార్, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ బాబూరావు, తులసీరావు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, గురువయ్య, పరమేష్, రీసోర్స్ పర్సన్ కొడారి వెంకటేష్, చైల్డ్ లైన్ జిల్లా కో- ఆర్డినేటర్ మాటూరి దశరథ, విద్యార్థులు పాల్గొన్నారు.
వలిగొండ: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు పై హర్షం

వలిగొండ  పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ మండల అధ్యక్షులు పల్లెర్ల రామచందర్ వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రక తీర్పునివ్వడం శుభపరిణామమని,ఈ తీర్పును స్వాగతిస్తున్నామని వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడి ఎస్సీల్లో ఉన్న ఉప కులాలకు,ముఖ్యంగా మాదిగలకు సమానంగా రిజర్వేషన్ అందుతుందని పేర్కొన్నారు.‌30ఏండ్ల నుండి వర్గీకరణ పోరాటం చేసిన మంద కృష్ణ మాదిగకు మిగతా మాదిగ ఉద్యమకారులందరికీ దాసరి అభినందనలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ నాయకులు స్వీట్లు పంచుతూ పటాకులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దుబ్బ దానయ్య ,సలిగంజి బిక్షపతి, జానకి రాములు, పోలేపాక బిక్షపతి ,సందెల శ్రీనివాస్ ,మండల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలదే: AIYF

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులదేనని, కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని *ఏ ఐ వై ఎఫ్ జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శి ఎల్లంకి మహేష్ ,పేరబొయిన మహేందర్* డిమాండ్ చేశారు.ఆత్మకూర్ మండల కమిటి సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని పోటీ పరీక్షలు రాసే కొత్త అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 2023 విద్య సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నారని. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసినదని, పోటీ పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లక్షలాదిమంది యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడిందని వారు గుర్తు చేశారు. టీజీపీఎస్సీ లో జరిగిన పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ ల కారణంగా నిరుద్యోగులలో అసహనం వ్యక్తం అయిందని, దీని కారణంగానే లక్షలాది మంది నిరుద్యోగులు గత ప్రభుత్వాన్ని జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపారని వారు అన్నారు. మరల ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ తో నైనా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్న యువత ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలని, పరీక్షలు నిర్వహించాలని, ఫలితాల విడుదల, నియామకాలు వంటివి పారదర్శకంగా చేపట్టాలని ఇవ్వన్నీ జరగాలంటే ఉద్యోగ కాలమానిని విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ ఆత్మకూర్ మండల అద్యక్ష కార్యదర్శులు బత్తిని నరేష్,ఎండి నయీమ్,బాషబొయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
టీజేయు ఆధ్వర్యంలో నారిశక్తి అవార్డు గ్రహీత జర్నలిస్ట్ చంద్రకళ రెడ్డి కి ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్ వి హోటల్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ఆధ్వర్యంలో నారీ శక్తి అవార్డు గ్రహీత ,కంది శశిధర్ ఫౌండేషన్ చైర్మన్,టీ జే యూ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి ఆత్మీయ సన్మాన సభ అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఈ సందర్భంగా టీ జే యూ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా మాట్లాడుతూ కంది చంద్రకళ రెడ్డికి నారీ శక్తి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గా , టీ జే యూ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా వారు చేస్తున్న సేవలు అమోఘం అని కొనియాడారు . వారికి టీ జే యూ యాదాద్రి జిల్లా తరుపున శుభాకాంక్షలు తెలిపారు . నారీ శక్తి అవార్డుకి ఎంపిక కావడం అంత మాములు విషయం కాదు అని నాంచారి పేట గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు . అక్కా అని పిలిస్తే నేను వున్నా అని భరోసా ఇస్తూ ఎంతో మందికి కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందజేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని ఇంద్ర పార్క్ కు వందలాదిగా తరలి వెళ్లిన AITUC కార్మికులు

తమ సమస్యలు పరిష్కరించాలని ఇంద్రపార్క్ కు వందలాదిగా తరలి వెళ్లిన ఏఐటీయూసీ కార్మికులు.. హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయడమేనా మార్పు అంటే..! గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణం.. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్.. అరెస్ట్ అయిన నాయకులను పరామర్శించిన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరుగుతున్న ధర్నాకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఆటో, హమాలీ, మధ్యాహ్న భోజన కార్మికులు వందలాదిగా తరలి వెళ్లడం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. బుధవారం రోజున ఇంద్రపార్క్ వద్ద ధర్నాకు వెళ్తున్న కార్మికుల వాహనాలను ఇమ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆటో దేవులకు సంక్షేమండు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు ఇస్తామని హామీ నిలబెట్టుకోవాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులకు నెలకు 10,000 ఇస్తా ఆమెని వెంటనే అమలు చేయాలని, సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కూలి రేట్ల పెంచి నూతన కూలి రేట్ల ఒప్పందాన్ని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ అడుగు జడల్లో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని, మార్పుకు నాంది ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు? ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడం నేరమా. అధికారం లేనప్పుడు అరెస్టులపై నిర్బంధాలపై గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ అధికారం రాగానే ఏడు నెలల్లోనే అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు నిర్వచనం గా మారడం కాంగ్రెస్ అంటేనే నైజాం అని, నిరూపించుకోవడం నిజమైందన్నారు అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఉద్యమకారులకు కొత్త కాదని. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ అయిన వారిలో మధ్యాహ్నం భోజనం వంట కార్మికుల జిల్లా అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి బాగుల వసంత ముంతాజ్ బేగం, జిన్న రాజమ్మ మరియు ఆలేరులో సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, కనకయ్య, రాజు తదితరులు. హైదరాబాదు వేరిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గబోయిన వెంకటేష్, సామల భాస్కర్, నాయకులు తారాల ఉపేందర్, ఏడ్ల నరేష్, గోర్లు లక్ష్మణ్, ఎండీ షరీఫ్, జిన్నా నర్సింహా, కొత్త కృష్ణ, ముదిగొండ బస్వయ్య, మామిండ్ల సత్యనారాయణ, దంతూరి జ్ఞానేశ్వర్ మర్రిపల్లి సాయి కిరణ్,

బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ప్రారంభించిన శ్రీవాత్సవ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ని స్థానిక మీనా నగర్ శిల్ప హోటల్ ఎదురుగా బుధవారం  నూతన బ్యాంక్ ను ప్రారంభించిన FGMO జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ శ్రీవాస్తావ్ మరియు రాష్ట్ర జోనల్ మేనేజర్ శిభ ప్రసాద్ బిస్వాల్ గార్లు ,ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ...రాష్ట్రo లో ఇప్పటి వరుకు 67 బ్రాంచ్ అని తెలిపారు. ఈ బ్యాంక్ అండర్ గవర్నమెంట్ అని తెలిపారు. ఈ బ్యాంక్ లో అన్నీ రకాల సేవలు అందించడం జరుగుతుంది అని తెలిపారు .మరియు సామాన్య ప్రజల కు అందుబాటులో ఉండే విదంగా ఈ బ్యాంక్ ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో నాగేశ్వర్ రావు జనరల్ సెక్రటరీ. నిరంజన్ జనరల్ సెక్రటరీ. సుధాకర్ ప్రసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్ . బ్యాంక్ మేనేజర్ మహేష్. తదితరులు పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి వ్యాయామ విద్య ఉపాధ్యాయుల పాలాభిషేకం

దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న వ్యాయామ విద్య ఉపాధ్యాయ, పండిత అప్ గ్రేడేషన్ ప్రమోషన్ల బదిలీల కొరకు అనునిత్యం కృషి చేసిన గాలిరెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి, బదిలీలు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి యాదాద్రి జిల్లా SA పీడీ,PET ల పక్షాన వ్యాయామ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిడీ ,పిఆర్టియు , తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నాతి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాదాద్రి జిల్లాలో ఉపాధ్యాయ అప్ గ్రేడేషన్, బదిలీల కార్యక్రమంలో జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడికి కూడా నష్టం జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకునీ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు జిల్లా అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడసందుల భాస్కర్, స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపిని వ్యతిరేకించాలి. తమ్ముని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

ఈ మధ్యకాలంలో పార్లమెంటులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని దీనిపై ప్రజలు బిజెపిని వ్యతిరేకించాలని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళకు అన్యాయం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం స్థానిక సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నిర్మల సీతారామన్ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారని, తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపి సంబంధించిన ఎంపీలు కనీసం నోరు మెదపకుండా ఉన్నారని, రాష్ట్ర ప్రజలకు బిజెపి ఎంపీలు బడ్జెట్ విషయంలో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేసిందని బిజెపిని నిలదీయాలని, ఒత్తిడి పెంచాలని వారు అన్నారు. బిజెపిపై చేసే పోరాటంలో కాంగ్రెస్ ముందుండి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసే న్యాయబద్ధమైన విషయాల్లో సహకరిస్తామని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా పెరుగుతున్న బిజెపి ప్రమాదాన్ని ఎదిరించడంలో ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాలని వారు అన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గత బిఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారని ప్రజా ఉద్యమాలు చేస్తున్న తరుణంలో సిపిఎం కార్యకర్తలు కదిలి ప్రజా పోరాటాలు నిర్వహించాలని వారు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిధులు కేటాయించకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడితే ఉపయోగం లేదని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాటలకే పరిమితమై ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని నూతన రేషన్ కార్డుల పై వెంటనే జీవో విడుదల చేయాలని వారు అన్నారు. పేద ప్రజలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమాలను అరిస్తూ నిర్బంధాలను ప్రయోగిస్తుందని గత బిఆర్ఎస్ విధానాలను కాంగ్రెస్ అనుసరిస్తే పోరాటాలు తప్ప మరొకటి లేదని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిరిపంగి స్వామి, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, బొల్లు యాదగిరి, ఎండి పాషా, బండారు నరసింహ, దోడ యాదిరెడ్డి, గుంటోజు శ్రీనివాస చారి, బూరుగు కృష్ణారెడ్డి, మద్దెపురం రాజు, గుండు వెంకటనర్సు, గడ్డం వెంకటేష్, అవ్వరు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, మండల కార్యదర్శులు ధూపటి వెంకటేష్, గాడి శ్రీనివాస్, బురు అనిల్, వేముల భిక్షం, మండల నాయకులు తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, చీరిక శ్రీశైలం రెడ్డి, మెరుగు వెంకటేశం, కవుడే సురేష్, గర్దాసు నరసింహ, కందాడి సత్తిరెడ్డి, వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే హెచ్ ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి  జిల్లా ఆత్మకూరు (యం) మండల కేంద్రములో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కే హెచ్ ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు చుంచు నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి మండల సెక్రెటరీ జనరల్ గజ్జెల్లి మహేష్, ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శులు నాతి మల్లికార్జున్ గౌడ్,గట్టు విశాల్, ఆలేరు నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి పంజాల రాజు గౌడ్,శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్ కదిరె నవిన్,మల్గ క్రాంతి,బండ క్రిష్ణ యాదవ్,బొంత విఘ్నేష్,జెట్ట మహేష్, చుంచు నరేందర్,మహ్మద్ షరీఫ్,శిగ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.*
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు: జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికుల నిరవధిక సమ్మె

భువనగిరి జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతం వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం రోజున తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనం చెల్లించాలని శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది. సమ్మెకు సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మద్దత్తు తెలిపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2022 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మాత్రం అమలు కావడం లేదని ఇట్టి విషయము జిల్లా కలెక్టర్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ గార్ల దృష్టికి తీసుకెళ్లిన ఏలాంటి ప్రయోజనం లేనందున కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నేటి నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని హాస్పిటల్ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారికి అండగా ఉంటామని అయన తెలిపారు. *ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా పెరిగిన వేతనాలు, సమ్మె విరమించిన కార్మికులు..* ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేసి నేటినుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా హాస్పిటల్ ఏవో మసూద్, టీవీటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రతినిధి శ్రీనివాస్ మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ కార్మికులతో కలిసి చర్చలు జరిపారు ఈ చర్చలలో కార్మికుల వేతనాలు 10,500కు పెంచుతామని, 3నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇస్తామని, అందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లిస్తామని, 3 షిఫ్ట్ ల విధానాన్ని అమలు చేస్తామని, వేతనాలు ప్రతి నెల 5వ తేదీన చెల్లించుటకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉండి పోరాడుతుందని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేసే వరకు భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జరిగిన సమ్మెకు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, శానిటేషన్ కార్మికులు మేడబోయిన లక్ష్మి, గుండు వాణి, జేరిపోతుల కమలమ్మ, ఇస్తారమ్మ, సులోచన, నరసింహ, సోమనరసయ్య, కృష్ణ, సుగుణ, కృష్ణవేణి, లావణ్య, లలిత, భారతమ్మ, హేమలత, మహేందర్, స్వప్న, బాలరాజ్, నాగరాణి, లలిత, కిరణ్, విజయలక్ష్మి, రేణుక, శేఖర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.