/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే హెచ్ ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు Vijay.S
ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే హెచ్ ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి  జిల్లా ఆత్మకూరు (యం) మండల కేంద్రములో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కే హెచ్ ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు చుంచు నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి మండల సెక్రెటరీ జనరల్ గజ్జెల్లి మహేష్, ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శులు నాతి మల్లికార్జున్ గౌడ్,గట్టు విశాల్, ఆలేరు నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి పంజాల రాజు గౌడ్,శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్ కదిరె నవిన్,మల్గ క్రాంతి,బండ క్రిష్ణ యాదవ్,బొంత విఘ్నేష్,జెట్ట మహేష్, చుంచు నరేందర్,మహ్మద్ షరీఫ్,శిగ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.*
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు: జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికుల నిరవధిక సమ్మె

భువనగిరి జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతం వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం రోజున తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనం చెల్లించాలని శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది. సమ్మెకు సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మద్దత్తు తెలిపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2022 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మాత్రం అమలు కావడం లేదని ఇట్టి విషయము జిల్లా కలెక్టర్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ గార్ల దృష్టికి తీసుకెళ్లిన ఏలాంటి ప్రయోజనం లేనందున కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నేటి నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని హాస్పిటల్ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారికి అండగా ఉంటామని అయన తెలిపారు. *ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా పెరిగిన వేతనాలు, సమ్మె విరమించిన కార్మికులు..* ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేసి నేటినుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా హాస్పిటల్ ఏవో మసూద్, టీవీటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రతినిధి శ్రీనివాస్ మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ కార్మికులతో కలిసి చర్చలు జరిపారు ఈ చర్చలలో కార్మికుల వేతనాలు 10,500కు పెంచుతామని, 3నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇస్తామని, అందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లిస్తామని, 3 షిఫ్ట్ ల విధానాన్ని అమలు చేస్తామని, వేతనాలు ప్రతి నెల 5వ తేదీన చెల్లించుటకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉండి పోరాడుతుందని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేసే వరకు భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జరిగిన సమ్మెకు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, శానిటేషన్ కార్మికులు మేడబోయిన లక్ష్మి, గుండు వాణి, జేరిపోతుల కమలమ్మ, ఇస్తారమ్మ, సులోచన, నరసింహ, సోమనరసయ్య, కృష్ణ, సుగుణ, కృష్ణవేణి, లావణ్య, లలిత, భారతమ్మ, హేమలత, మహేందర్, స్వప్న, బాలరాజ్, నాగరాణి, లలిత, కిరణ్, విజయలక్ష్మి, రేణుక, శేఖర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మాజీ ఎంపీపీ తుమ్మల నర్సయ్య విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల లోని నరసయ్య గూడెం ,అరూరు గ్రామాలలో ఏర్పాటుచేసిన  వలిగొండ మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య విగ్రహాలను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంతాప సభకి బండారు నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సంతాప సభలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ...కీర్తిశేషులు తుమ్మల నరసయ్య నిస్వార్థ సేవ తత్పరుడని, జీవితాంతం ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన గొప్ప నాయకుడు తుమ్మల నరసయ్య అని అన్నారు. వారి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులై  కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, జెడ్పిటిసి వాకిటీ పద్మ అనంతరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాతురాజు ఉమా బాల నరసింహ, కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి కంకాల కిష్టయ్య ,చిట్టెడు జనార్దన్ రెడ్డి, చిట్టిడి లక్ష్మీనరసింహారెడ్డి, రేపాక ప్రదీప్ రెడ్డి ,తుమ్మల వెంకట్ రెడ్డి ,బత్తిని లింగయ్య, గరిసె రవి, బత్తిని సహదేవ్ ,తుమ్మల శ్రీనివాస్, తుమ్మల సంతోష్ కసరబోయిన లింగయ్య యాదవ్, బద్దం సంజీవరెడ్డి, రేకల ప్రభాకర్ ,కాసుల వెంకన్న, కొండూరు సాయి ,ఎమ్మెల్యే లింగస్వామి, మైసల్ల ప్రవీణ్ ,బండి రవి ,ఉండాడి నరసింహ మరియు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ  నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మాంటిసోరి హైస్కూల్ లో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

ప్రతి సంవత్సరం జులై 28 న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సమావేశమౌతారు. ఈరోజు మన సహజ వనరులను కాపాడుకోవడం మరియు పర్యావరణాన్ని భవిష్యత్తు తరాల కోసం రక్షించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని మాంటిసోరి హై స్కూల్ ప్రిన్సిపల్ థామస్ అన్నారు. వలిగొండ మండల కేంద్రంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలంలోని Montessori E/M.school విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రిన్సిపాల్ థామస్ హబ్రహం గారు,జరిన్ గారు, మను గారు, పీటర్ గారు, రమేష్ గారు , జనార్దన్ గారు, శాండ్రా గారు, తేజస్విని గారు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పట్టాలు వచ్చేవరకు భూ పోరాటాలు ఉదృతం చేస్తాం: ఏశాల అశోక్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఒకరోజు ఉపవాస దీక్ష లో గోద శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి

భువనగిరి పట్టణంలో 2000 మంది అర్హుల జాబితా అందరికీ మండల పరిధిలోగల హనుమాపురం సర్వేనెంబర్ 28 లో 76 ఎకరాలు బొమ్మాయిపల్లి సర్వేనెంబర్ 118 లో లేఅవుట్ చేసి స్థలాలు ఇవ్వాలి బస్వాపురంలో పట్టాలు పొందిన వారికి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు శ్రీ ఏశాల అశోక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకురావడానికి ఒక రోజు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నివేషణ స్థలాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇండ్ల నిర్మాణానికి అర్హులందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుపరచాలని ముఖ్యమంత్రి గారికి శ్రీరాములు గారు విజ్ఞప్తి చేశారు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఇట్టి సమస్య తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారికి పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ అర్హులైన వారి వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించామన్నారు ఏషాల అశోక్ గారు నిర్వహిస్తున్న ఉపవాస దీక్ష శిబిరాన్ని భువనగిరి తహసిల్దార్ అంజిరెడ్డి గారు సందర్శించి సమస్యలు అన్నింటిని విని పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు భువనగిరి హుస్నాబాద్ భూమి ప్రభుత్వానికి తెలియపరచి నిర్ణయిస్తామన్నారు ఈ ఉపవాస శిబిరంలో 300 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ చెక్క వెంకటేష్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు సోమన సబిత సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం ఉడుత రాఘవులు చింతల పెంటయ్య చిక్కా బిక్షపతి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య నాయకులు బద్దం వెంకటరెడ్డి నాగపురి యాదగిరి చొప్పరి సత్తయ్య ఎస్.కె అమీర్ చిక్క నరసయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

దళితులు కబ్జాలో ఉన్న భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి

దళితులు దీర్ఘ కాలంగా కబ్జాలో ఉన్న భూమికి పాసు పుస్తకాలు ఇవ్వాలని దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి*. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం మసిపట్ల గ్రామ రెవిన్యూ పరిధిలోని ఎ. 1.28 గుంటల భూమిలో ముప్పై సంవత్సరాలుగా కబ్జా లో ఉన్న దళితులకు కొత్త పాసు పుస్తకాలను ఇప్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో దళితులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మాట్లాడుతూ మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామానికి చెందిన కొందరు దళితులు గత 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన కొత్త రోషిరెడ్డి దగ్గర సర్వే నం 193,194,198 లలో సుమారు ఎ 32. 05 గుంటల భూమికి పూర్తి డబ్బులు చెల్లించి ఖరీదు చేసుకున్నారని, అందులోని సర్వే నం 194 లోఎ 1.28 గుంటల భూమి రికార్డుల్లో నమోదు కాలేదని ఆయన అన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కరం చేయలేదన్నారు. ప్రస్తుతం మోత్కూరు గ్రామానికి చెందిన బిల్లపాటి యాదిరెడ్డి, బిల్లపాటి మాధవరెడ్డి మరియు కొప్పుల వెంకట్ రెడ్డి లు దౌర్జన్యంగా అట్టి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, దళితులపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ముసిపట్ల లోని సర్వే నం 194 జాగ మోకా పై విచారణ జరిపించి, న్యాయ పరంగా దళితులకు రావాల్సిన భూమికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఇప్పించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో ముసిపట్ల గ్రామానికి చెందిన గందమల్ల మల్లయ్య, గురిజాల వెంకటయ్య, గందమల్ల కిష్టయ్య, నకిరేకంటి రాం నర్సయ్య, పొన్న బోయిన అంజయ్య, గందమల్ల యాదమ్మ, గందమల్ల ఎల్లమ్మ, ముప్పాల వెంకట్ రెడ్డి లు పాల్గొన్నారు.
చిత్తాపురం నుండి వేములకొండకు వెళ్లే మెటల్ రోడ్డు కు మరమ్మత్తులు చేపట్టాలి: పోరుబాట లో సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని చిత్తాపురం నుండి వేములకొండ కు వెళ్లే మెటల్ రోడ్డుకు మరమ్మతులుచేపట్టాలి... సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి చిత్తాపురం నుండి వేములకొండ వెళ్లే అద్వాన్నంగా మారిన మెటల్ రోడ్డు కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు శుక్రవారం రోజున సిపిఎం చిత్తాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు అద్వానమైన చిత్తాపురం వేములకొండ రోడ్డును పరిశీలించిన అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ చిత్తాపురం వేములకొండ గ్రామాల మధ్యన ఉన్న మెటల్ రోడ్డు పూర్తిగా గుంతలమయమై ఆ రోడ్డు ద్వారా వెళ్తున్న ప్రజలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని వెంటనే నూతన మెటల్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా చిత్తాపురం నుండి ముద్దాపురం వరకు వెళ్లే మట్టి రోడ్డు గుంతలుగా ఏర్పడిందని దీనిపై బీటి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని పెన్షన్లు రేషన్ కార్డులు రాని వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం శాఖ కార్యదర్శి ఏటేల్లి నరసింహ, సహాయ కార్యదర్శి వల్లమల్ల కృష్ణ, నాయకులు కందుల బిక్షం, భూపతి రాములు,కందుల మచ్చగిరి, నాయకులు నిశాంత్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు
భువనగిరి; అన్ని గ్రామాలకు నిధులు కేటాయించాలి: సిపిఎం


భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు) భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపిడిఓ కార్యాలయం ముందు శుక్రవారం  ధర్నా నిర్వహించి ,అనంతరం సూపరిండెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ....* *భువనగిరి మండలంలోని అన్ని గ్రామాలకు నిధులు లేక మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో దోమల బెదడా,మరియు కుక్కలు, కోతులు ప్రజలపై దాడి చేస్తున్నాయి, అర్హులైన వారందరికీ 150 గజాల ఇంటి స్థలం , ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా నూతన రేషన్ కార్డులను, పెన్షన్ ను వెంటనే మంజూరు చేయాలని, హనుమాపురం నుండి అనంతరం వరకు బీటీ రోడ్ వేయాలని, కురుమ గూడెం నుండి మన్నె వారి పంపు వరకు బీటీ రోడ్డు వెయ్యాలని, బస్వాపురం నుండి హాన్మపురం వరకు రోడ్డు వేయాలని, నందనం, సిరివేరి కుంట మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని, అనాజిపురం నుండి జంపల్లి మధ్యలో చిన్నేరు వాగు నూతన బిడ్జి నిర్మాణం చేయాలని, నమాజ్ పల్లి నుండి తుక్కరం బీటీ రోడ్డు మార్చాలని, చీమల కొండూరు నుండి ముస్తాలపల్లి వరకు బీటీ రోడ్డు వేయాలని, ముస్తాలపల్లి నుండి మూటకొండూర్ రోడ్డు వేయాలని, బస్వాపురం నుండి గంగసాని పల్లి వరకు రోడ్డు వేయాలని, పెంచికల్పహాడ్ వెళ్లే దారిలో అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేయాలని, ముత్తిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు ఉపయోగపడే బస్వాపూర్ రిజర్వాయర్ కల్వా పై బ్రిడ్జి నిర్మించాలని, ఉసిల్ల కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని, బస్వపూర్ గ్రామంలో గతంలో కేటాయించిన ఇంటి స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మొదటి విడుదల ఇవ్వాలని డిమాండ్ల చేశారు , డిమాండ్లను పరిష్కరించని ఎడలా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం అన్నం పట్ల కృష్ణ కొండమడుగు నాగమణి మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య అబ్దుల్లాపురం వెంకటేష్ పాండాల మైసయ్య శాఖ కార్యదర్శిలు నరాల చంద్రయ్య ఏదునూరు వెంకటేష్ కూకుట్ల కృష్ణ,పార్టీ నాయకులు బండి శీను దయ్యాల మల్లేష్,బొల్లెపల్లి కిషన్ కొల్లూరు సిద్దిరాజు, కునుమ మధు, తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేసి , థంబ్ విధానాన్ని రద్దు చేయాలి: AITUC డిమాండ్

భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేసి మీ సేవలో ఉన్న థంబ్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరేటి రాములు ఎండి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తాహేర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరెటి రాములు, ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులు కొత్త కార్డు నమోదు చేసుకోవాలన్న, క్లెయిమ్స్ కోసం అప్లై చేయాలన్న మీ సేవలో థంబ్ విధానం పెట్టడంతో అటు సర్వర్ రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. అందుకే థంబ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 పింఛన్ ఇవ్వాలని, కొత్త జిల్లాలు ఏర్పడినందున ఆయా జిల్లాల కార్యాలయాలలో ఏ సి ఎల్, డీసీఎల్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఏ సి ఎల్ పోస్ట్ కాలిగా ఉన్నందున కేవలం ఏఎల్ఓ ఉండటంతో భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. అలాగే ప్రసూతి కానుక 50 వేలకు పెంచాలని, పెళ్లి కానుకకు 1లక్ష రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు సీతారాం, గౌస్, రాంచందర్, రవీందర్, రాజు, కృష్ణ, మోహన్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

వేములకొండ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో అంబేద్కర్ చౌక్ వద్ద వేములకొండ గ్రామ రైతులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి తమ సొంత నిధులతో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  వేములకొండ పెద్ద కాలువను పూడికతీత మరియు గుర్రపు డెక్క ఆకు తొలగించి పెద్ద చెరువులోకి నీరు రావడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు  తెలుపుతూ పాలాభిషేకం చేశామని రైతులు  అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సామ రామిరెడ్డి ,పులిపలుపుల రాములు ,ఎస్కే రసూల్, ఏర్పుల వెంకటేష్, కేశిరెడ్డి నీరజ, బుంగ మనెమ్మ ,ఆకుల లలిత, బత్తుల సువర్ణ ,ఎనుగుల నరసింహ, వింజమూరు శ్రీను ,వింజమూరి శివయ్య, చెక్క సత్తయ్య, బుంగ రాములు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.