Adani vs Birla : అదానీ వర్సెస్ బిర్లా
దేశీయ సిమెంట్ రంగంలో గడిచిన కొన్నేళ్లలో కొనుగోళ్లు, టేకోవర్ల ట్రెండ్ ఊపందుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో కొనుగోళ్ల విషయంలో ప్రధానంగా రెండు కంపెనీల మధ్యనే పోటీ నడుస్తోంది. ఒకటి గౌతమ్ అదానీకి చెందిన అదానీ సిమెంట్స్. మరొకటి కుమార మంగళం బిర్లాకు చెందిన అలా్ట్రటెక్ సిమెంట్. వ్యాపార విస్తరణతోపాటు
దేశీయ సిమెంట్ రంగంలో గడిచిన కొన్నేళ్లలో కొనుగోళ్లు, టేకోవర్ల ట్రెండ్ ఊపందుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో కొనుగోళ్ల విషయంలో ప్రధానంగా రెండు కంపెనీల మధ్యనే పోటీ నడుస్తోంది. ఒకటి గౌతమ్ అదానీకి చెందిన అదానీ సిమెంట్స్. మరొకటి కుమార మంగళం బిర్లాకు చెందిన అలా్ట్రటెక్ సిమెంట్. వ్యాపార విస్తరణతోపాటు మార్కెట్‌పై పట్టుకోసం ఇరు వర్గాలు పోటాపోటీగా దక్షిణాదిలోని సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. అలా్ట్రటెక్ ఈ మధ్యనే ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాను రూ.1,900 కోట్లకు కొనుగోలు చేయగా..
అంతకు కొన్ని వారాల క్రితం అదానీ సిమెంట్‌లో భాగమైన అంబుజా సిమెంట్.. హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌లో 100 శాతం వాటాను రూ.10,420 కోట్లకు చేజిక్కించుకుంది. అంతకంటే ముందే అలా్ట్రటెక్.. బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్ సిమెంట్‌ను హస్తగతం చేసుకుంది. బిర్లాకు చెందిన అలా్ట్రటెక్ దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా ఉంది. కాగా, స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్ దిగ్గజం హోల్సిమ్ నుంచి అంబుజా సిమెంట్స్, ఏసీసీలో మెజారిటీ వాటాను 1,050 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా 2022లో అదానీ గ్రూప్ సిమెంట్ తయారీ రంగంలోకి ప్రవేశించింది.
తద్వారా దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచే మార్కెట్‌లో అగ్రస్థానం కోసం బిర్లా, అదానీ మధ్య పోటీ ప్రారంభమైంది. అది సిమెంట్ రంగంలో కొనుగోళ్లు, విలీనాల ట్రెండ్‌కు బాటలు వేసింది. ఉత్పత్తి సామర్థ్యంతోపాటు మార్కెట్ వాటా పెంపు కోసం ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక కొనుగోళ్లకు పాల్పడుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఓరియంట్ సిమెంట్‌పై బిర్లా కన్ను: కుమార మంగళం బిర్లా తన బంధువైన సీకే బిర్లాకు చెందిన ఓరియంట్ సిమెంట్‌ను సైతం కొనుగోలు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దక్షిణ, పశ్చిమ భారత మార్కెట్లపై ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రలో మరింత పట్టుసాధించేందుకు అలా్ట్రటెక్‌కు ఈ డీల్ దోహదపడనుంది. ఓరియంట్ సిమెంట్‌కు ఒక్కో షేరుకు రూ.350-375 వరకు చెల్లించేందుకు అలా్ట్రటెక్ ముందుకొచ్చిందని, ఈ లెక్కన ఓరియంట్ మార్కెట్ విలువ రూ.7,300-7,800 కోట్లవుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది.
Jul 07 2024, 10:27