TG:నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశాలు ఉన్నాయి.
ఆదివారం ఈ జిల్లాలతోపాటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 7.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో 7.1, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లిలో 6.4, జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో 6.3 సెం.మీ.వర్షం కురిసింది. కామారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ పలు చోట్ల చినుకులు పడ్డాయి.



తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంశాఖ-వంగలపూడి అనిత, చంద్రబాబు-సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అచ్చెన్నాయుడు- వ్యవసాయం.. కొల్లు రవీంద్ర- గనులశాఖ, నాదెండ్ల మనోహర్- పౌరసరఫరాల శాఖ, పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి, సత్యకుమార్- ఆరోగ్యశాఖ, నిమ్మల రామానాయుడు- జలవనరులు, నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి
అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..
కువైట్ అగ్నిప్రమాద ఘటనలో 45 మంది భారతీయులు మృతి
వాళ్లుఅర్హులా?... అనర్హులా...?
ములుగు జిల్లా ఏజెన్సీలో పేలిన మరో మందుపాతర
అమరావతి: ఇవాళ సాయంత్రం సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్న చంద్రబాబు.. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్న చంద్రబాబు.
Jun 17 2024, 06:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.5k