/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz మోత్కూరులో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా వీర సావర్కర్ జయంతి వేడుకలు Vijay.S
మోత్కూరులో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా వీర సావర్కర్ జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ బిజెపి పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో వీర సవర్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి గుజ్జ సోమ నరసయ్య గారు మాట్లాడుతూ స్వాతంత్ర వీర దామోదర సావర్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అభినవ్ భారత్ సొసైటీ స్థాపకుడు ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపకుడు, విప్లవ రాజకీయాలకు ఆధ్యుడు హిందూ మహాసభ స్థాపకుడు, భారత ప్రధమ స్వాతంత్య్రోద్యమ చరిత్ర రచయిత, రాష్ట్రీ స్వయంసేవక్ సంఘ స్థాపనకు ప్రేరకుడు, హిందుత్వ భావజాలానికి ఆధ్యుడు, అఖండ భారత్ స్పూర్తి ప్రదాత, హిందీని జాతీయ భాషగా ప్రతిపాదకుడు, వేద సంస్కృతి ప్రచారకుడు, అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పోచం సోమయ్య జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్ ఏనుగు జితేందర్ రెడ్డి జక్క మోహన్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు గుదే మధుసూదన్ ప్రధాన కార్యదర్శిలుచేకూరి మల్లేశం రాధారపు మల్లేశం నాయకులు ముత్తినేని తిరుమలేష్ జినుకల దశరథ మామిడాలయాకేష్ బత్తిని సతీష్ నల్ల పోగులవెంకన్న నరుకుడు బిందెల శీను తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలో మృతి చెందిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి గ్రామానికి చెందిన గుండ్ల సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సౌమ్య కుటుంబాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సౌమ్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సౌమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.



ముక్తాపూర్ లో కల్తీ పాల తయారీ పై ఎస్ఓటి పోలీసుల దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ముక్తాపూర్ లో ప్రశాంత్ అనే వ్యక్తి కల్తీ పాలు తయారు చేస్తున్నాడన్న సమాచారంతో పాల కేంద్రం పై భువనగిరి ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు .దాడిలో 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 250 ఎంఎల్, థోల్పూర్ మిల్క్ పౌడర్ 8 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన తీసుకుంటామని తెలిపారు.

భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్

యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో భాగంగా భువనగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మరియు సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు.

వలిగొండ శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు సంజయ్ కుమార్ ముదిరాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు సంజయ్ కుమార్ ముదిరాజ్ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు.

భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సంతాపం తెలిపిన సిపిఎం భువనగిరి మండల కమిటీ

భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ, మండల కమిటీ తరఫున సంతాపాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ తెలియజేసినారు. రాములు గారి సొంత గ్రామమైన బస్వాపురంలో కామ్రేడ్ రాములు భౌతిక కాయానికి సిపిఎం తరుపున పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ రాములు గారి మృతి కష్టజీవులకు కార్మికులకు ప్రజాతంత్ర వాదులకు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. రాములు రజక వృత్తిదారుల సమస్యల పైన ఉమ్మడి జిల్లాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పనిచేశాడని, సిపిఐ మండల కార్యదర్శిగా ఈ మండలంలో వామపక్ష పార్టీలు తీసుకున్నా అనేక కార్యక్రమాల్లో ఐక్య ఉద్యమాలలో ముందుండి పని చేశారని, వామపక్షా ఐక్యతకు కృషి చేశాడని వారి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని వారి ఆశయ సాధన కోసం వామపక్షవాదులు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేశం , శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య , సభ్యులు మధ్యపురం బాల్ నర్సింహ, ఉడుత విష్ణు , మచ్చ భాస్కర్ , ముదిగొండ కృష్ణ , ఉడుత వెంకటేశం , రాసాల దేవెందర్,యం.ఏ.రహీమాన్ , రాసాల ఐలయ్య , ఉడుత ధషరత , నరాల వెంకటేశం , కావడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ వలిగొండ లో గోపరాజుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి చట్టసభలకు పంపాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి మాట్లాడుతూ... మిత్రుపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సలిగంజి బిక్షపతి, ఎంపీటీసీ నీలం లలిత బాబురావు, మాజీ అధ్యక్షులు పులగూర్ల లింగారెడ్డి, సిపిఎం మండల నాయకులు గాజుల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకూర్ల మల్లేశం, కీసర్ల మహేందర్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి , పులగూర్ల కొండల రెడ్డి, ఎనుగుల విష్ణు, ఎర్ర భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భువనగిరి మండల కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భువనగిరి మండల కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు తీవ్ర అనారోగ్యంతో సోమవారం  మరణించారు. ముదిగొండ రాములు గారి పెదనాన్న ముదిగొండ జమ్మయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఆరుట్ల కమలాదేవి నాయకత్వన పనిచేశాడు అతని వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాములు గ్రామ కార్యదర్శిగా పాల సంఘం డైరెక్టర్గా భువనగిరి మండల కార్యదర్శిగా పార్టీలో పని చేశారు. రెండవసారి మండల కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత పంటి క్యాన్సర్ తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. రాములకు భార్య ఇద్దరు కుమారులు ఒక అమ్మాయి ఉన్నది. నీతి నిజాయితీగా పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ముందుండేవాడు వారి మృతి పార్టీకి తీరని లోటు. ముదిగొండ రాములు గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా వారి నివాసం సమీపంలో సంతాప సభ కామ్రేడ్ ఏశాల అశోక్ గారి అధ్యక్షతన జరిగినది. సిపిఐ జిల్లా కార్యదర్శి గోధ శ్రీరాములు మాట్లాడుతూ ముదిగొండ రాములు పోరాటస్ఫూర్తిగా పనిచేశారని పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే దానికోసం న్యాయం జరగాలని పార్టీ నిర్వహించిన పోరాటంలో చురుకైన పాత్ర వహించాడని అన్నారు. భువనగిరి మండల కార్యదర్శిగా రెండు పర్యాయాలు పనిచేశాడు పాల సంఘం డైరెక్టర్ కూడా కొనసాగాడు రజక సంఘం జిల్లా జేఏసీ చైర్మన్గా కూడా పనిచేశారని చాకలి ఐలమ్మ పోరాటాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని అన్నారు. ముందుగా జిల్లా పార్టీ కార్యదర్శి తో పాటు బొలగాని సత్యనారాయణ దామోదర్ రెడ్డి కళ్లెం కృష్ణ చెక్క వెంకటేష్ సుదర్శన్ ముత్యాలు ఇమ్రాన్ బాబు శ్రీధర్ సోమన సబిత హేమలత ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అభిలాష్ శాంతి కుమార్ పుట్ట రమేష్ చింతల మల్లేశం చింతల పెంటయ్య ఉడత రాఘవులు చిక్క బిక్షపతి రాసాల పెంటయ్య నోముల ఐలయ్య రాములు మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.



జూన్ 1న హైదరాబాద్ లో గిద్దె గళం - ఏపూరి ఆట మాదిగ జాతి ఆత్మగౌరవ వర్క్ షాప్

జూన్ 1 న హైదరాబాద్ లో గిద్దెగళం - ఏపూరి ఆట మాదిగ జాతీ ఆత్మగౌరవ వర్క్ షాప్ ను జయప్రదం చేయండి - ఏపూరి సోమన్న - గిద్దెరామ్ నర్సయ్య, భువనగిరి లో వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారితో ప్రముఖ కవి గాయకులు ఏపూరి సోమన్న, గిద్దె రాంనర్సయ్య లు ప్రత్యేక సమావేశం అయ్యారు. జులై 7 న మాదిగ ల పీడిత వర్గాల ఆత్మగౌరవ పథాక (మాదిగ దండోరా), మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 వ ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని అంటేలా చాటి జయప్రదం చేయడం కోసం జూన్ 1 వ తేదిన మాదిగ, కవులు,కళాకారుల,రచయితల మేధావుల, సాంస్కృతిక వాదుల గిద్దె గళం - ఏపూరి ఆట ఆత్మగౌరవ వర్క్ షాప్ హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది అని ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గా ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, ప్రో,, కాశీమ్ ముఖ్య అతిథులు గా హాజరు కానున్నారని తెలంగాణ లోని అన్ని జిల్లాల నుండి కవులు, కళాకారులు, మేధావులు, రచయిత లు,సాంస్కృతిక వాదులు తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిడి ని విడుదల చేసిన వలిగొండ ఎస్సై డి మహేందర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన అమరులకు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం.ఆధ్వర్యంలో ఆదివారం వలిగొండ ఎస్సై డి మహేందర్ చేతుల మీదుగా సిడి విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్. మాట్లాడుతూ... ఆనాటి తెలంగాణ.రాష్ట్రం కోసం. కొట్లాడి అమరులైన కుటుంబాలను గుర్తు చేసుకుంటూ అనేక కష్టాలకు నష్టాలకు గురైన ఉద్యమకారులను గుర్తించాలని ఆనాటి పోరాటాలను జ్ఞాపకం చేసుకుంటూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సిడి విడుదల చేయడం జరిగిందన్నారు .అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమకాలరుల ఫోరం పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు .ఈ సమావేశంలో. మల్లం వెంకటేశం కన్నె కంటి శ్రీనివాసచారి. మంటి. రమేష్. డేగల అంజయ్య. ఎస్ బిక్షపతి. మంటి.. శంకర్. మంటి లింగయ్య.మహేష్ తదితరులు పాల్గొన్నారు.