/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఎం ఈ ఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుక నిర్వహణ.. Miryala Kiran Kumar
ఎం ఈ ఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుక నిర్వహణ..

నల్గొండ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడుతూ..

బాబు జగ్జీవన్ రామ్ ఆయన గొప్ప నేత మాజీ ఉప ప్రధాని సుదీర్ఘ కాలం పాటు పేద నిమ్న వర్గాల ప్రజల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలియజేస్తూ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పాటు పడతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లపాక వెంకన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బుర్ర సుధాకర్ సంఘ నాయకులు ఆది మల్ల మనిరాజు రమణ భార్గవ్ నగేష్ కత్తుల మహేష్ షణ్ముఖ కట్టెల మహేష్ కుమార్ మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ శ్రీకాంత్ నరేష్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

నలగొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాలు...

నల్గొండ జిల్లా కేంద్రా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి 116వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ...

దేశ ప్రజలందరూ మాజీ ఉప ప్రధాని 40 సంవత్సరాలుగా పార్లమెంటరీ మెంబర్గా పనిచేసిన గొప్ప వ్యక్తి జీవితాన్ని త్యాగం చేసి దళిత బహుజన పేద వర్గాల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు ఎక్స్ కౌన్సిలర్ దుబ్బా అశోక్ సుందర్ మాల మహానాడు జతియ స్టీరింగ్ కమిటీ గాలి సైదులు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగరాణి సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ భాషపాక దుర్గయ్య గంట సుమంత్ పున్న వెంకట్ రమేష్ లలిత నవనీత కీర్తి తదితరులు పాల్గొన్నారు.

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ కోధి నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ..

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖ మాత్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హైదరాబాదులోని ఇంటిలో మంత్రి గారి చేతుల మీదుగా శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మగారు గౌరవ అధ్యక్షులు పోచంపల్లి రమణారావు గారు ముఖ్య సలహాదారులు రుద్రాక్షి నరసింహ గారు తదితరులు పాల్గొన్నారు.

7 వ తారీకు ఆదివారం రోజున ఉదయము 10 గంటలకు ఆర్జాల బావి లోని ఇందిరమ్మ కాలనీలో పంచాంగం చేయబడుతుంది అధిక సంఖ్యలో బ్రాహ్మణులు మరియు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పంచాంగ ఆవిష్కరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడు నని వ్యవస్థాపక అధ్యక్షులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్ సామాజిక న్యాయ అజెండా ను తెలంగాణలో ఆచరించడం లేదు: బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్

సార్వత్రిక ఎన్నికల్లో బిసిలకు సీట్ల కేటాయింపు లో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తాం..

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కరీంనగర్ స్థానాలను బిసిలకే కేటాయించాలి..

కాంగ్రెస్ సామాజిక న్యాయ అజెండా ను తెలంగాణలో ఆచరించడం లేదు..

బీసీ దళిత ఉద్యమకారులు , ప్రజాస్వామిక శక్తులు, సివిల్ సొసైటీ మద్దతుతోనే రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఈ వర్గాలను విస్మరిస్తే పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో మా తీర్పు ను వెల్లడిస్తాం..

పాంచ్ న్యాయ్ పేరిట మ్యానిఫెస్టో

రిలీజ్ చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని విస్మరిస్తోంది. 

రాజకీయాల్లో సామాజిక అన్యాయాన్ని అరికట్టుతాం..60 శాతం మా జనాభా ఉన్న స్థానాల్లో బీసీలనే పార్లమెంటుకు పంపుతాం:దాసు సురేశ్, అధ్యక్షులు(BCRS)

రాజకీయాల్లో సామాజిక అన్యాయాన్ని అరికట్టుతాం..

60 శాతం మా జనాభా ఉన్న స్థానాల్లో బీసీలనే పార్లమెంటుకు పంపుతాం..దాసు సురేశ్, అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి 

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని కారణంచేత రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లిచ్చే విషయంలో అన్యాయానికి ఒడిగట్టుతున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ భుదవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. నిజాం వ్యతిరేఖ పోరాటం మొదలు భారత స్వాతంత్ర పోరాటం నుండి తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాలలో త్యాగాలు బడుగులవైతే నేటికీ అధికారం,అవకాశాలు కేవలం సంపన్న వర్గాలకు , ఆధిపత్యవర్గాలకే పరిమితమవుతున్నాయని మండిపడ్డారు..

జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం గురించి మాట్లాడే పార్టీలు సహితం తెలంగాణలో పార్లమెంటు సీట్ల కేటాయింపులో సామాజిక అన్యాయానికి పాల్పడుతున్నాయన్నారు. ఈ విషయంపై త్వరలోనే సామాజిక లౌకిక రాజకీయ వాదులు , మేధావులను సమావేశపరచి కొనసాగుతున్న అన్యాయంపై తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్రచారం గావిస్తామన్నారు.. 

60 శాతానికి పైగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో సహితం బీసీలకు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎప్పుడూ స‌రైన ప్రాతినిధ్యం లభించడం లేదనీ, ప‌వ‌ర్ సెంట‌ర్ కు కావాల‌నే ప్రధాన పార్టీలు బీసీలను దూరంగా నెట్టివేస్తున్నాయని ఆరోపించారు. బీసీ మేలుకో.. రాజ్యాన్ని ఏలుకో నినాద స్ఫూర్తితో బీసీలంతా రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా మెజారిటీ స్థానాల్లో బీసీ అభ్య‌ర్థుల‌కే ఓటు వేసి కనీసం 8 మంది బీసీ ఎంపీల‌ను తెలంగాణ నుంచి పార్ల‌మెంట్ అడుగుపెట్టేలా ఉద్యమిస్తామన్నారు.

సూర్యాపేట జిల్లా: బొప్పారం గ్రామంలో ఘనంగా బొడ్రాయి పునః ప్రతిష్ట..భారీ విరాళం ప్రకటించిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు భాషపంగు నాగేందర్

సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్(s)మండలం, బొప్పారం గ్రామంలో...జరిగిన బొడ్రాయి పునః ప్రతిష్ట కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.. ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, తదితరులు పాల్గొన్నారు..

బొడ్రాయి పునః ప్రతిష్ట కోసం...50116 భారీ విరాళాన్ని ప్రకటించి తోడ్పాటునంధించిన బొప్పారం వాస్తవ్యులు,మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు బాషపంగు నాగేందర్ దంపతులకు.. బొడ్రాయి కమిటీ చైర్మన్ గౌరవ శ్రీ నల్లు ఉపేందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.. మునుముందు కూడా గ్రామ అభివృద్ధికి సహకారం అందించాలని బొడ్రాయి కమిటీ వారు కోరారు. 

ఈ సందర్బంగా బాషపంగు నాగేందర్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం... నా సహాయ సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సప్త వార్షికోత్సవ పంచాంగం ఆవిష్కరణ

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సప్త వార్షికోత్సవ పంచాంగం ఆవిష్కరణ

శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ జరుగునని సేవా సంస్థ వ్యవస్థాపకులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ గారు తెలిపారు గత ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పంచాంగ ఆవిష్కరణ జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పంచాంగ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది.ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ ఆర్జల భావి లో నిర్వహించడం జరుగుతుంది ఈ పంచాంగ ఆవిష్కరణకు అధిక సంఖ్యలో ప్రజలు బ్రాహ్మణులు ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమం అనంతరము అన్నదాన కార్యక్రమము నిర్వహించబడును.

నేతన్నలతో రాజకీయాలు మానండి: బీసీ రాజాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్

నేతన్నలతో రాజకీయాలు మానండి.. 

పద్మశాలీల్లో బలమైన నాయకత్వలేమితోనే సమస్యలు

దాసు సురేశ్ - బీసీ రాజ్యాధికార సమితి 

ప్రస్తుతం సిరిసిల్లలో నేత కార్మికులు ఎదుర్కుంటున్న దుర్బర పరిస్థితిలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు..గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పేరిట కొంతమంది మాస్టర్ వీవర్లకు లబ్బి చేకూర్చే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నేడు నేత కార్మికులు పనిలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దాసు సురేశ్ తెలిపారు.. బతుకమ్మ చీరల పేరిట నెలకొని ఉన్న 270 కోట్ల రూపాయల బకాయిలను, చేనేత సహకార సంఘాలకు చెల్లుంచాల్సిన 9 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు..

రాజకీయ కారణాలతోనే ప్రస్తుతం సిరిసిల్లలో కష్టాలను ఎదుర్కొంటున్న నేతన్నల పక్షాన కేటీఆర్ మాట్లాడడం లేదని వారి హయాంలో ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన బకాయిలను రాబట్టడానికి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని నేటికీ ఈ అంశంపై కనీసం స్పందించకపోవడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు

కష్టకాలంలో ఉన్న నేతన్నలను ఓదార్చడం మాని స్థానిక కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్రెడ్డి నేతన్నల పట్ల దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని తెలిపారు.. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలలో సాలీనా కావాల్సిన వస్త్ర వినియోగాన్ని లెక్కించి సమీకృత ప్రొడక్షన్ విధానాన్ని అధికారులు నిర్ణయించుకోకపోవడమే సమస్యకు అసలు కారణమని తెలియజేశారు.. అధికారులు వెంటనే ప్రొడక్షన్ ప్లాన్ ను తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి కావాల్సిన వ్యయం మొత్తాన్ని సమీకరించాలని కోరారు.. ఆపద కాలంలో నేతన్నలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలకు పాల్పడకుండా ధైర్యంగా మెదలాలన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు కార్మికులు తమ త్రిఫ్ట్ నిధినుండి లోను సౌకర్యాన్ని పొందే విధంగా వెసులుబాటు కల్పించాలన్నారు.. కార్మికులకు శీఘ్రగతిన ముద్ర లోన్ సదుపాయాన్ని కూడా అందజేసే విధంగా స్థానిక ఎంపీ బండి సంజయ్ కృషి చేయాలన్నారు

త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే విధంగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసురేష్ మీడియాకు తెలిపారు.

చర్ల: భువనగిరి:చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడండి పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్

చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడండి పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్

చర్ల మండల కేంద్రంలో ఉన్న CHC ప్రభుత్వ ఆసుపత్రిని PYL కమిటీ సందర్శించడం జరిగింది నలుగురు MBBS డాక్టర్లు, 16 మంది స్టాఫ్ నర్స్ లు పనిచేయవలసిన ఆసుపత్రిలో, MBBS డాక్టర్ ఇద్దరు స్టాప్ నర్సులుఇద్దరు ట్రైనింగ్ తీసుకుంటున్న 8, మంది విద్యార్థులు అప్రెంటిస్ చేస్తున్న నర్స్ లను ప్రభుత్వాధికారులు పెట్టి చాకిరి చేపించుకుంటున్నారు. కనీసం వారికి బస్సుకు ఆటోకు వెళ్లడానికి చార్జీలు కూడా ఇవ్వడం లేదు కావున నిత్యవసర ధరలకు చార్జీలకు అనుకూలంగా అప్రెంటిస్ చేస్తున్న నర్సులకు ఎంతోకంతా వేతనాలు చెల్లించాలని.. ఇక్రూట్మెంట్లు సరిపడా బెడ్లు హాస్పిటల్ కి సరిపడా పరికరాలు లేకపోవడం కారణంగా చర్ల మండలంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రగతి శీల యువజన సంఘం(పి వై ఎల్) జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ అన్నారు.మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగా అందులో నుంచి వచ్చే విష వాయువు పొగ పీల్చుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వారు అన్నారు కాళ్ల నొప్పులతో ఒళ్ళు నొప్పులతో విష జ్వరాలతో చర్ల మండలం లో ఉన్న ప్రతి కడపలో ఒకరికొక ఇద్దరికో జ్వరాలు ఉన్నాయి బాధపడుతున్నారు ఎన్నో రక్త పరీక్షలు చేసినా కూడా అది ఏంటి అనేది బయటికి రావడం లేదు చర్ల మండలానికి.. మణుగూరుకి మధ్యలో గోదావరి అడ్డు మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగానే బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి మొత్తం తగ్గిపోతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చర్ల మండలం లో ఉన్న ప్రజలు మొత్తం చర్ల ప్రభుత్వాసుపత్రిలో అట్లాగే ప్రవేట్ ఆసుపత్రిలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ ని కొంతకాలం ఆపివేయాలని చర్ల మండలంలో ఉన్న ప్రజానీకాన్ని కాపాడాలని కాపాడాల్సివలిసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు.చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బెడ్లు సరిపోక కిందనే కూర్చొని సెలెన్స్ పెట్టించుకుంటున్న పరిస్థితి ఉంది. సరైన సౌకార్యాలు కల్పించాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో.. PYL మండల నాయకుడు.. చిరిగిడి నరేష్.. సీనియర్ జాన్సీ.. వనిత రాణి రవళి శ్రావణి కావ్య వల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

చర్ల:భద్రాచలం:రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెట్ ఎగ్జామ్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి:ప్రగతిశీల యువజన సంఘం( PYL )జిల్లా ఉపాధ్యక్షులు సతీష్

రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెట్ ఎగ్జామ్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి

ప్రగతిశీల యువజన సంఘం( PYL )జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్

   

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 ఈ సందర్భంగా ముసలి సతీష్ మాట్లాడుతూ.......తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగు లు గా ఉన్నారు .గతంలో టెట్, DSC కోసం ఎదురు చూసి చూసిన నిరుద్యోగుల కి నిరాశా మిగిలింది అని,గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1 కి ఫీజు రూ. 200 , పేపర్-2 కి రూ. 200 మొత్తం కలిపి 400 రూపాయలు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజులను రెండు పేపర్ లకి కలిపి 1600 రూపాయలు భారీగా పెంచారు. ఇది టెట్ అభ్యర్థులకు, నిరుద్యోగులకు ఇది ఆర్ధికంగా భారం అవుతుంది అని, అసలే BRS ప్రభుత్వం లో నిరుద్యోగులు అనేక రకాలుగా బాధపడి ఉన్నారని, రాష్ట్రము లో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య ఎక్కువైంది అని, అందుకే BRS ప్రభుత్వం ని నిరుద్యోగులే ఓడించి కాంగ్రెస్ ని గెలిపిస్తే, అధికంగా ఫీజుల వసులు చేస్తుంది అని.హైదరాబాద్ లో వెలకి వేలు కోచింగ్ సెంటర్ లో ఫిజు లు కట్టి ఉద్యోగం రాక కూలి చేసుకొని, స్వయం ఉపాధి పొందుతూన్నారని, అలాంటి పేద నిరుద్యోగుల పై ప్రభుత్వం దయ చూపాలని ప్రభుత్వం ని కోరినారు.దీని వలన రాష్ట్రంలోని అభ్యర్థులకు ఆర్థికంగా భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పేద , మధ్య తరగతి అభ్యర్థులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది . కాబట్టి తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద , బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు ఆర్థికంగా నష్టం జరగకుండా భారీగా పెంచిన టెట్ పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించి ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రగతిశీల యువజన సంఘం ( PYL ) గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల అభ్యర్థులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని , దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.