NLG: బీజేపీ అభ్యర్థిని గెలిపిద్దాం: యువ మోర్చ జిల్లా సెక్రెటరీ
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇవ్వాలని యువ మోర్చ జిల్లా సెక్రెటరీ గుండ్లపల్లి శాంతి స్వరూప్ అన్నారు.
నల్లగొండలో బిజెపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కొరకు తీసుకునే చారిత్రాత్మకమైన నిర్ణయాలకు యువత ముగ్దులై, దేశ అభివృద్ధి లో మేము సైతం దేశ ప్రధానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా యువత ముందుకు వస్తున్నారని అన్నారు.
రాబోయే రోజుల్లో నల్లగొండ మొత్తం కాషాయమయం చేయడమే ముఖ్య లక్ష్యంగా మా యువత పనిచేస్తుందని అన్నారు. తనను యువ మోర్చ జిల్లా సెక్రెటరీగా నియమించిన బిజేపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డికి, యువ మోర్చ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ కి ధన్యవాదములు అని తెలిపారు.
యువ మోర్చా జిల్లా సెక్రెటరీ నందిపాటి శ్రీకాంత్, యువ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ చేరుకుపల్లి సాయి కుమార్, అసెంబ్లీ కన్వీనర్ లోహిత్ రెడ్డి ,యువ మోర్చ పట్టణ ఉపాధ్యక్షుడు చిట్యాల గోపిరెడ్డి ఉన్నారు.
SB NEWS NATIONAL MEDIA
Apr 04 2024, 18:19