బిజెపి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బోళ్ళ సుదర్శన్
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో మండల పదాధికారుల సమావేశంను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గెలుపు కొరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని వారు అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు,కావున తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో లేని BRS కు ఓటు వేసిన ,రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేర్చు తానని తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు వేసిన ఓటు వృధా అవుతుంది కావున భువనగిరి పార్లమెంట్ ప్రజలు బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ కు ఓటు వేసి గెలిపించాలని అని అన్నారు,
పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Mar 30 2024, 16:28