/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఆర్థిక సహాయం అందజేత Vijay.S
ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో బుధవారం వల్లమల పెద్ద నర్సింహ మృతి చెందడంతో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సౌజన్యంతో కుంభం ప్రేమలత శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రామశాఖ అధ్యక్షుడు పీసరి వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షుడు కొంత ఎల్లగౌడ్ ,బిక్షపతి , కార్యదర్శి చిన్నం స్వామి , కందాటి సోమిరెడ్డి , అరూరు నరసింహ ,వెంకటయ్య ,అంజయ్య ,చాంద్ పాషా ,లక్ష్మీనర్సయ్య ,తదితరులు పాల్గొనడం జరిగింది.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీబీనగర్ జడ్పిటిసి


యాదాద్రి భువనగిరి జిల్లా  స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘం చైర్మెన్ బీబీనగర్ జడ్పీటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతులు, బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం ఉదయం హైదరాబాదులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరో వంద మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో చేరారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నందుకే కాంగ్రెస్ లో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొట్టోల్ల శ్యామ్ గౌడ్, బీబీనగర్ మండల నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

గోపి ఆశయ సాధన కోసం మతోన్మాదం పై పోరాటం, సిఏఏ వెనుక కొట్టాలి: మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు


అమరజీవి కామ్రేడ్ తీరందాసు గోపి చిన్నతనం నుండి విద్యార్థి ఉద్యమంలో యువజన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సిపిఎం పార్టీ నిర్మాణంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా కార్మిక సంఘం నేతగా అనేక ఉద్యమాలు నిర్వహించి పార్టీ క్యాడర్ ను ఉద్యమాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని వారి ఆశయ సాధన కోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాదంపై పోరాటం సాగించి బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో తిరందాసు గోపి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్టడీ సర్కిల్ లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ

పదేండ్ల కాలంలో అధికారంలో ఉన్న బిజెపి మతోన్మాదం ముసుగులో సిఏఏ ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సిఏఏ వల్ల దేశానికి జరిగే ప్రయోజనం ఏమీ లేదని సెక్యులర్ దేశంగా ఉన్న భారతదేశాన్ని మతాల పేరుతో కులాల పేరుతో విడదీయాలని కుట్ర బిజెపి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని బిజెపి భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలని చూస్తుందని దీనిని వామపక్షవాదులు అభ్యుదయవాదులు మేధావులు విద్యార్థి యువజనులు వ్యతిరేకించాలని సిఏఏకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రత్యక్షంగా నడపాలని వారు పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ప్రజా ఉద్యమాలను బలపరచాలని ప్రజల తరఫున పోరాడే సిపిఎం ను పార్లమెంటుకు పంపాలని వారు కోరారు. వీరితోపాటు మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా,గడ్డం వెంకట్, స్టడీ సర్కిల్ బాధ్యులు అవ్వరు గోవర్ధన్, తడక మోహన్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బొజ్జ బాలయ్య, రాగిర్ కిష్టయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

BJYM యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా రేగూరి అమరేందర్ నియామకం


 భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా సెక్రటరీగా వలిగొండ మండల కేంద్రంకు చెందిన రేగురి అమరేందర్ ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి జిల్లా అద్యక్షులు పాశం భాస్కర్, BJYM జిల్లా అద్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రం ను వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తన ఎన్నికకు సహకరించిన వలిగొండ మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,పార్లమెంట్ కన్వినర్ బందారపు లింగ స్వామి ,జిల్లా సెక్రటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య,మాజీ మండల అద్యక్షులు నాగెళ్లీ సుధాకర్ గౌడ్ ,సీనియర్ నాయకులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ ...పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని గ్రామాల్లో పార్టీ పటిష్టతకు పని చేస్తానని,పార్టీ పిలుపు మేరకు పని చేస్తానని వారు అన్నారు.

భువనగిరి సిపిఎం పార్లమెంట్ అభ్యర్థిగా ఎండి జహంగీర్


లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయునట్లు సిపిఎం బుధవారం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలలో సింగిల్ గానే బరిలోకి దిగుతామని తెలిపింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని సైతం ప్రకటించింది. సిపిఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య తెలిపారు. మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని అన్నారు. భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారు. గతంలో మునిపంపుల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని పరిరక్షించాలి:BKMU


తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్ లో ఉప్పల ముత్యాలు అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ 

నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కలకొండ కాంతయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని, కూలీలకు నీడ కోసం టెంట్లు వేయాలని, వాటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు రాష్ట్రంలో ఉన్న మిగులు భూములను భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలను త్వరగా పూర్తిచేయాలని, పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండి వారు చూపే సమస్యలకు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. పార్టీ నాయకత్వము బాధ్యతతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి జెట్ట రాములు, సిపిఐ మండల కార్యదర్శి జల్ది రాములు, ప్రజానాట్యమండ జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భారతమ్మ, సిపిఐ మండల నాయకులు మారుపాక వెంకటేశం, సోలిపురం లింగారెడ్డి, జక్క దయాకర్ రెడ్డి, సుల్తాన్ పురుషోత్తం, గుర్రం రాజమణి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఎం డి నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల ఆశలను తుంగలోకి తొక్కిన ఆర్.ఎస్.పి: వంగాల నవీన్ బీఎస్పీ అధ్యక్షుడు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామ శాఖ బిఎస్పి అధ్యక్షుడు వంగాల నవీన్ మాట్లాడుతూ...

మోసగాడు ,నయవంచకుడు ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ దొంగ దొంగ అంటూ దొంగ పక్కనే చేరిన 420 బహుజన వర్గాలకు అన్యాయం చేస్తే కాల్చుకొని చస్తానని చెప్పి పేద ప్రజల ఆశలను తుంగలోకి తొక్కి బీఎస్పీ అధినేత్రి పై బిజెపి నాయకుల ఒత్తిడి అంటూ తప్పుడు ప్రకటన చేస్తూ BSP పార్టీని కనుమరుగు చేయాలని చూస్తే ఊరుకోము మీలాంటి దొంగ నాయకులు ఎన్ని చెసిన మా రక్త మాంసాలు మరిగించైన సరే బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తాం నువ్వు 90శాతం బహుజనులను మోసం చేసి పోయినావు నిను నాగర్ కర్నూల్ లో బహుజనులు బొంద పెట్టడం ఖాయం

 బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ శాఖ జనంపల్లి*

భువనగిరి పట్టణంలో టాక్స్ చెల్లించడం లేదని ఓ బార్ ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మున్సిపల్ టాక్స్ చెల్లించడం లేదని పలు కమర్షియల్ దుకాణాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. భువనగిరి పట్టణంలోని అవినాష్ బార్ కు సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ టాక్స్ సంవత్సరం పైగా పెండింగ్ లో ఉందని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ చెల్లించలేదన్నారు. దీంతో మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సీజ్ చేయడానికి వచ్చిన అధికారులకు బార్ యాజమాన్యానికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

దుప్పల్లి లో భగత్ సింగ్, రాజ్ గురు , సుఖదేవ్ ల 93వ వర్ధంతి కరపత్రం ఆవిష్కరణ - AIYF


 అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి సందర్భం మండలంలోని దుప్పల్లి గ్రామంలో, AIYF స్తూపం వద్ద ప్రచార కరపత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ మాట్లాడుతూభగత్ సింగ్,రాజ్ గురు, సుకుదేవ్ ల వర్ధంతి సందర్భంగా వలిగొండ మండల -AIYF, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 23 వ తేదీ నుండి ప్రారంభం వలిగొండ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ . ఆరూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది యువతను ప్రోత్సహించేందుకు వారిలో ఉన్న క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఏఐవైఎఫ్ వలిగొండ మండలంలోని మండల స్థాయి క్రికెట్ పోటీలను ఏర్పాటు చేస్తున్నదని క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాము అని అన్నారు. భగత్ సింగ్ జీవితం భారత దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలపాల్సిన భాద్యత పాలకులదేనని వారు ఉద్ఘాటించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. 75సంవత్సరాలు గడిచినా ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక వసతులు ఎందుకు కేటాయించలేకపోతున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధి అంటే మతాల మధ్య చిచ్చుపెట్టడమేనా అని వారు మోడీని ప్రశ్నించారు. దేశ ప్రధాని ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ వనరులను యథేచ్ఛగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. అందుకే మోసాల మోడీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంలొనే భగత్ సింగ్ దేశానికి బ్రిటిష్ ముష్కరులతో పోరాడి స్వాతంత్య్రం తీసుకువస్తే, మోడీ ప్రజలను మోసం చేయడంలో, ప్రజల మధ్య చీలికలు తేవడంలో సిద్ధహస్తుడయ్యాడని వారు ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.డి నయీమ్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు ఎర్ర కిరణ్, సుద్దాల సాయికుమార్, ఏఐవైఎఫ్ మండల సమితి సభ్యులు మేడి దేవేందర్, మెట్టు లక్ష్మీనారాయణ, మామిడికాయల నరేష్, బాలగోని రాజు,మారోజు నరసిమాచారి, అంతటి రాము, రాపోల్ పవన్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి నరిగే యాదయ్య, తదితరులు పాల్గొన్నారు

రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: ఏఐఎస్ఎఫ్


రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగ

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్ అన్నారు అలాగే పరీక్ష కేంద్రాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సెంటర్లలో కరెంటు సౌకర్యాలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా విద్యార్థులు నీరసంకు గురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులకు ప్రథమ చికిత్స నిమిత్తం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎం టెంటు మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆరోగ్యశాఖ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారన్నారు అదేవిధంగా ర్యాంకుల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డుదారులు దొరికే అవకాశం ఉందని  అటువంటి వాటికి విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని అలా జరిగిన నేపథ్యంలో ఆ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థులు మనో ధైర్యం తో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత తీసుకురావాలని కోరారు