దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రాత్మక అవసరం: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రాత్మక అవసరం: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
నల్లగొండ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు హర్షణీయం
ఈ ఎన్నికల్లో RTI కార్యకర్తలు, మేధావులు విద్యావంతులు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు ఏకమై ఇండియా కూటమిని గెలిపించాలి..
దేశానికి గాంధీ కుటుంబ త్యాగం మరువలేము
కాంగ్రెస్ బలహీనమైతే దేశం బలహీనం అవుతుంది
కాంగ్రెస్ తోనే సమాచార హక్కు చట్టం సాధ్యమైంది
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు... దేశ అభివృద్ధికి మలుపు
సూర్యాపేట, 17 మార్చి, 2024: దేశ భవిష్యత్తు నిర్ణయించే 18 వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రాత్మక అవసరమని, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే దేశం బలహీనమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సూర్యాపేట పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రమాధ కృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ సమగ్రతను, దేశభక్తి, బహుళ జాతుల సంస్కృతులను, లౌకికవాదం, సమానత్వం రక్షించబడాలంటే దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలోని 16 కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. కావున ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గృహహింస చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటకు తీసేందుకు ఆర్టిఏ కార్యకర్తలు నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టిఏ చట్టం వచ్చిన తర్వాత సామాన్యుడు గౌరవం పెంచిందని, గతంలో అధికారులు సామాన్యులను పరిగణలోకి తీసుకునేవారు కాదని, ఆర్టిఏ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 150 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అధికారులకు ఏర్పడిందన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లను కొద్ది రోజుల్లోనే నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పేర్కొనడం హర్షనీయమన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలు నిజం కావాలంటే ఆర్టిఏ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణం అన్నారు. మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యంలో ఓటు పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఓటు ద్వారానే మన దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని, దీనిని దేశంలోని యువత ప్రతి ఇంట్లో తమ కుటుంబ సభ్యులకు వివరించాలని ఆయన కోరారు. జిల్లా మంత్రులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆధ్వర్యంలో నల్లగొండ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూర్ రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, ఆయన అన్నారు.సమాచార హక్కు చట్టంలో రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. కొందరు కేంద్రంలో ఇండియా కూటమిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిని మేధావి వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటకండ్ల ముకుంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేకూరి శివ,సూర్యాపేట నియోజక వర్గ అద్యక్షులు దండా వేంకటరెడ్డి ,తుంగ తూర్తి నియోజక వర్గ అద్యక్షులు వేముల ,పట్టణ అధ్యక్షులు బంగారు శ్రీధర్, ఉన్నం సత్యనారాయణ,వెంకట్ రెడ్డి, బిక్షం రెడ్డి, ఆనంద్,సూర్య, గుడుగుంట్ల విద్యాసాగర్ , బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Mar 20 2024, 18:19