/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం Mane Praveen
NLG: అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో, ఈ రోజు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు - సంధ్య దంపతులు ఆధ్వర్యంలో, అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకట్ రాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

NLG: నల్లగొండ రూరల్ పోలిస్ లకు కృతజ్ఞతలు తెలిపిన గుంటూరు జిల్లా వాసి

నల్లగొండ: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ లో ఉన్న పోలీస్ లకు సూపర్ లగ్జరీ బస్సు నుండి పడిపోయిన సూట్కేస్ ను ఆదివారం  సంబంధిత సూట్కేస్ యజమాని ని గుర్తింపు చేపట్టి వారికి అందజేశారు. వివరాలు ఇలా..గత ఐదు రోజుల క్రితం గుంటూరు జిల్లా నకిరికల్ - హైదరాబాద్ వెళుతున్న సూపర్ లక్సరీ బస్సు ప్రయాణంలో ఓ వ్యక్తికి సంబంధించిన సూట్కేస్ రాత్రి సమయంలో మర్రిగూడ బైపాస్ వద్ద బస్సు నుండి జారీ క్రింద పడిపోయింది. అదే సమయంలో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు ఆ సూట్ కేస్ కనపడింది. ఆ సూట్ కేస్ లో లభించిన ఎగ్జామ్ హాల్ టికెట్ ప్రకారం సంబంధిత వ్యక్తి గుంటూరు జిల్లా నకిరికల్ వాసి ఎస్కే బాషా గా గుర్తించి, ఆయనను పిలిపించి సూట్కేస్ మరియు అందులో ఉన్న విలువైన వస్తువులను, బట్టలను ఆయనకు అందజేశారు. అతను ఈ సందర్భంగా రూరల్ పోలిస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

NLG: తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ (TPSF) నల్గొండ జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక

నల్గొండ: జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా పంచాయతీ కార్యదర్శులు సమావేశమై జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

జిల్లా అధ్యక్షులు గా కత్తుల మధు

గౌరవ సలహాదారు: తంగెళ్ల ఉపేందర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శి :పూసపాటి నరేష్

కోశాధికారి: ఏశబోయిన నరేష్

జాయింట్ సెక్రెటరీ: బక్కతట్ల వెంకన్న

మహిళా అధ్యక్షులు: కోడిరెక్క శైలజ లను ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షులు గా : S.అంజయ్య, G. వెంకటేష్, P. వెంకన్న, CH .అశోక్, K.సుజాత

సహాయ కార్యదర్శులు గా CH. రమేష్,V.నవీన్, M.వెంకటేష్, L.లక్ష్మి, K.వెంకటేశ్వర్లు

డివిజనల్ అధ్యక్షులు గా జైహిందర్ (దేవరకొండ), B.రామకృష్ణ (మిర్యాలగూడ), అశోక్ (నల్గొండ) లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కత్తుల మధు మాట్లాడుతూ.....

పంచాయతీ కార్యదర్శుల ప్రధాన సమస్యలు

1)ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలి

2)ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే రెగ్యులర్ చేస్తూ ఒపీఎస్ వ్యవస్థని రద్దు చేయాలి

3)పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థని రెండు గ్రేడ్లుగా విభజించాలి

4) ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను అమలు చేయాలి అని అన్నారు. ఈ కార్యవర్గ ఎన్నికలకు సహకరించిన సమస్త జిల్లా కార్యదర్శులకు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

NLG: తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ (TPSF) నల్గొండ జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సమావేశమై, తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ (TPSF) నల్గొండ జిల్లా కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులు గా కత్తుల మధు

గౌరవ సలహాదారు: తంగెళ్ల ఉపేందర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శి: పూసపాటి నరేష్

కోశాధికారి: ఏశబోయిన నరేష్

జాయింట్ సెక్రెటరీ: బక్కతట్ల వెంకన్న

మహిళా అధ్యక్షులు: కోడిరెక్క శైలజ

ఉపాధ్యక్షులు:1)S.అంజయ్య

2) G. వెంకటేష్

3) P. వెంకన్న

4) CH .అశోక్

5) K.సుజాత

సహాయ కార్యదర్శులు:

1)CH. రమేష్

2)V.నవీన్

3)M.వెంకటేష్

4)L.లక్ష్మి

5)K.వెంకటేశ్వర్లు

డివిజనల్ అధ్యక్షులు:

1) జైహిందర్ (దేవరకొండ)

2) B.రామకృష్ణ (మిర్యాలగూడ)

3) అశోక్ (నల్గొండ)

లను ఎన్నుకున్నారు

నూతన జిల్లా తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ కమిటీ ఏర్పాటు అయిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు కత్తుల మధు మాట్లాడుతూ.....

పంచాయతీ కార్యదర్శుల ప్రధాన సమస్యలు

1)ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలి

2)ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే రెగ్యులర్ చేస్తూ ఒపీఎస్ వ్యవస్థని రద్దు చేయాలి

3)పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థని రెండు గ్రేడ్లుగా విభజించాలి

4) ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యవర్గ ఎన్నికలకు సహకరించిన సమస్త జిల్లా కార్యదర్శులకు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

NLG: ప్రతి ఆదివారం చత్రపతి శివాజీ (CSL) ఫుట్బాల్ లీగ్స్

నల్లగొండ టౌన్:

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 5 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో కేంద్రీయ విద్యాలయం ఫుట్బాల్ టీం మరియు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఫుట్బాల్ అకాడమీ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండు జట్లు 1-1 స్కోర్ తో సమవుజ్జిగా నిలిచి మ్యాచ్ డ్రా చేసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రభుత్వ టీచర్ కురుమిళ్ళ భూపతి సుధాకర్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు.

తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని ఇది నిరంతరం సాగుతుందని తెలియజేస్తూ, సీనియర్ క్రీడాకారులలో క్రీడా నైపుణ్యాన్ని మరియు మ్యాచ్ స్థితిగతులని అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క లీగ్ కాంపిటీషన్స్ ఎంతో ఉపయోగపడతాయని, మరియు గ్రాస్ రూట్ లో తయారవుతున్న క్రీడాకారులకు ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు స్ట్రెంత్, ఎజిలిటీ, ప్లెక్సీబులిటీ, స్పీడ్ పెంపొందించడానికి వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించి ఉదయం పూట నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టైక్వాండో కోచ్ అంబటి ప్రణీత్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా, ఈ క్రీడా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారని, ఈ ఫుట్బాల్ లీగ్ పోటీలను ఉపయోగించుకొని మంచి క్రీడాకారులుగా తయారై జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు తమ కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని క్రీడాకారులకు సూచిస్తూ అరటి పండ్లను పంపిణీ చేశారు.

ఫ్రూట్స్ స్పాన్సర్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కురుమిళ్ళ భూపతి సుధాకర్ మాట్లాడుతూ.. గత 2 సంవత్సరాలుగా మా యొక్క ముగ్గురు పిల్లలని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో చేర్పించామని, వారు ఇప్పుడు అద్భుతమైన ఫిజికల్ ఫిట్నెస్ ను పెంపొందించుకున్నారని, చదువులలో కూడా రాణిస్తూ, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ క్రీడాకారులుగా తయారవుతున్నారని తెలియజేస్తూ, దీనికి సహకరిస్తున్న బొమ్మపాల గిరిబాబు మరియు క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్, కత్తుల హరి, జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, యావర్, మురళి, సైదులు తదితరులు పాల్గొన్నారు

TS: టెన్త్ ఎగ్జామ్స్.. విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాపీయింగ్ నివారణకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని పేర్కొంది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని తెలిపింది. కాపీయింగ్ కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని, ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25, 1997 సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

NLG: మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల క్షేత్ర పర్యటన

నల్గొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన 109 మంది విద్యార్థినిలు జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం , సూక్ష్మజీవ శాస్త్రం మరియు గ్రంథాలయ శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో, శనివారం ఏర్పాటు చేసిన క్షేత్ర పర్యటన లో భాగంగా చర్లపల్లి దగ్గర గల అంజన శ్రీ నాచురల్ ఫామింగ్ క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న వై.అంజిరెడ్డి విద్యార్థినిలకు వారి క్షేత్రంలో పెంచుతున్న వివిధ మొక్కలు, జంతువుల గురించి, సమీకృత వ్యవసాయం గూర్చి, జీవ వైవిధ్య ప్రాముఖ్యత గూర్చి వివరంగా తెలియ జేశారు. అంతే కాకుండా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా సహజ పద్దతుల ద్వారా పంటలను ఎలా పెంచుతారో విద్యార్థులకు వివరించారు. తన క్షేత్రంలో పెంచుతున్న గొర్రెలు, వివిధ రకాల దేశవాళీ కోళ్ళ పెంపకం మరియు వాటి నిర్వహణ గూర్చి విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ విభాగాల అధిపతులు డా. కె.శ్రీనివాస రెడ్డి (వృక్షశాస్త్రం), డా.రావిరాల నరేష్ (జంతుశాస్త్రం), కె.దేవవాణి (సూక్ష్మ జీవ శాస్త్రం), అద్యాపకులు జె.స్వామి, ఎ.సంధ్య, జి.సరిత, మిస్కిన్ తరన్నుమ్, కె.వనజ, పి.సునీత, అతుఫా మరియు లైబ్రరీ విభాగ అధిపతి సుంకరి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

NLG: ఎన్నికల కోడ్ విధులు చేపడుతున్న గ్రామపంచాయతీ సిబ్బంది

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గుర్రం ఉమాదేవి సూచనల మేరకు.. గ్రామపంచాయతీ సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా, బహిరంగ ప్రదేశాలలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనుల శిలాఫలకాలను కప్పివేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కందికంటి స్వామి పాల్గొన్నారు.

NLG: ప్రవస్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు పంపిణీ

నల్లగొండ: పట్టణంలో ప్రవస్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ బండారు కవిత గిరిధర్ ఆధ్వర్యంలో, కేంద్రీయ విద్యాలయంలో ప్రైమరీ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్సిల్, స్కేల్, రబ్బర్ మరియు బిస్కెట్ ప్యాకెట్ పంపిణీ చేశారు. 

ప్రవస్తిక ఫౌండేషన్ చైర్మన్ బండారు కవిత గిరిధర్ మాట్లాడుతూ.. మా కుమార్తె ప్రవస్తిక, ఇదే కేంద్రీయ విద్యాలయంలో గత సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉండేది. గత సంవత్సరం మార్చి 19న అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించింది. ఆమె జ్ఞాపకార్థం ఆమె పేరు మీద ప్రవస్తిక ఫౌండేషన్ స్థాపించి, మా సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవస్తిక తల్లిదండ్రులు కవిత గిరిధర్, పాఠశాల ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: లక్కీ డ్రా లో ఒకటో తరగతి అడ్మిషన్ కు ఎంపికైన చిన్నారి ఆరాధ్య

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్నారి చిట్యాల ఆరాధ్య.. హైదరాబాద్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ పొందింది. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ తరఫున 43 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా లక్కీ డ్రా పద్ధతిలో ఆరాధ్య ఎంపికైంది. ఆమెతోపాటు మరో విద్యార్థిని కూడా ఎంపిక చేశారు. అదేవిధంగా బేగంపేట పబ్లిక్ స్కూల్ కు ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆరాధ్య తల్లిదండ్రులు కవిత గోపాల్ మాడుగుల పల్లి మండలం, కల్వల పాలెం వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ పేద విద్యార్థులకు ఎస్సీ కార్పొరేషన్ ఈ అవకాశం కల్పించింది.