/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత... Miryala Kiran Kumar
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత...

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్... గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు సీజ్ చేసిన DRI అధికారుల

టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి

టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి

 కు కృతజ్ఞతలు తెలిపిన టీఎఫ్ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సగరపు ప్రసాద్

హైదరాబాద్, మార్చి 12 : తెలంగాణ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్ట్(టీఎఫ్ డబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు సగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర డైరీని పి .శ్రీనివాస్ రెడ్డి రీజినల్ డైరెక్టర్. కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న సగరపు ప్రసాద్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి శ్రీనివాస్ రెడ్డి కు సగరపు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల. ముంబై నార్త్‌ నుంచి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌.. హిమాచల్‌లోని హమీర్‌పూర్‌ నుంచి అనురాగ్‌ ఠాకూర్‌, నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేయనున్న గడ్కరీ. హర్యానాలోని కర్నాల్‌ నుంచి మాజీ సీఎం ఖట్టర్‌ పోటీ. 

కర్నాటకలోని హవేరి నుంచి బస్వరాజ్‌ బొమ్మై పోటీ.. ధార్వాడ్‌ నుంచి కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి పోటీ, శివమొగ్గ నుంచి యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర పోటీ. బళ్లారి నుంచి పోటీ చేయనున్న శ్రీరాములు.

72 మందితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ.

మహబూబ్‌నగర్‌-డీకే అరుణ, 

ఆదిలాబాద్‌-నగేష్‌

పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్‌, 

నల్గొండ-సైదిరెడ్డి

మెదక్‌-రఘునందన్‌రావు, 

మహబూబాబాద్‌-సీతారాంనాయక్‌

ఖమ్మం, వరంగల్‌ అభ్యర్థులను ప్రకటించని బీజేపీ

గవర్నమెంట్ పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు పెన్సిళ్లు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ

భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్ల పంపిణీ: సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ

శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశామని సంస్థ వ్యవస్థాపకులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ మరియు సంస్థ కోశాధికారి సిరి ప్రగడ వసంత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తమ సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించామని,ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ యొక్క కార్యక్రమాన్ని వేరే పాఠశాలలో కూడా నిర్వహించడానికి తాము కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ గౌరవాధ్యక్షులు పోచంపల్లి రమణారావు, ముఖ్య సలహాదారు రుద్రాక్షి నరసింహ, సేవా సంస్థ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రీనాథ్ మరియు సభ్యులు పులిజాల వెంకటేశ్వరరావు, పులి జాల నాగశ్రీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ

ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో

17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ

సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ

2014 ఎన్నికల ప్రచారం తర్వాత..

ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.

నేడు 10 వందే భారత్‌ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ...

నేడు 10 వందే భారత్‌ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. విశాఖ- భువనేశ్వర్‌, విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ రైలు ప్రారంభం. కొత్తవలస- కోరాపుట్‌ సెక్షన్లు, కోరాపుట్‌-రాయగడ లైన్లలో డబ్లింగ్‌ పనులు ప్రారంభం. విజయనగరం-టిట్లాగఢ్‌ థర్డ్‌ లైన్‌ ప్రాజెక్ట్‌లో పూర్తైన భాగాలు ప్రారంభం.

తెలంగాణలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన...

నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన 

మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా 

1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా

3.15 నుంచి 4.25 వరకు LB స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొననున్న షా

4.45 నుంచి 5.45 వరకు ITC కాకతీయ లో తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతల సమావేశం 

6.10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం కానున్న షా

నల్లగొండ:చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలి..

చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలి

 కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతి

  గంజి మురళీధర్ 

  చేనేత సహకార సంఘాలలో మాస్టర్ వీవర్స్ దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిలువలను ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ విజ్ఞప్తి చేశారు

       సోమవారం గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ప్రధాన వృత్తి చేనేత తీవ్ర సంక్షోభంలో అవస్థలు పడుతుందని అన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర నగదును పెంచి అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలహీనంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు. చేనేత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షలు నగదు, రాష్ట్రంలోని అన్ని మగ్గాలకు అనుబంధ వృత్తులకు జియో టాగ్ వేసి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. చేనేత ముడి సరుకులు, రంగులు, రసాయనాలు ,నూలు ధరలపై కేంద్రం వేసిన జిఎస్టిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నేతన్న భీమా పై వయోపరిమితిని సడలించి అందరికీ వర్తింప చేయాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఈఎస్ఐ ,హెల్త్ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల కార్మికుల రుణాలు మాఫీ చేసి 80 శాతం రాయితీతో రుణాలు ఇవ్వాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఇంటి స్థలం ఇచ్చి వర్క్ షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని, ప్రభుత్వ సిబ్బంది యూనిఫారాలకు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలలో చేనేత వస్త్రాలను పంపిణీ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు, మగ్గం నేసే పతి కార్మికుడికి త్రిఫ్టు ఫండ్ పథకం, చేనేత మిత్ర అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న 6నెలల త్రిప్టు పండు చేనేత మిత్ర,చేనేత భీమా డబ్బులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత వృత్తిరక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో 1200 కోట్ల రూపాయలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ద్వారా వారు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు

       *ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం శివయ్య, ఉపాధ్యక్షులు చెరుకు సైదులు, మిర్యాల అశోక్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్నాటి శ్రీరంగం ,గడ్డం దశరథ, ఏల శ్రీనివాస్, వృత్తి సంఘాల నాయకులు కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

పౌరసత్వ సవరణ చట్టంపై నోటిఫికేషన్‌ విడుదల

2014కు ముందు భారత్‌కు వలస వచ్చిన..

పాక్, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వాసులకు పౌరసత్వం

ఆరు కమ్యూనిటీలకు భారత పౌరసత్వం

వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, బౌద్ధ..

సిక్కు, జైన్‌, పార్శీలకు భారత పౌరసత్వం.

చర్ల: మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:న్యూడెమోక్రసీ-IFTU

మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:న్యూడెమోక్రసీ-IFTU

స్కూల్స్ లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి వేతనం పెంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్,IFTU నాయకులు నరేష్ లు అన్నారు.

ఈరోజు మండలంలో మధ్యాహ్న భోజనాల పథక కార్మికుల సమస్యలపై వారిని కలిసి అనేక సమస్యల్ని సేకరించారు అనంతరం వారు మాట్లాడుతూ 

మధ్యాహ్న భోజన పథకంలో అనేకమంది వేల కార్మికులు పనిచేస్తున్నారని వీరికి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి వారికి 3000 రూపాయలు ఇవ్వాలని పెరిగిన ధరల కనుగుణంగా వారి వేదనం కూడా 6000 లకు పెంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు గా కోరుతున్నాం. కనీసం వారికి గ్యాస్ కూడా ఇవ్వడం లేదని అలాగే వారే కట్టాలని సేకరించుకొని వచ్చి వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దీనితో తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి వచ్చిందని వారన్నారు వర్కర్లకి కనీసం పీఎఫ్ గానీ ఈఎస్ఐ గాని ఇన్సూరెన్స్ గాని ఎలాంటి బీమా పథకాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది కావున ప్రభుత్వం కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.ఈ సర్వే కార్యక్రమంలో సరక్క నిలమ్మ సావిత్రి లేయమ్మ రాము తదితరులు పాల్గొన్నారు.