/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ Vijay.S
కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్


కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ను పీసీసీ ఉపాధ్యక్షులు,యువ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కేటాయించాలని సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) రాష్ట్ర అధ్యక్షుడు& ఓయూ జేఏసీ అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పార్టీ బలోపేతానికై అహర్నిశలు కృషిచేసిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారని ఆయన చేసిన కృషికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు పిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి భువనగిరి పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తే 3 లక్షల మెజార్టీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున ఏడు నియోజకవర్గాల్లో కష్టపడి గెలుపుకై కృషి చేస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎల్లప్పుడూ కష్టపడుతూ పార్లమెంట్ పరిధిలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేశారని అన్నారు.

ప్రజారోగ్యమే తమ లక్ష్యం; ముత్తిరెడ్డిగూడెం ఉచిత వైద్య శిబిరం లో ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ గౌడ్


గ్రామ ప్రజారోగ్యమే తమ లక్ష్యం అని ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ గౌడ్ ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సంధ్య డెంటల్ క్లినిక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి ఉపయోగపడే పలు రకాల మందులను పంపిణీ చేశారు. అలాగే మున్ముందు కూడా ముత్తిరెడ్డిగూడెం గ్రామ స్వచ్ఛంద సేవ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్య బాగు కోసం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు సంతోషిస్తూ ఎంపిటిసి రాంపల్లి కృష్ణ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీభవన్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం


గత తొమ్మిదినరెండ్ల టిఆర్ఎస్ పాలనలో గొల్ల కురుమలు తీవ్ర అన్యాయానికి గురి కావడం జరిగింది.18 శాతం ఉన్న గొల్ల కురుమలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు

గొల్ల, కురుమలకు గొర్లు ఇచ్చి వాళ్ళని సామజికంగా, ఆర్థికంగా ఎదగకుండా చేసే ప్రయత్నం BRS KCR పాలనలో జరిగింది.

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్ల కురుమల సమస్యల మీద ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొల్ల కురుమలను విద్యాపరంగా, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించి గొల్ల కురుమలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది, దానికి అనుగుణంగా గొల్ల కురుమల సమస్యల పైన మేనిఫెస్టో కమిటీ క చర్చించి అధికారంలోకి రాగానే గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 18 శాతం జనాభా కలిగిన కురుమలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది.

అంతే కాకుండా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అప్పటి సీఎల్పీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి విక్రమార్క గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో గొల్ల కురుమలు చట్టసభల్లో ప్రాతినిధ్య వహించాడానికి నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన యువ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ కి రాజ్యసభ సభ్యుడు గా అవకాశం ఇచ్చింది.

 ఈ విధంగా ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమల అందరి తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 ఇదే స్ఫూర్తితో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, ఎంతో కాలం నుండి వేచి చూస్తున్నా గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు తీసుకొని విద్యాపరంగా వెనుకబడినటువంటి తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

 గొల్ల కురుమల కుటుంబాలలో ఎంతోమంది యువతీ యువకులు డిగ్రీలు పీజీలు పూర్తిచేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్నారు, ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు గాని, ఆర్థికంగా వెనుకబడిన పేదవాళ్లకు గానీ తమ జీవితంలో ముందుకు పోవడానికి కార్పొరేషన్ తోడ్పడుతుంది.

 కాబట్టి గౌరవ ముఖ్యమంత్రివర్యులు మరియు బీసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కార్పొరేషన్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకొని గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా కోరుతున్నామని బీర్ల ఐలయ్య గారు అన్నారు.

యాదాద్రి దేవస్థానంలో ఉపముఖ్యమంత్రి కి ఘోర అవమానం: ఖండించిన మాల మహానాడు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మాల మహానాడు మండల అధ్యక్షులు నీలం నరేందర్ మాట్లాడుతూ 

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అగ్రకులాల మంత్రులు కుర్చీలో కూర్చొని దళితుడైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని కింద కూర్చోబెట్టి ఘోర అవమానం చేసిన సందర్బాన్ని మాల మహానాడు మండల కమిటీ తరుపున తీవ్రంగా ఖండించారు . మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏమి లేదని అన్నారు . ఇద్దరిది అగ్రకుల అహంకారం తప్ప వేరే ఏమి లేదు అని అన్నారు . ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి తరువాత ఉప ముఖ్యమంత్రి పక్కన ఉండాలి కాని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి , మంత్రులు పైనా ఉప ముఖ్యమంత్రి కింద ఇదేనా ప్రజా పాలన అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . ఇకనైనా దళిత శాసనసభ సభ్యులకు మర్యాద ఇవ్వాలని లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో దళితుల సత్తా చూపిస్తామని అన్నారు

కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందించాలి: కొండమడుగు నరసింహ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు


కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా వడపర్తి కత్వలోకి గోదావరి జలాలను అందించాలని ఇక్కడి ప్రాంత రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం హనుమపురం గ్రామ పరిధిలో గల పంట పొలాలను గ్రామ శాఖ ఆధ్వర్యంలో పరిశీలన చేసి అనంతరం స్థానిక తాసిల్దార్ గారికి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హన్మాపురం గ్రామ రైతు అయినా ముద్దం కొమురయ్యకు సంబంధించిన వరి పంట పూర్తిగా భూగర్భ జలాలు తగ్గి ఎండు దశకు వచ్చిందని దీనిని అధికారులు పరిశీలించి అట్టి రైతులు ఆదుకోవాలని అదేవిధంగా దాదాపు 100 నుండి 200 ఎకరాలకు పైగా వరి పంట భూగర్భ జలాలు లేక ఎండిపోయే అవకాశం వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో భూగర్భ జలాలు లేక ప్రభుత్వాలు భూగర్భ జలాలను పెంచే విషయంలో దృష్టి పెట్టక రైతులు నష్టపోతున్నారని వారు అన్నారు. వరి పంటలు ప్రస్తుతం పొట్ట దశలోకి వచ్చిన సరిపడా నీరు లేక ఎండిపోతున్న క్రమంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారని వెంటనే అధికారులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా పంట సర్వే నిర్వహించి నష్టం జరిగిన పంటను అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకొని కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా వడపర్తి కత్వలోకి గోదావరి సాగు జలాలను తీసుకొచ్చి చెరువులు కుంటలను నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అనేక గ్రామాలలో వరి పంటలతో పాటు సాగు పంటలైన కూరగాయలు, పండ్ల తోటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు. వీరితోపాటు సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, ఏదునూరి మల్లేష్, కొండ అశోక్, పల్లెర్ల అంజయ్య, ఎల్లంల వెంకటేష్, మోటే ఎల్లయ్య, దండు గిరి, బందెల ఎల్లయ్య, బోడ ఆంజనేయులు, లక్ష్మయ్య, శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, తోటకూరి నాగరాజు, కుసుమ మధు, రైతులు ముద్దం కొమురయ్య, పైళ్ల సత్తిరెడ్డి, బొబ్బల నర్సిరెడ్డి, ముద్దం కిష్టయ్య, బండి మల్లయ్య, జాన బాలకృష్ణ, కమ్మ శ్రీను, మోటే కిష్టయ్య, సోమ మహేష్ ఆమనగంటి శేఖర్, నాగపురి బాలరాజు, దుర్గం స్వామి, దుర్గం నరసింహ, గుండ్ల అనంతరెడ్డి, రాపోలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 12న హైదరాబాదులో జరిగే విజయ సంకల్ప సమ్మేళనం విజయవంతం చేయాలి: బోళ్ల సుదర్శన్


*భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మండల కార్యాలయం సిఎన్ రెడ్డి కాంప్లెక్స్ లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు అనగా 12వ తారీఖున ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ అధ్యక్షులతో విజయ సంకల్ప సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు కావున మండలం ఉన్న బూత్ అధ్యక్షులు మండలంలోని రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు, మోర్చా కమిటీ సభ్యులు శక్తి కేంద్ర ఇంచార్జి లు అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలనీ ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దంతూరి సత్తయ్య సీలోజి శ్రీరాములు కనతాల అశోక్ రెడ్డి నాగెల్లి సుధాకర్ గౌడ్ , బంధారపు రాములు, మారోజు అనిల్ కుమార్ ఎలిమినేటి వెంకటేష్ కందుల తానిషా, దయ్యాల వెంకటేష్ ,మంద నరసింహ ,రేగురి అమరేందర్, గండికోట హరికృష్ణ, బుంగమట్ల మహేష్, రామచంద్రు , పోలు నాగయ్య లింగం, మందుల నాగరాజు యాస ఆయిల్ రెడ్డి శక్తి కేంద్ర ఇన్చార్జీలు పూర్తి అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సిపిఎం డిమాండ్


పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

  ఎకరానికి 30 వేల నష్టపరిహారం ఇవ్వాలి తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా సందర్భంగా సిపిఎం డిమాండ్

 

 వేసవి కాలం ఎక్కువ అవుతుండడంతో పంట పొలాలకు నిరంధక ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నష్టపరిహారం కింద వరి పంట ఎకరానికి 30 వేల రూపాయలు పరిహారాన్ని అందించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య డిమాండ్ చేశారు

    ఈరోజు సిపిఎం జిల్లా వ్యాప్త పిలుపులో భాగంగా వలిగొండ తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వేసవికాలం ముదరడంతో రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వరి పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 30 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులందరిని గుర్తించి వెంటనే వారిని ఆదుకోవాలన్నారు ప్రభుత్వం కరువు పై వెంటనే స్పందించాలని సహాయక చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు మంచినీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పశువులకు గొర్రెలకు మేకలకు నీటి సౌకర్యం కల్పించేందుకు నీటి తొట్లను గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,చీర్క శ్రీశైలం రెడ్డి, కల్కూరి రామచందర్, మండల కమిటీ సభ్యులు మొగిలిపాక గోపాల్, కందడి సత్తిరెడ్డి, గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి,కొండే కిష్టయ్య నాయకులు రేపాక ముత్యాలు, రాధారపు మల్లేశం, పల్సం లింగం, బంధారపు ధనంజయ, దండెం నర్సిరెడ్డి, ఐతరాజు శంకరయ్య,కొండే నర్సింహ,కట్ట లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

సుంకిశాల లో కీర్తిశేషులు పైళ్ళ రమణమ్మ మొదటి సంవత్సరం, నివాళులర్పించిన కుమారుడు పైళ్ల వెంకట్ రెడ్డి USA

:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో.

పైల్ల రమణమ్మ మొదటి సంవత్సరం మాష్కం. వేద పండితుల మంత్రాలతో ఘనంగా నిర్వహించిన ఎన్నారై పైళ్ల  వెంకట్ రెడ్డి షామిని .మనుమలు. శ్రీఆన్ష్. ఆరూష్ . కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అక్కలు వరలక్ష్మి. మాధవి. రాధాకృష్ణారెడ్డి. గురుపాల్ రెడ్డి. అల్లుండ్లు శ్రేజన్ రెడ్డి. వినీత్ రెడ్డి.అచ్చుత్ రెడ్డి. కుటుంబ సభ్యులు పాల్గొని . పైల్ల రమణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.

 ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పైల్ల రాజావర్ధన్ రెడ్డి. చెరుకు శివయ్య గౌడ్డా. డాక్టర్ భూపాల్ రెడ్డి. పైల్ల మోహన్ రెడ్డి. బొక్క బుచ్చిరెడ్డి పైల్ల సుధర్మ రెడ్డి . మెట్టు కొండల్ రెడ్డి. సంజీవరెడ్డి. నాగరాజు. పాల్గొన్నారు.

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు తొలి రోజు పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు


_యాదాద్రి భువనగిరి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి._

తొలి రోజు స్వస్తీ వాచనం, అంకురార్పణ కార్యక్రమం, విశ్వక్సేనారాధన, రక్షా బంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

_• ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి._

ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండో సారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాఢ వీధుల్లో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. 

వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామి వారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. 

కాగా, యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

_• 10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు._

యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులంతా విచ్చేయనున్నారు. 

స్వామి వారికి సీఎం రేవంత్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. 11 గంటలకు సీఎం, మంత్రులు తిరిగి హెలికాప్టర్‌లో భద్రాచలం పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.

యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండ పైన దేవస్థానం ఆంక్షలు విధించింది. 

_ఉదయం 8 నుంచి 11 గంటల వరకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ఈవో రామకృష్ణా రావు తెలిపారు. కొండ పైకి భక్తులను, వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు._

స్త్రీలకు కావలసిన హక్కులు స్వేచ్ఛ సమానత్వం కల్పించాలి : కొడారి వెంకటేష్


 ప్రపంచ వ్యాప్తంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, ఆర్థిక అసమానతలతో పాటు అనేక అంశాలలో వంచించ బడుతున్నారని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో బహుజన ఆడపడుచు, మూట కొండూరు మాజీ సర్పంచ్ వడ్డెబోయిన (వంగపల్లి) శ్రీలత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన శ్రీలత, పేదరికం చదువుకు ఆటంకం కాదని నిరూపించారని ఆయన అన్నారు. తాను ఉన్నత చదువులు చదివి, ప్రజా సేవ కొరకై రాజకీయ రంగంలో ప్రవేశించి, ఉత్తమ సేవలందించారని ఆయన తెలిపారు . స్ర్తీ లకు ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు , హక్కులు ఉంటాయని వాటి కోసం శ్రీలత నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళల పక్షపాతి, మహిళల హక్కుల కోసం, మహిళల చదువుకోసం తన జీవితాంతం కృషిచేసిన, సామాజిక ఉద్యమ నాయకురాలు, సంఘసంస్కర్త , చదువుల తల్లి సావిత్రి భాయి పూలే వర్థంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూట కొండూరు మాజీ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత మాట్లాడుతూ నేడు మహిళలపై జరుగుతున్న దాడులకు, వేదింపులకు అనేక చట్టాలు ఉన్నా, అవి కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.     స్ర్తీ, పురుష అసమానతలు, పౌష్టికాహారం లోపం, గృహ హింస, లైంగిక వేధింపులకు మహిళలు బలగుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వాలు స్త్రీ ల గురించి చేసే చట్టాలలో అనేక మార్పులు తేవాలని, గృహహింస, లైంగిక వేధింపులకు ప్రస్తుతం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్, భువనగిరి స్టేషన్ మేనేజర్ రత్నయ్య, కంట్రోలర్ సోమరాజు, డాక్టర్ కొండా సోమయ్య, డాక్టర్ కొండా మురళి మోహన్, వంగపల్లి యువసేన నాయకులు శ్రీధర్, ఆర్టీసీ సిబ్బంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.