/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అసెంబ్లీ ఆవరణలో నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన Yadagiri Goud
అసెంబ్లీ ఆవరణలో నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని, వెంటనే ఆయన క్షమా పణలు చెప్పాలన్నారు.

సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూ డదన్నారు. అయితే సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ చెప్పారు.

శాసనసభ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు.

విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకొని శాసన మండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకొని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, శోభన్‌ రెడ్డి, తాతా మధు, మహమూద్‌ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక...

నెల ముందే వచ్చేసిన వేసవి కాలం...

ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని.. గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉండనున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంతేకాదు వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలి కాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడి గా మారుతుంది. గత సంవత్సరం తో పోల్చితే చలి కాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవి లో ఉండ నుంది అని అంటున్నారు నిపుణులు.

మామూలుగా మార్చి నెల మధ్య నుండి సమ్మర్ ఎఫెక్ట్ మొదలు అవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుండే అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండి సమ్మర్ సుర్రు మనడానికి రెడీ అవుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనంతటికీ కారణం వాతావరణ లో ఏర్పడిన ఎల్ నినో ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు. దీని వల్ల భూ తాపం ఎప్పటికప్పుడు పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవి లో వడ గాల్పుల ప్రభావం చూపనుంది అని.. సమ్మర్ మొత్తం లో హీట్ వేవ్స్ కొన్ని సార్లు ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అయితే తగిన జాగ్రతలు తప్పనిసరి అని అంటున్నారు.

జైల్లోనే మహిళా ఖైదీలకు గర్భం

కోల్ క‌తా జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధిం చాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది.

పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో సుమారు 196 మంది మహిళా ఖైదీలు పిల్లలకు జన్మనిచ్చారు. వారితోపాటు వారి పిల్లలు కూడా జైల్లోనే ఉంటున్నారు. దిద్దుబాటు గృహాల్లోని పురుష సిబ్బంది మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్‌లలోకి ప్రవేశించకుండా నిషేధించాలని కోర్టుకు అమికస్ క్యూరీ తెలిపింది.

వివ‌రాల‌లోకి వెళితే …పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు గర్భవ తులవుతున్నారని గురువారం కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలైంది. అంతే కాదు జైళ్లలో మహిళా ఖైదీలతో పాటు అంటే తల్లులైన ఖైదీలతో పాటు పిల్లలు కూడా జైల్లోనే నివసిస్తున్నారు.

196 మంది మహిళా ఖైదిలా పిల్లలు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో ఉంటున్నారు. కరెక్షనల్ హోమ్స్ లో ఉన్న మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్‌లలోనికి పురుష ఉద్యోగులను నిషేధించాలని పిటిషన్‌లో కోర్టును ఆ పిల్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టులో త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈ అంశాన్ని 2018లో సుమోటోగా విచారణకు స్వీకరించిన కలకత్తా హైకోర్టు దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని న్యాయవాది తపస్ కుమార్ భంజాను అమికస్ క్యూరీగా నియమించింది.

దీనిపై అమికస్ క్యూరీగా తపస్ కుమార్ భంజా చీఫ్ జస్టిస్ టీఎస్‌ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌కు తగు సూచనలతో కూడిన నోట్‌ను సమర్పిం చారు.

జైలులోని మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్లలోకి పురుష సిబ్బంది ప్రవేశంపై తక్షణమే నిషేధం విధించాలని ఆ నోట్‌లో అభ్యర్థించారు.

మ‌హిళ‌లు ఉండే జైలులో మ‌హిళా సిబ్బందే ఉండాల‌ని సూచించారు… పురుషుల‌ను ములఖ‌త్ స‌మయంలో గ్రిల్ వెనుక నుంచి మాత్ర‌మే మాట్లాడే విధంగా చ‌ర్య‌లు తీసుకో వాల‌ని కోరారు..

తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల

పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇందులో పురుష ఓటర్లు 1,64,47,132 మంది.. మహిళ ఓటర్లు 1,65,87,244 మంది ఉన్నట్లు పేర్కొంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,54,230 మంది, దివ్యాంగ ఓటర్లు 5,28,405 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 2,737 మంది ఉన్నారని ముసాయిదా జాబితాలో పేర్కొంది.

రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువత ఇప్పటికీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ సూచించారు...

టార్గెట్ కెసిఆర్❓️

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే.. ఆపరేషన్ కేసీఆర్ మొదలుపెట్టింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే వాటికి సంబం ధించిన నిజానిజాలు బయటపెట్టే పనిలో పడింది.

మొదట విద్యుత్ శాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. లెక్కలన్నీ తీసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే శ్వేత పత్రం విడుదల చేశారు.

కాగా.. ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో, కాళేశ్వరం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. ఆపరేషన్ కేసీఆర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమ య్యారు రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో హరితహారం ముఖ్యమైనది. కాగా.. తాము చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కేసీఆర్ సర్కార్.

అయితే.. తొమ్మిది విడతల్లో ఈ హరితహారం కార్యక్ర మాన్ని చేపట్టిన ప్రభుత్వం.. భారీగానే ఖర్చు చేసింది. అయితే.. ఈ కార్యక్రమం పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అనుమాలు వ్యక్తం చేస్తుంది

కాంగ్రెస్. అయితే.. ఇప్పుడు హరిత హారంపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి.. ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించినట్టు సమాచారం. గత సర్కారు హరితహారంపై చేసిన ఖర్చు, పెరిగిన అటవీ ప్రాంత విస్తీర్ణం లెక్కలు బయటకు తీయాలని అధికారులను ఆదేశించి నట్టు తెలుస్తోంది.

నేడు భారత్- సౌత్ ఆఫ్రికా సెమీ ఫైనల్ పోరు

అండర్19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ తలపడనుంది.

ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగే పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఆదర్ష్ సింగ్, కెప్టెన్ ఉదయ్ శరణ్, ముషీర్ ఖాన్, అర్షిన్ కుల్‌కర్ణి, ప్రియాన్షు, సచిన్ దాస్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

అంతేగాక సౌమీ పాండే రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్ జట్టుకు అందుబాటు లో ఉన్నాడు. భారత్ విజయాల్లో సౌమీ పాండే కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న భారత్ మరోసారి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంత గడ్డపై టోర్నీ జరుగుతుం డడంతో సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం.

సఫారీ టీమ్‌లోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లును ఈరోజు ర‌ద్దు చేశారు. కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు ర‌ద్ద‌య్యాయి. మౌలాలీ – సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేశారు.

ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని, మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నా మని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌ సిటీ(17011/12), కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12757/58), సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17659/60) పూర్తిగా రద్దు చేశారు.

భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌(17233/14)ను, సికింద్రాబాద్‌- గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట నుంచి బయలుదేరుతాయి.

కరీంనగర్ జిల్లా లో ఎలుగుబంటి సంచారం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ చెరువుకట్టపై ఎలుగుబంటి సంచరిస్తోంది. మంగళవారం ఉదయం ఆలయం వద్ద చెట్టు పైకి భల్లూకం ఎక్కి కూర్చుంది. స్థానికులు భయాందోళనతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మానకొండూరు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని భల్లూకం పట్టుకోవడానికి ప్రయత్నిస్తు న్నట్టు సమాచారం..

నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఈరోజు ఉదయం భేటి అయ్యారు.

వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.

దీంతో పాటు హైదరాబాద్‌ లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు వైద్య,ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతి వ్వాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ ఉన్నారు...

ఆత్మహత్య కాదు ఇద్దరు విద్యార్థులను చంపేశారు

భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినులు ఆత్మహత్య కారణాల అన్వేషణలో… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుల తల్లిదండ్రులు సరికొత్త ఆరోపణల నేపథ్యంలో ఈ అను మానాలు బలపడు తున్నాయి. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఆ విషయం భవ్య, వైష్ణవికి తెలియటంతో వార్డెన్ వేధించారనే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

అందుకే పిల్లలిద్దరినీ హత్య చేసే ముందు తప్పుడు సూసైడ్ లెటర్‌ రాయించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మా మేడం శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అని విద్యార్థినులు రాసినట్టు చెబుతున్న సూసైడ్ లెటర్‌తో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ స్థితిలో వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయు లుని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారు.

ఆరుగురిపై కేసు న‌మోదు..

మరోవైపు భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. హాస్టల్‌ వార్డెన్‌ శైలజ, ఆటోడ్రైవర్‌ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసు నమోదు కాగా.

అటు పీఈటీ ప్రతిభ, టీచర్‌ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు. ఇప్పటికే హాస్టల్‌ వార్డెన్‌, ఆటో డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నారు..అటు వార్డెన్‌ శైలజ, ఆంజనేయు లును విచారిస్తున్నారు.

పోలీసులు. దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి..మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యతో హాస్టల్‌ ఖాళీ అయ్యింది.