నల్లగొండ: బిఆర్ఎస్ నాయకులు పెండం ధనుంజయ కు మాతృవియోగం.. పరామర్శించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే..
నల్లగొండ పద్మా నగర్ నుండి...
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, పెండెం ధనుంజయ నేత... మాతృమూర్తి పెండెం నాగమణి గారు మృతి చెందటంతో.... నేడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి గారు, వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు...ఈ సందర్బంగా వారు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ... కుటుంబ సభ్యులకు ధైర్యవచనాలు పలికారు... ఇంకా వీరితోపాటు.. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గారు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ గారు...
స్థానిక నాయకులు...రాపోలు దత్త గణేష్, పెండం సదానందం,పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు మిర్యాల యాదగిరి..రావుల శ్రీనివాస రెడ్డి..చెరుపల్లి జయప్రకాశ్, వనం శేఖర్ తదితరులు వెంట ఉన్నారు.



నేటి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రత్యేక రైలు.. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి రైలును ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా. ఈ నెల 16కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్. సీఆర్పీసీ నిబంధనలు పాటించడంలేదని..ఈడీ ఆఫీస్‌లో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్. అభిషేక్‌బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు.. అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న సుప్రీంకోర్టు. ఈ నెల 16న జరగనున్న తుది విచారణ.
యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన ఇమ్మడి సోమ నరసయ్య
అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం.. ఈ నెల 7న ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన టీడీపీ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం.
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,679 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,717 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.
అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..
Feb 06 2024, 13:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.2k