/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు భారత్- సౌత్ ఆఫ్రికా సెమీ ఫైనల్ పోరు Yadagiri Goud
నేడు భారత్- సౌత్ ఆఫ్రికా సెమీ ఫైనల్ పోరు

అండర్19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ తలపడనుంది.

ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగే పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఆదర్ష్ సింగ్, కెప్టెన్ ఉదయ్ శరణ్, ముషీర్ ఖాన్, అర్షిన్ కుల్‌కర్ణి, ప్రియాన్షు, సచిన్ దాస్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

అంతేగాక సౌమీ పాండే రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్ జట్టుకు అందుబాటు లో ఉన్నాడు. భారత్ విజయాల్లో సౌమీ పాండే కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న భారత్ మరోసారి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంత గడ్డపై టోర్నీ జరుగుతుం డడంతో సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం.

సఫారీ టీమ్‌లోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లును ఈరోజు ర‌ద్దు చేశారు. కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు ర‌ద్ద‌య్యాయి. మౌలాలీ – సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేశారు.

ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని, మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నా మని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌ సిటీ(17011/12), కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12757/58), సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17659/60) పూర్తిగా రద్దు చేశారు.

భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌(17233/14)ను, సికింద్రాబాద్‌- గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట నుంచి బయలుదేరుతాయి.

కరీంనగర్ జిల్లా లో ఎలుగుబంటి సంచారం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ చెరువుకట్టపై ఎలుగుబంటి సంచరిస్తోంది. మంగళవారం ఉదయం ఆలయం వద్ద చెట్టు పైకి భల్లూకం ఎక్కి కూర్చుంది. స్థానికులు భయాందోళనతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మానకొండూరు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని భల్లూకం పట్టుకోవడానికి ప్రయత్నిస్తు న్నట్టు సమాచారం..

నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఈరోజు ఉదయం భేటి అయ్యారు.

వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.

దీంతో పాటు హైదరాబాద్‌ లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు వైద్య,ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతి వ్వాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ ఉన్నారు...

ఆత్మహత్య కాదు ఇద్దరు విద్యార్థులను చంపేశారు

భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినులు ఆత్మహత్య కారణాల అన్వేషణలో… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుల తల్లిదండ్రులు సరికొత్త ఆరోపణల నేపథ్యంలో ఈ అను మానాలు బలపడు తున్నాయి. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఆ విషయం భవ్య, వైష్ణవికి తెలియటంతో వార్డెన్ వేధించారనే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

అందుకే పిల్లలిద్దరినీ హత్య చేసే ముందు తప్పుడు సూసైడ్ లెటర్‌ రాయించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మా మేడం శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అని విద్యార్థినులు రాసినట్టు చెబుతున్న సూసైడ్ లెటర్‌తో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ స్థితిలో వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయు లుని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారు.

ఆరుగురిపై కేసు న‌మోదు..

మరోవైపు భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. హాస్టల్‌ వార్డెన్‌ శైలజ, ఆటోడ్రైవర్‌ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసు నమోదు కాగా.

అటు పీఈటీ ప్రతిభ, టీచర్‌ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు. ఇప్పటికే హాస్టల్‌ వార్డెన్‌, ఆటో డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నారు..అటు వార్డెన్‌ శైలజ, ఆంజనేయు లును విచారిస్తున్నారు.

పోలీసులు. దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి..మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యతో హాస్టల్‌ ఖాళీ అయ్యింది.

ఆర్థిక స్థితిపై భర్తను భార్య వేదించడం క్రూరత్వమే : హైకోర్టు

ఆర్థిక స్థితి గురించి భర్తను భార్య తరచుగా ఎత్తిపొడ వడం, అవహేళన చేయడం కూడా మానసిక క్రూరత్వ మేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

ఇటువంటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్న సందర్భాల్లో విడాకులను కోరే హక్కు భర్తకు లభిస్తుందని తెలిపింది. ఆర్థిక స్థోమతకు మించిన కలలను నెరవేర్చమని భర్తపై భార్య ఒత్తిడి చేయడం సరికాదని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ , నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

అనవసర అంశాలపై రాద్ధాంతం చేస్తూ భర్తపై భార్య ఒత్తిడిని పెంచడం సరికాదు. దీనివల్ల జీవితంలో సంతృప్తి, ప్రశాంతతలకు చోటులేకుండా పోతుంది. భర్తపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ అవసరాలు, కోరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి’’ అని ధర్మాసనం సూచించింది.

భార్య టార్చర్‌ను భరించలేక విడాకుల కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు ఫ్యామిలీ కోర్టు అనుమ తించింది. దీన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.

విడాకులను పొందేందుకు బాధిత భర్తకు అనుమతి ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది.తన తల్లిదండ్రుల నుంచి రూ.8వేలు అప్పు తీసుకున్న విషయాన్ని పదేపదే చెప్పి భర్తను భార్య టార్చర్ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హర్యానా నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలని భర్తను ఆమె బలవంత పెట్టడాన్ని కూడా న్యాయస్థానం తప్పు పట్టింది.....

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) 'ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు..

''ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే 'జయ జయహే తెలంగాణ'ను అధికారిక గీతంగా, సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం'' అని పేర్కొన్నారు..

బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?: జగన్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

మాడుగుల: రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కోసమని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu) అన్నారు. 64 రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు..

అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన 'రా.. కదలి రా' సభలో ఆయన మాట్లాడారు. బటన్‌ నొక్కుతున్నానని సీఎం జగన్‌ గొప్పలు చెబుతున్నారన్నారు. ''బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?'' అని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు..

''ఈ ఎన్నికల్లో రాష్ట్రం.. ప్రజలు గెలవాలి. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్‌ లేదు. ఇలాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌మోహన్‌రెడ్డి. కరెంటు ఛార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారం మోపారు. జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8లక్షలు నష్టపోయింది. జాబ్‌ క్యాలెండర్‌, మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్‌ నొక్కలేదు? ఈ విషయాలను ప్రజలు తెలుసుకోవాలి. జగన్‌ది ఉత్తుత్తి బటన్‌ అని గమనించాలి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే'' అని చెప్పారు..

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది..

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది..

''ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్‌ 41ఏ నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు? అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తాం.

ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదు'' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం..

సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది..

మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది..

రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారు..

అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాం..

ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం.

పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం.

-అసెంబ్లీలో గవర్నర్.