/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలి: ఎస్ఎఫ్ఐ Mane Praveen
NLG: తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలి: ఎస్ఎఫ్ఐ

ఫిబ్రవరి 10,11న నల్లగొండ లో జరిగే తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు నేనావత్ ఉమా అన్నారు. ఈ రోజు దేవరకొండలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కరపత్రాలు విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థీనీలపై జరిగే దాడులను అరికట్టేందుకు అన్ని రంగాలలోని విద్యార్థులు, మహిళలు ఏకం కావాలని అన్నారు. డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్,గర్ల్స్ నాయకురాలు పాల్గొన్నారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా 32వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో.. బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా హాజరైన మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గత నెల జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది.

TS: గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా కే. సీతా లక్ష్మి ని నియమించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలస్ ను.. టీఎస్పిఎస్సీ కార్యదర్శిగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా కే. సీతా లక్ష్మి ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

HYD: మూసీనది రివర్ ఫ్రంట్ ఎండీ గా ఆమ్రపాలి

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, హెచ్‌జీసీఎల్, మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ కె.ఆమ్రపాలికి అప్పగించింది.

ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం. దాన కిశోర్‌ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్నారు.

TS: హైదరాబాద్ లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ శివారు మైలార్దేవ్ పల్లిలోని ఓవైసీ హిల్స్ వద్ద నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు బాలికల ను, ఓ బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఆదివారం కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: ప్రమాదంలో మరణించిన హమాలీ లకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: ఏర్పుల యాదయ్య

ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె లో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య కార్మికులను కోరారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం లో యాదయ్య మాట్లాడుతూ.. 50 సం.లు వయసు పైబడిన హమాలీ లకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన హమాలీ లకు 10 లక్షల నష్టపరిహారం సహజ మరణానికి 5 లక్షల ఇవ్వాలని వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అట్లాగే హమాలీ లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

దేశంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు బిజెపి పాలన వల్ల ఎన్నో ఇబ్బందులతో పోరాడుతున్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26,000/- అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు 200 రోజులు పని కల్పించాలని రోజువారి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అప్పనగోని యాదయ్య, మేడ ప్రకాష్, పానకత్తుల వెంకటయ్య, మానుపాటి యాదయ్య, ఒట్టుకోటి నరసింహ, ఏర్పుల సావిత్రి, గుణగోని సోమయ్య, తదితరులు పాల్గొన్నారు

మర్రిగూడెం మండలంలో సర్పంచ్ లకు ఆత్మీయ సమ్మేళనం

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలంలో స్థానిక జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లకు సన్మానం నిర్వహించారు. 

ముందుగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లెంకలపల్లి సర్పంచ్ పాక నగేష్ యాదవ్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరము వివిధ గ్రామాల సర్పంచ్ లకు సన్మానం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పాశం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ ల 5 సం.ల పదవీకాలం పూర్తి చేసిన సందర్భంగా వారి సేవలను కొనియాడారు.

పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో వారు ప్రజా క్షేత్రంలో ప్రజలకు సేవలందించిన విధానాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాసులు, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎస్సై రంగా రెడ్డి, డిప్యూటీ తాహసిల్దార్ తారక రామన్, ఏపీవో వెంకటేశం, వివిధ హోదాలలో ఉన్న అధికారులు , సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: అమరవీరుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఎస్సై రంగారెడ్డి కి సన్మానం

నల్లగొండ జిల్లా: 

తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం ఆధ్వర్యంలో.. మర్రిగూడ మండల ఎస్ఐ రంగారెడ్డి ఉత్తమ ఎస్సై అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి షీల్డ్ ను అందజేశారు. సాయిరాం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 వరకు అమరవీరుల ఆశయాల జయంతి ఉత్సవాలు సందర్భంగా సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగిల్ల మారయ్య, పొగాకు సందీప్, ఈద అభి సందేశ్, అజయ్ చరణ్ పాల్గొన్నారు.

NLG: భారత రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడు తెలుసుకోవాలి: బుర్రి వెంకన్న

పిఏపల్లి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి సన్మానించారు. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ డైరీని ఆయనకు బహుకరణ చేశారు. తహసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ క్రాంతి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. అనంతరం మండల వ్యాప్తంగా పౌర హక్కుల దినాన్ని నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తారతమ్యాలను తగ్గించడం కోసం సమావేశాలు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ బుర్రి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం, భారత రాజ్యాంగ హక్కులను ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా అందేవిధంగా, సామాజిక చట్టబద్ధమైన పోరాటానికి శ్రీకారం చుట్టడం కోసం గ్రామాలకు, మండలాలకు, జిల్లా స్థాయిలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘాన్ని విస్తృతం చేయడం కోసం ముందుకు రావాలని యువతీ యువకులకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్మపురం శ్రీను, ఆడెపు సతీష్, మండల సభ్యులు జిల్లా రాములు, రవణంపల్లి వెంకటయ్య, ఎర్ర రవి ఆడెపు భరత్ తదితరులు పాల్గొన్నారు.

NLG: చింతపల్లి సిడిపిఓ కు సమ్మె నోటీసు ఇచ్చిన సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య

నల్లగొండ జిల్లా, చింతపల్లి:

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16 జరుగనున్న కార్మికుల సమ్మె అంగన్వాడి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చింతపల్లి సిడిపిఓ లావణ్య కు సమ్మె నోటీసు ను శుక్రవారం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగా కార్మిక వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించలేదు, అట్లాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు హామీ విస్మరించింది, ఉద్యోగ కల్పన పడిపోయింది, నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట సాయికి చేరింది, శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయి ధరలు నియంత్రిస్తామని చేసిన వాగ్దానం అమలు కాకపోగా నిత్యవసర ధరలు కనివిని ఎరుగని రీతిలో పెరిగాయని ఆయన అన్నారు. 

అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికారు. ప్రతి కార్మికునికి కనీస వేతనం నెలకు రూ. 26,000 నిర్ణయించేందుకు అంగీకరించడం లేదు. అట్లాగే సమ్మే హక్కులను కాల రాస్తుందన్నారు. వివిధ రంగాల్లో వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుంది. 

అట్లాగే పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటలు పని విధాన్ని అమల్లోకి తెస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమదోపిడికి గురిచేస్తున్నారు. అట్లాగే వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్ తగ్గిస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రతికూలికి 200 రోజులు పని కల్పించాలని, రోజువారి వేతనం 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో సుమారు కోటి మంది పనిచేస్తున్న కేంద్ర స్కీమ్ లకు ప్రభుత్వం నిధుల్లో కోత పెడుతున్నారని విమర్శించారు. 

అందుకోసం దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు వ్యవసాయ కూలీలు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏర్పుల యాదయ్య అన్నారు