NLG: లెంకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బాలికల దినోత్సవం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. అని ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపోలు యాదగిరి మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. వారికి సరి అయిన పోషకాహారాన్ని అందించాలని, విద్యను అందించాలని, 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే బాలికలకు వివాహం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వెంకటేష్ యాదయ్య శ్యామల అపర్ణ స్వర్ణలత జానకమ్మ, అంగన్వాడీ టీచర్ చాపల పద్మ, ఆరోగ్య కార్యకర్తలు ఏర్పుల పద్మ, సైదాబీ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Jan 24 2024, 17:28