TS: భూమి సునీల్ కుమార్ ను కలిసిన ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు
నల్లగొండ: ఆల్ ఇండియా బంజారా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్ర ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వారికి తలపాగా చుట్టి, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ సభ్యులుగా వారు ఎంపికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ఇటీవల ధరణి కమిటీ ఏర్పడిందని, సమస్యల పరిష్కారానికి భూ సమస్యలను అధ్యయనం చేసి ఈ కమిటీ మార్గం చూస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ మాట్లాడుతూ.. భూ చట్టాల న్యాయ నిపుణులు ఎం.సునీల్ కుమార్ నల్సార్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, పేదల కోసం భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించారని, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంలో ధరణి సమస్యల పరిష్కారానికి ఏర్పడిన ధరణి కమిటీ సభ్యులుగా భూమి సునీల్ కుమార్ కొనసాగుతున్నారని వారిని సత్కరించడం తమకు ఆనందకరమైన విషయమని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఆర్డీవో ప్రవీణ్ నాయక్,నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్, నరసింహ నాయక్, నాగార్జున నాయక్ పాల్గొన్నారు.
Jan 24 2024, 13:53