/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz AP: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా వైఎస్ షర్మిల Mane Praveen
AP: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ (ఏపీ పీసీసీ) గా వై.ఎస్. షర్మిల నియమితులయ్యారు. ప్రజల ఆకాంక్ష మేరకు షర్మిలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

NLG: జ్ఞాన పథం ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల కేంద్రంలో జ్ఞాన పథం ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, జ్ఞాన పథం క్యాలెండర్ ఆవిష్కరణ మంగళవారం స్థానిక ఎమ్మార్వో శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో జ్ఞాన పథం ఛైర్మన్ చిన్నిక్రిష్ణ మొగిళ్ళ, మండల ఇంచార్జ్ ఈద రమేష్ పాల్గొన్నారు. ఈద రమేష్ మాట్లాడుతూ.. జ్ఞాన పదం ఆర్గనైజేషన్ ద్వారా డ్రాప్ ఔట్ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించడానికి కృషి చేస్తామని తెలిపారు.

మకరజ్యోతి దర్శనమిచ్చింది.. శబరిమలలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది

పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనం

ఇచ్చింది. ఈ ఘట్టాన్ని చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివచ్చారు. అయ్యప్పనామస్మరణతో శబరిగిరులు మారుమోగుతున్నాయి. శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు దర్శనమిస్తుంది. అందుకే దీన్ని శబరిమల మకరజ్యోతి అని పిలుస్తారు.

NLG: ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం:

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలు వట్టిమార్తి గ్రామంలో నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. అంతకు ముందు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బెహన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ.. సమసమాజం నిర్మాంచాలన్నా, బహుజనులకు అన్నివిధాల న్యాయం జరగాలన్నా, అణగారిన వర్గాల అభివృద్ధిని చూడాలన్నా బహుజనసమాజ్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, చిట్యాల మునిసిపల్ అధ్యక్షులు అవిరెండి ప్రశాంత్, మల్లేష్, వినయ్ బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

TS: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన PPL మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నల్లగొండ: ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి.. జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందాన్ని నింపాలని సిరిసంపదలు, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగజేయాలని, కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

NLG: లెంకలపల్లి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ పాక నగేష్

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: లెంకలపల్లి గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి జీవితాలలో ఆనందాన్ని నింపాలని, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందించిన జై భీమ్ సాహో యూత్

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడ: మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు జై భీమ్ సాహూ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మండల స్థాయిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలుగా.. మొదటి బహుమతి అయితగోని విజయ, రెండవ బహుమతి అక్షిత, మూడవ బహుమతి పావని గెలుపొందడం జరిగింది. 

యూత్ ప్రెసిడెంట్ ఈద గిరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి దాత ఉప్పరి శ్రీనివాస్ (ఎస్ఐ నాగోల్), రెండవ బహుమతి సూర్య సత్యనారాయణ, మూడవ బహుమతి వీరమల్ల లోకేష్ డొనేట్ చెయ్యటం జరిగింది. మొదటి బహుమతి రూ. 5016/-, 2వ బహుమతి 4016/-, 3వ బహుమతి రూ3016/- లను విజేతలకు అందజేశారు. అదేవిధంగా చిన్నపిల్లలకు, మ్యూజికల్ చైర్స్, స్పూన్ గేమ్స్ నిర్వహించి బహుమతులు అందించారు. అనంతరం కమిటీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ నల్ల యాదయ్య, నాగోల్ ఎస్సై తుప్పరి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్, లోకేష్, పగడాల రఘు, కోఆర్డినేటర్ గ్యార యాదగిరి, బండ విజయ్, జాజుల రామకృష్ణ, చెలగోని వెంకటేష్, ఈద రమేష్, ఈద సంతోష, తుప్పరి పావని, చెలగొని స్వాతి, ఈద భాస్కర్, ఈద సురేష్, యూసఫ్, ఈద కాశీ, ఈద అభి, మారి, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు. 

NLG: పండుగ వేళ.. దర్వేశిపురం దేవస్థానంలో పెరిగిన భక్తుల రద్దీ..

నల్లగొండ జిల్లా:

కనగల్ మండలం, ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం ఆదివారం భక్తులతో సందడిగా ఉంది. ఈరోజు భోగి పండుగ మరియు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జిల్లాలోని పలుచోట్ల నుండి భక్తులు ఈ ప్రాంతానికి రావడం వల్ల భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనము, ప్రత్యేక దర్శనం కలదు. ప్రత్యేక దర్శనానికి 100 రూపాయలు ఉన్నట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

TS: పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండండి: తెలంగాణ మలిదశ ఓయూ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండండి, డ్రగ్స్ నేరస్తుల పట్ల పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ మలిదశ ఓయూ విద్యార్థి అన్నారు. 

ఆదివారం హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ నేరగాళ్లు స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేయించడం ఆందోళన కలిగిస్తుందని, ఇటీవల జరిగిన కొత్తూరు ప్రభుత్వ పాఠశాల ఉదంతం.. తల్లిదండ్రులలో భయాందోళన కలిగిస్తుందని అన్నారు. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తుల నుండి చాక్లెట్లు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.

డ్రగ్స్ నేరగాళ్లు ముందుగా ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చి తర్వాత చాక్లెట్ రూపంలో డ్రగ్స్ కి అలవాటు చేసే ప్రమాదం ఉందని ఇటీవల జరిగిన ఘటన ద్వారా తెలుస్తుందని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సన్మార్గంలో నడిపించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రేష్మ హుస్సేన్ అన్నారు.

TTD: జనవరి 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం.

తిరుమల: పవిత్రమైన ధనుర్మాసం జ‌న‌వ‌రి14 తో ముగియనుండడంతో జ‌న‌వ‌రి 15వ తేదీ సోమ‌వారం నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.

గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్ల‌వారుజామున 12.34 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో.. శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తి కానుండ‌టంతో.. జనవరి 15 నుండి యధాతధంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. 

అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం.. మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరపనున్నారు.