టీవీ ఛానెళ్ల ప్యాకేజీ ధరల పెంపు..!
దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టర్ లు అయినటువంటి జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్, వయాకామ్18 సంస్థలు తమ ఛానెళ్ల ప్యాకేజీ ధరలను పెంచాయి.
వయాకామ్ 18 తమ ప్యాకేజీల ధరలను 20-25శాతానికి పెంచగా, జీ 9-10%, సోనీ 10-11% పెంచాయి.
త్వరలో డిస్నీ స్టార్ కూడా కొత్త ధరలను ప్రకటించనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని బ్రాడ్కాస్టర్లు పేర్కొన్నాయి.
ఈ పెంపు టీవీ ఛానెల్ బిల్లులపై ప్రభావం చూపనుంది.
Jan 07 2024, 15:46