NLG: ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు
నల్లగొండ: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఆరు వార్డులలో ప్రజా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం 25, 26, 27, 28, 29, 30 వార్డులలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు వార్డ్ నెం.25 అబ్బాసియా కాలనీలోని అంగన్వాడి సెంటర్ దగ్గర నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వార్డ్ నెం. 26 గాంధీ పార్క్, వార్డ్ నెం.27 షేర్ బంగ్లా, వార్డ్ నెం.28 యాదవ సంఘం, వార్డ్ నెం. 29 లైన్ వాడి అర్బన్ హెల్ప్ సెంటర్ దగ్గర మరియు వార్డ్ నెం.30 కమ్యూనిటీ హాల్ లలో వార్డు సభ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రజా పాలనలో 5565 దరఖాస్తులను ప్రజల వద్ద నుంచి స్వీకరించారు. ఇప్పటివరకు మొత్తం
26854 దరఖాస్తులు ప్రజల వద్ద నుండి స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వార్డ్ ఆఫీసర్లు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల గూర్చి ప్రభుత్వం వద్ద నుంచి ఎటువంటి ఫార్మేట్ రాలేదని, వాట్స్అప్ లలో వచ్చే ఫార్మేట్ ను ప్రజలు ఎవరు నమ్మొద్దని స్పష్టం చేశారు.
జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇందుకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు ఫారాలను తీసుకోవద్దని సూచించారు. అందుబాటులో కావలసినన్ని దరఖాస్తులను ఉంచామని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డ్ ప్రజలు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Jan 04 2024, 06:58