నల్గొండ ఖిల్లాను .. బంగారు గడ్డగా మారుస్తా
నల్గొండ ఖిల్లాను .. బంగారు గడ్డగా మారుస్తా
డబ్బు సంచులతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే దొంగలను తరిమి కొట్టాలి..
కేవలం ఐదేళ్ళ కాలంలోనే కరోనా మహమ్మారిని ఎదిరించి నల్గొండను అభివృద్ధి గడ్డగా మార్చానని , మరో దఫా గెలిపిస్తే నల్గొండను అభివృద్ధిలో బంగారు గడ్డగా మారుస్తానని BRS MLA అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.
తిప్పర్తి, మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంచర్ల గారు మాట్లాడుతూ.. గతంలో మట్టి రోడ్లకు కూడా నోచుకోని ఈ పల్లెలన్నీ నేడు సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు 20 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏం లేకనే .. ప్రజల మధ్య డబ్బు సంచుల చిచ్చు పెడుతున్నారని .. వాళ్ళకు అది తప్ప మరోటి తెలియదని ఎద్దేవా చేశారు.
KCR గారి పాలనలో రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందని ఇళ్ళే లేదని.. అందరూ సంక్షేమ పథకాలను పొందుతున్నారని అన్నారు.
కఠిక చీకటిని చీల్చివేసిన అభివృద్ధి వెలుగు మన భూపాలన్న అని... ఈ భూపాలన్న గెలుపు .. మా గెలుపని... అందుకే కారునే గెలిపించుకుంటామని పలు గ్రామాల సర్పంచులు అన్నారు
ఈ కార్యక్రమంలో మాడ్గులపల్లి MPP పోకల విద్య రాజు, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పాలుబట్ల బాపయ్య , Ex.ZPTC తండు సైదులు గౌడ్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ , వైస్ MPPలు సూదిరెడ్డి సుమలత శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, కందుల రేణుక లక్ష్మయ్య (PACS వైస్ ఛైర్మన్), MPTC వెన్న గోవర్దనమ్మ , మాడ్గులపల్లి మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, మండల మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, సర్పంచులు బొర్రొజు సైదమ్మ సైదులు, బెల్లి శ్రీను , శివ , యర్రమాద కవితా నరేందర్ రెడ్డి, నాగయ్య, సిరిగిరి పద్మ , సాలమ్మ శ్రీను....., నాయకులు డాక్టర్ చెరుకు సుహాన్, జీడిపల్లి వెంకట్ రెడ్డి, యరమాద నరేందర్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, వల్లపురెడ్డి యాదగిరి రెడ్డి, మర్రి శ్రీను , మర్రి మధు , ఎస్.కె. కరీం, కమాల్ , రంజాన్, దొంత రాములు, బొస్క మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Nov 17 2023, 07:03