/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మహిళల భద్రతకోసం "షీ టీం"కొత్త ఫోన్ నెంబర్లు Yadagiri Goud
మహిళల భద్రతకోసం "షీ టీం"కొత్త ఫోన్ నెంబర్లు

తెలంగాణలో విద్యార్థినులు, మహిళల భద్రతకోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. షి-టీమ్స్ ద్వారా ఈవ్ టీజింగ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది.

ఆ దిశగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో రెండు నెెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని, ఫోన్ లో ఫీడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీస్ అధికారులు.

తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్‌ ద్వారా నూతన నెంబర్లను వెల్లడించింది.

ఫోన్ ద్వారా 8712656858

వాట్సప్ ద్వారా 8712656856

TS News: తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరం: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు..

ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని భాజపా 25 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, నేటి భారాస ప్రభుత్వంగానీ.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఈ విషయంలో భాజపా రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

గతేడాది సెప్టెంబర్ 17న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌'లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా 'తెలంగాణ విమోచన ఉత్సవాలను' నిర్వహించామని కిషన్‌రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తెలంగాణలో త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. గత ఏడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఎందుకు జరపలేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించడం లేదని ఆరోపించారు..

నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెట్‌ హాల్‌టికెట్లు.. ఈ నెల 15న పరీక్ష

టీఎస్‌ టెట్‌ హాల్‌టికెట్లు నేడు విడుదల కానున్నాయి. నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచనున్నది. ఈనెల 15న టెట్‌ పరీక్ష జరుగునుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు.

ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.inలో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

టెట్‌కు 20 శాతం వెయిటీ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్‌ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్‌ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు...

G20 Summit: భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన మోడీ

G20 Summit: జీ20 సదస్సు భారతదేశంలోని ఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు..

ఢిల్లీని అలంకరించిన తీరు, వచ్చే ప్రపంచంలోని పెద్ద నాయకులందరూ భారతదేశ సంస్కృతిని గుర్తుంచుకోవాలని ప్రయత్నించారు. విదేశీ అతిథులు వచ్చే చోట భారతీయ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈవెంట్ అందాన్ని మరింత పెంచాయి. భారతదేశం గొప్ప సంస్కృతి, చారిత్రక వారసత్వం గురించి ప్రపంచానికి తెలియజేసే అవకాశం కూడా లభిస్తుంది. భారతదేశం తన సంస్కృతిని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు..

వేదికైన భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. ఆ సందర్భంలో ఒడిశాకు చెందిన కోణార్క్ చక్రాన్ని ప్రదర్శించారు. ఈ కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ్-I పాలనలో రూపొందించడింది. ఈ చక్రం భారతదేశ ప్రాచీన జ్ఞానం, నాగరికత, వాస్తుశిల్పం ఔన్నత్యానికి చిహ్నం. కోణార్క్ చక్రం భ్రమణం కాలచక్రంలో నిరంతర పురోగతి, మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య చక్రానికి శక్తివంతమైన చిహ్నంగా కూడా పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్య ఆదర్శాలకు, సమాజంలో పురోగతికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

Revanth : ఎరువుల కోసం రైతులు క్యూలో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలలాగే మాట ఇచ్చి వదిలేశారన్నారు..

కేసీఆర్ మాట ఇచ్చి నిలబడరని మరోసారి రుజువైందన్నారు. పైసలిచ్చి కొనుగోలు చేద్దామన్నా ఎరువులు దొరకడం లేదన్నారు. ఎరువుల కోసం రైతులు బారులు తీరారని రేవంత్ పేర్కొన్నారు.

ఎరువుల కోసం రైతులు క్యూ లో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం సొంత జిల్లా లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.యూరియా నిల్వలు పెట్టాలనే సోయి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఎరువులను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ కోరారు..

AP News: ఏపీలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

విశాఖ: అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు..

తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులూ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసుల ఆదేశాలు, సూచనల మేరకే బస్సులు రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

విశాఖ ద్వారకానగర్‌ బస్ స్టేషన్‌లో ప్రయాణికులను కిందకు దించేసి బస్సులను డిపోలకు తరలించారు. టికెట్లు తీసుకున్నా ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇచ్చారు. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులను వేచి ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ఉదయాన్నే దూర ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చిన వారంతా వెనుతిరిగారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి ఒక్క బస్సు కదలలేదు. విశాఖలో సిటీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కడప ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఒక్క బస్సును కూడా పోలీసులు బయటికి పంపలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కదల్లేదు.

చంద్ర‌బాబు ఆరెస్ట్ ను ఖండించిన : ఏపీ బీజేపీ నేత పురందీశ్వ‌రీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు.

ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని… సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు...

చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కామెంట్

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరిట 550 కోట్ల స్కామ్ జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి 371 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. నకిలీ ఇన్ వాయిస్ ద్వారా సెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తెలిపారు. అలాగే తమ దర్యాప్తులో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడే అని తేలిందన్నారు.

అన్ని లావాదేవవీలు చంద్రబాబుకు తెలిసే జరిగినట్లు చెప్పారు. అలాగే ఈ స్కామ్‌కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఆరోపించారని తెలిపారు. ఈడీ, జీఎస్‌టీ ఏజెన్సీలు కూడా ఈ స్కాంపై దర్యాప్తు చేశాయన్నారు.

అంతేగాక ఈ స్కామ్‌లో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే అని, న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. 2014 జూలై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సంస్థ బాధ్యతలు గంట సుబ్బారావు అప్పగిస్తూ ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారని చెప్పారు. లోకేష్ పాత్రతో పాటు ఇతరుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై విచారణ చేస్తామన్నారు..

చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్

- అనుభవం ఉంటే అరెస్టు చేయకూడదా?

- స్కిల్ పేరుతో.. రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు

- హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయి.

-ః రాష్ట్ర, విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనుభవం ఉంటే అరెస్ట్ చేయరా..?

-స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా?

- కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారు

- మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజక్ట్ లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో.. ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ. 371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారు.

- ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ- ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది..? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడు.

- ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయి

-సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు

- వారంతా ఈ కుట్రలో పాత్రధారులు... సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు

- కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారు

- షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారు

హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయి

- ఆ డబ్బులు అన్ని చంద్రబాబు కు, ఆ పార్టీ వారికి చేరాయి

- ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే... అయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేదు

- అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే... చంద్రబాబు సిఐడిని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుంది

- ఐటి నోటీసులు ఇస్తే... ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డోగొలు వాదనలు చేశారు

- ప్రభుత్వ ధనాన్ని దొచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది

- అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసింది

- చంద్రబాబు బంధువు, బీజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ వీళ్ళందరి కళ్ళకు స్కాము.. కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం.

- పురంధేశ్వరి గారు ఈ 371 కోట్లు చంద్రబాబు తిన్నారా లేదా అని చెప్పాలి.

- అప్పుడున్న సీపీఐ నారాయణ , ఇప్పుడు ఉన్న నారాయణ వేరు

- అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు... ఇప్పుడు చంద్రబాబు భావజాలంతో పని చేస్తున్నారు.

ఓటుకు కోట్లు కేసులోనూ ఇదే అడ్డగోలు వాదన

-ఓటుకు నోటు కేసులో కూడా ఇదేవిధంగా అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు

-ఆనాడు కూడా ఎల్లో మీడియా ఇదేవిధంగా చంద్రబాబు కు మద్దతు తెలిపింది... ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయి

-రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు

-సిఐడి ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేశారు

- ఇన్నర్ రింగ్ రోడ్, ఏపి ఫైబర్ నెట్ స్కాముల్లో కూడా అవకతవకలు జరిగాయి... అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు

- పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైసిపి కార్యకర్త కూడా లేరు

- రూట్ మ్యాప్ మార్చి పుంగనూరు లోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే..... పోలీసులు అడ్డుకున్నారు.

- ఆరోజు టిడిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగింది.

తిరుమల నడక మార్గంలో కంచె ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు

తిరుమ‌ల న‌డ‌క మార్గంలో భ‌క్తుల ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై టీటీడీ సీరియ‌స్‌గా దృష్టి సారించింది. ఇప్ప‌టికే భ‌క్తుల‌కు క‌ర్ర‌ల పంపిణీకి టీటీడీ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే.

క‌ర్ర‌లు ఇవ్వ‌డంతోనే భ‌క్తుల భ‌ద్ర‌త బాధ్య‌త‌లు తీరిపోయిన‌ట్టు కాద‌ని, కొంత వ‌ర‌కూ ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చేందుకు దోహ‌దం చేస్తాయ‌ని టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే.న‌డ‌క దారి భ‌క్తులు క్రూర‌మృగాల బారిన ప‌డ‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో ఆలోచిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

ఇప్ప‌టికే మూడు నెల‌ల కాలంలో ఐదు చిరుత‌ల‌ను టీటీడీ, అట‌వీఅధికారులు సంయుక్తంగా ప‌ని చేసి ప‌ట్టుకున్నారు. మ‌రిన్ని చిరుత‌లు సంచ‌రిస్తున్నాయ‌ని సీసీ కెమెరాల ద్వారా ప‌సిగ‌ట్టారు. దీంతో న‌డ‌క దారి భ‌క్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు కంచె ఏర్పాటుకు టీటీడీ క‌స‌ర‌త్తు చేస్తోంది.ఇనుప కంచె ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తిని టీటీడీ కోరింది.

అయితే కంచె ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల చిరుత‌ల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టు అవుతుంద‌నే అభిప్రాయాన్ని అట‌వీశాఖ అధికారులు కొట్టి పారేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 12న ఎక్స్‌పర్ట్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. అలిపిరి, శ్రీ‌వారి మెట్టు నడకమార్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారి స‌మాచారం. 

ఈ క‌మిటీ నివేదిక ఆధారంగా న‌డ‌క మార్గాల్లో ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలో టీటీడీ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం వుంది. మ‌రోవైపు ఆప‌రేష‌న్ చిరుత కార్య‌క్ర‌మాన్ని అట‌వీశాఖ‌తో క‌లిసి టీటీడీ కొన‌సాగిస్తోంది. భ‌క్తుల భ‌ద్ర‌తే మొద‌టి ప్రాధాన్యం కింద చిరుత‌ల‌ను పట్టుకుంటామ‌ని టీటీడీ ఉన్న‌తాధికారులు చెప్ప‌డం విశేషం...