గులాబీ గూటికి యూత్ కాంగ్రెస్ నాయకులు
బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
తాజాగా తొర్రూరు మండలం సోమవారపు కుంట తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ అధ్వర్యంలో గురువారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. నూతనంగా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం గెలువడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు........
Sep 07 2023, 17:51