/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz త్వరలో నల్లగొండ ఐటీ హబ్‌ ప్రారంభం... Miryala Kiran Kumar
త్వరలో నల్లగొండ ఐటీ హబ్‌ ప్రారంభం...

త్వరలో నల్లగొండ ఐటీ హబ్‌ ప్రారంభం

ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్టిపేట, నిజామాబాద్‌ నగరాల తర్వాత ఇప్పుడు త్వరలో నల్లగొండలో ఐటీ హబ్‌ ప్రారంభం కానున్నదని ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. కొద్ది వారాల్లోనే ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్నదని పేర్కొం టూ, తుది దశ నిర్మాణ పనులు సాగుతున్న ఫొటోలను షేర్‌ చేశారు.

సింగపూర్‌ అధ్యక్షుడికి శుభాకాంక్షలు

సింగపూర్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్‌ షణ్ముగరత్నంకు మంత్రి కేటీఆర్‌ శనివారం ఎక్స్‌వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఆయనతో సమావేశమయ్యే అవకాశం లభించిందని పేర్కొంటూ దావోస్‌లో షణ్ముగరత్నంతో కలిసిన ఫొటోలను పోస్ట్‌చేశారు.

చంద్రయాన్‌ స్ఫూర్తితో సూర్యయాన్‌:కృష్ణ మోహన్ నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)

చంద్రయాన్‌ స్ఫూర్తితో సూర్యయాన్‌

చంద్రయాన్‌-3 విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరో అద్భుతానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ అద్భుతమే సూర్యయాన్‌ మిషన్‌. ఈ మిషన్‌లో భాగంగా సౌరవాయు ఆవర్తనాన్ని సుదూరం నుంచి పరిశీలించడానికి, సూర్యుని వెలుపల ఉన్న పొరలు, సౌరశక్తి కణాలు, వేర్వేరు తరంగ పౌనఃపున్యాల వద్ద ఫోటోస్పియర్‌ (కాంతి మండలం), క్రోమోస్ఫియర్‌ (వర్ణ మండలం)ను ఆధ్యయనం చేయనున్నారు.

కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని, పిఎస్‌ఎల్‌ వి-సి 57 వాహననౌక ద్వారా సెప్టెంబర్‌ 2న శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి పంపబోతున్నారు. గ్రహణాలు వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారకుండా భూమికి సుమారుగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్‌ పాయింట్‌1 చుట్టూ ఉన్న కక్య్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుండి ఈ కేంద్రానికి చేరుకోవడానికి ఉపగ్రహ వాహక నౌకకి సుమారుగా 175 రోజులు పడుతుంది. ఈ ఉపగ్రహం బరువు 1500కిలో గ్రాములు. ఇది ఏడు పేలోడ్‌లను మోసుకెళ్తుంది. ఆ పేలోడ్లులలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనా గ్రాఫ్‌, సోలార్‌ అల్ట్రా వైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్పరిమెంట్‌, ప్లాస్మా ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లోఎనర్జీ ఎక్స్‌ రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌ వన్‌ ఆర్బిటింగ్‌ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగటోమీటర్లు ఉన్నాయి.

వీటిలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ ప్రధానమైనది. ఇది సూర్యగోళం నుండి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే ఈ మిషన్‌కు అవసరమైన పరికరాలను బెంగళూరులోని యుఆర్‌ రావు శాటిలైట్‌ కేంద్రం నుండి షార్‌ కేంద్రానికి తీసుకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ సజావుగా జరిగితే అక్టోబర్‌లోనే గగనయాన్‌ ప్రయోగానికి శ్రీకారం చుడతారు.

ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి మహిళా రోబో వ్యోమమిత్రను మొదటగా పంపి, 2024 ఆఖరి నాటికి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపే ఆలోచన చేస్తున్నారు. 2023 మనదేశ అంతరిక్ష చరిత్రలో గుర్తుండి పోయే సంవత్సరం. రెండు నెలల వ్యవధిలోనే చంద్రయాన్‌ విజయం, సూర్యయాన్‌ ప్రయోగం చేపడుతున్న ఇస్రోకు అభినందనలు.

ఆపరేషన్‌ ఆదిత్య- ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం

ఆపరేషన్‌ ఆదిత్య- ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం

Aditya L1 Mission: సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది..

తిరుపతి జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతోంది. మరో 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనున్నది.

రేపు ఉదయం సరిగ్గా 11.50 గంటలకు ఆదిత్య - ఎల్ 1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి -సి 57 వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్ళబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. రాకెట్ ప్రయోగానికి మిషన్ సన్నద్దతా సమావేశం పచ్చ జెండా ఊపింది..

రేపే గ్రేటర్ హైదరాబాద్ లో ఇండ్ల పండుగ...

రేపే ఇంటి పండుగ

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది.

ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్‌లో ఒకేరోజు 11, 700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

గ్రేటర్‌లో శనివారం డబుల్‌ బెడ్రూం గృహాల కేటాయింపు

తొమ్మిది ప్రాంతాల్లో లాటరీ ద్వారా ఎంపిక

పంపిణీ చేయనున్న ఏడుగురు మంత్రులు, మేయర్‌, డిప్యూటీ స్పీకర్‌

బహదూర్‌పల్లిలో 1700 లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌.. పటాన్‌చెరులో 3,300 మందికి అందజేయనున్న మంత్రి హరీశ్‌రావు

ఒకే రోజు 11,700 ఇండ్ల పంపిణీ

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది.

 ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్‌లో ఒకేరోజు 11, 700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం బల్దియా పరిధిలోని తొమ్మిది ప్రాంతాలను వేదికలుగా ఏర్పాటు చేశారు. ఏడుగురు మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్‌, మేయర్‌ లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ముఖ్యంగా బహదూర్‌పల్లిలో జరిగే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ 1700 మందికి.. పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు 3,300 మందికి పంపిణీ చేయనున్నారు.

 అగ్గిపెట్టెలాంటి రేకుల షెడ్డు.. ఒకే ఒక్క గది.. దానికి నెలకు రూ.3-4వేల అద్దె. యజమానికి ఎప్పుడు ఉండమంటాడో.. ఎప్పుడు ఖాళీ చేయమంటాడోనని క్షణక్షణం భయపడుతూ జీవనం. ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సగటు నిరుపేద పరిస్థితి. ఇలాంటి నిరుపేదకు సొంతింటి సాకారం సాధ్యమా? కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాకారం చేస్తున్నది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకడంతో పాటు మహా నగరంలో ఖరీదైన సొంతింటి కలను నెరవేర్చుకునే అదృష్టాన్ని కల్పించింది. అలా.. ఇలా.. కాదు… రెండు పడకలతో బహిరంగ మార్కెట్‌లో రూ.30-40 లక్షల విలువ చేసే పక్కా ఇంటిని నిర్మించి ఇస్తున్నది. సీఎం కేసీఆర్‌ ఆలోచనలో భాగంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు అందించే సుముహూర్తం రానే వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు కానుకగా అందిస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ప్రభుత్వం..

ఆ మహా క్రతువును వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేలాది ఇండ్లను నిరుపేదలకు అందించగా నిర్మాణాలు పూర్తయిన దాదాపు 70వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అందులో భాగంగా శనివారం ఒక్కరోజే ఏకంగా 11,700 డబుల్‌ బెడ్రూం ఇండ్లను గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సుమారు 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన దరిమిలా వారికి ఇండ్లను పంపిణీ చేసేందుకుగాను జీహెచ్‌ఎంసీ పరిధిలో తొమ్మిది ప్రాంతాలను వేదికగా ఏర్పాటు చేశారు. ఏడుగురు రాష్ట్ర మంత్రులు, మేయర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్‌ ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన 11,700 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు.

కుత్బుల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్‌

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో 1700 గృహాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేస్తారు. గాజులరామారం (144), బహదూర్‌పల్లి (356), డి-పోచంపల్లిల్లో 1700 ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. గాజులరామారం (144), బహదూర్‌పల్లి (356) ఇండ్లను కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. డి-పోచంపల్లిలో నిర్మించిన 1200 గృహాలను సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి చెందిన 200మంది, సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని 500మంది, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

చాంద్రాయణగుట్టలో హోంమంత్రి మహమూద్‌ అలీ

చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వే నంబరు 82, 83/పిలో నిర్మించిన 270 గృహాలు, బహదూర్‌పుర నియోజకవర్గం ఫారూక్‌నగర్‌లో నిర్మించిన 770 గృహాను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ పంపిణీ చేస్తారు. బండ్లగూడ పరిధిలో నిర్మించిన ఇండ్లను చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేయనుండగా, ఫారూక్‌నగర్‌లో నిర్మించిన ఇండ్లను బహదూర్‌పుర నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు

పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-1, అమీన్‌పూర్‌-2లో నిర్మించిన 3,300 గృహాలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పంపిణీ చేయనున్నారు. కొల్లూరు-1లోని 1500 గృహాలను ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన 200 మంది, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి చెందిన 500 మంది, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 156 మంది, రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన 144 మంది, పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన 500 మందికి పంపిణీ చేస్తారు. అదేవిధంగా అమీన్‌పూర్‌-2లో నిర్మించిన 1800 గృహాలను గోషామహల్‌ నియోజకవర్గానికి చెందిన 500 మంది, నాంపల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది, కార్వాన్‌కు చెందిన 500 మంది, ఖైరతాబాద్‌కు చెందిన 300 మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.

శేరిలింగంపల్లిలో మంత్రి తలసాని

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల సర్వే నంబరు 125లో నిర్మించిన 216 గృహాలు, సాయినగర్‌ హఫీజ్‌పేట్‌కు చెందిన 168 ఇండ్లను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పంపిణీ చేయనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని గృహాలను శేరిలింగంపల్లి పరిధిలోని లబ్ధిదారులకు అందజేయనున్నారు.

మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడలో నిర్మించిన 1500 గృహాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేయనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన 500 మంది, ముషీరాబాద్‌కు చెందిన 500 మంది, సికింద్రాబాద్‌కు చెందిన 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను పంపిణీ చేయనున్నారు.

రాజేంద్రనగర్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి

రాజేంద్రనగర్‌లో నిర్మించిన 356 డబుల్‌ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు. నార్సింగి, బైరాగిగూడ-2 ప్రాంతంలో నిర్మించిన 160 ఇండ్లు, నార్సింగి సర్వే నంబరు 117లో నిర్మించిన 196 గృహాలను రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

ఉప్పల్‌లో మేయర్‌ విజయలక్ష్మి

ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్‌కాలనీ (సర్వే నంబరు 710/పి)లో నిర్మించిన 500 గృహాలను జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పంపిణీ చేయనున్నారు. ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఈ గృహాలను అందజేయనున్నారు.

ఘట్‌కేసర్‌ ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్‌

మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలోని ప్రతాపసింగారంలో నిర్మించిన వెయ్యి గృహాలను శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు గౌడ్‌ పంపిణీ చేయనున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గానికి చెందిన 500 మంది, అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మరో 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను అందజేయనున్నారు.

త్వరలోనే రెండో విడత దళిత బంధు...

త్వరలోనే రెండో విడత దళిత బంధు

దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో.. రెండో విడత దళిత బంధు పథకాన్ని అందించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో జిల్లా పరిధిలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు దళిత బంధును అందించారు.

జిల్లా వ్యాప్తంగా 5500 మంది లబ్ధిదారులకు దళిత బంధు వర్తింపు

దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో.. రెండో విడత దళిత బంధు పథకాన్ని అందించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో జిల్లా పరిధిలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు దళిత బంధును అందించారు. దీంతో లబ్ధిదారులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా పయనిస్తున్నారు. రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా 5,500 మందికి దళిత బంధును వర్తింపజేసేలా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రెండో విడతలో నియోజకవర్గానికి 11 వందల మందికి దళిత బంధును వర్తింపజేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో త్వరలోనే అర్హుల జాబితాను ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

జాబితా ఎంపికకు ప్రత్యేక అధికారులు..

దళిత బంధు పథకాన్ని అర్హులకు అందించేందుకు జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో పాటు కొంత భాగం పరిధిలోకి వచ్చే శేరిలింగపల్లి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, జాబ్లీహిల్స్‌ నియోజకవర్గాలకు 9 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. దళిత బంధు పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన వంటి పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

దళారులను నమ్మవద్దు

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోంది. దళారుల మాటలు నమ్మవద్దు. ప్రజాప్రతినిధుల, అధికారుల పేర్లు చెప్పి కొందరు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తుంది. త్వరలోనే రెండో విడత దళిత బంధు పథకం వర్తింపజేసేందుకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు తమకు ప్రావీణ్యం ఉన్న వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

-బాలాజీ, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారి

మరో గుడ్​ న్యూస్​… వీఓఏల వేతనం పెంపు..

మరో గుడ్​ న్యూస్​… వీఓఏల వేతనం పెంపు

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్ల (VOA )ల వేతనం పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. రాష్ట్రంలో 18,405 మంది VOA లు రూ.500 నుంచి రూ.1,500 వరకు వేతనం మాత్రమే పొందుతున్నారు. ఆయా సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వేతనాలు అందుతున్నాయి. అయితే వీరు చేసే పనికి, వస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదని రాష్ట్రంలోని VOA లు ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు. గ్రామైక్య సంఘాలు ఇచ్చే డబ్బులతో పాటు ప్రభుత్వం కూడా తమకు కొంత వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో వి.ఓ.ఎ.లు అప్పటి సమైక్య ప్రభుత్వానికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లభించలేదు.



ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మార్చి 13న ప్రగతి భవన్లో వి.ఓ.ఏ.లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతీ VOA లకు నెలకు రూ.5వేల జీతం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామైక్య సంఘాలు రూ.2వేలు చెల్లించాలని, ప్రభుత్వం రూ.3వేలు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తన వాటాను సెర్ప్‌ ద్వారా చెల్లిస్తుందన్నారు. గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యత సూపర్‌ వైజర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.



”గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవ్వాలి. రాష్ట్రంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయి. మంచిపేరు వచ్చింది. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడపాలి. గ్రామాల్లో దొరికే వస్తువులను మార్కెట్‌ అవసరాలు తీర్చే విధంగా డ్వాక్రా సంఘాల మహిళలు ప్రాసెసింగ్‌ చేయాలి. కారంపొడి, పసుపు పొడి, పాపడాలు, కార, బూంది లాంటి డిమాండ్‌ ఉన్న వస్తువులను తయారు చేయాలి. అప్పుడు ప్రజలకు కల్తీలేని సరుకులు దొరుకుతాయి. మహిళలకు ఉపాధి లభిస్తుంది. డ్వాక్రా మహిళలకు అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తాం. వేరే రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో మహిళా సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాలి. పూర్తి స్థాయి కార్యక్రమాన్ని రచించి అమలు చేస్తాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.



మంత్రులు టి. హరీష్‌ రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీశ్‌ శర్మ, సెర్ప్‌ సిఇవో నీతూ ప్రసాద్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు ఎవరైనా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీని గెలిపించుకోవాల్సిందే

ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు ఎవరైనా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీని గెలిపించుకోవాల్సిందే

ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు ఎవరైనా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీని గెలిపించుకోవాల్సిందేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

పార్టీ టికెట్ దక్కిన వారు అసమ్మతి లేకుండా అందరిని కలుపుకు పోవాలన్నారు. అభ్యర్థులను మార్చినా మార్చకున్నా పార్టీని గెలిపించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఓర్పు చాలా అవసరమని, ప్రస్తుతం నాయకుల్లో ఓపికలు తగ్గాయన్నారు. గ్రూపులు కట్టడానికి, అసాంఘిక శక్తులకు నేను దూరమని, పాముకు పాలు పోసి పెంచొద్దన్నారు. రాజకీయాల్లో కులాలకు, మతాలకు ప్రాధాన్యత ఉండదని, ప్రజలకు మమేకమైన వారికే ఆదరణ ఉంటుందన్నారు.

తమ మధ్య ఉండే సమస్యలను కొంత మంది నేతలు కులాలకు ఆపాదిస్తున్నారన్నారు. నా రాజకీయ జీవితంలో ఆరోపణలు కేసులు లేవన్నారు. నేనెవరి పనుల్లో జోక్యం చేసుకోనని, గౌరవ ప్రదమైన బాధ్యతల్లో ఉన్నానని, గౌరవ ప్రదంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిక్లరేషన్స్ అన్ని అమలు సాధ్యం కావన్నారు.

ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్న నల్లగొండ ఐటి హబ్ను సందర్శించిన ఎమ్మెల్యే కంచర్ల

ఐటీ హబ్ ను సందర్శించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు

నల్లగొండలో తుది మెరుగులు దిద్దుకొని ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నా ఐటీ హబ్ ను సందర్శించిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు   నల్లగొండలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి అని అత్యాధునిక టెక్నాలజీ కార్పొరేట్ హాంగులతో విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్ అతి త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే ఈ ఐటీ టవర్ లో కార్యకలాపాల నిర్వహణకు ఆయా కంపెనీలతో ఐటి శాఖ ఒప్పందని కుదుర్చుకుందని దానికి సంబంధించిన జాబ్ మేళా ను కూడా ఇప్పటికే స్థానిక లక్ష్మి గార్డెన్స్ లో సెప్టెంబర్ 01.వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ..

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారితో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) మరియు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు మరియు మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు స్థానిక కౌన్సిలర్లు మరియు ఐటి టవర్ నిర్మాణ సంస్థ మరియు ఇతరులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ ఏరియార్స్ వెంటనే చెల్లించాలి-AITUC

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ ఏరియార్స్ వెంటనే చెల్లించాలి-AITUC

  

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 2021 ఏప్రిల్ నుండి పెరిగిన డిఏ డిఏ బాపతో ఏరియర్స్ డబ్బులను వెంటనే చెల్లించాలని ఏఐటీయుసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ,రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య లు డిమాండ్ చేశారు.

బుధవారం నాడు సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సివిల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో డివైయస్ఇ సి.బానుప్రసాద్ గారికి మరియు కార్పొరేటు సివిల్ డివైయస్ఇ ఏ.రవికుమార్ గారికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2021 ఏప్రిల్ నుండి సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా రివైజు అయిన డిఏ బాపతు పెండింగ్ ఏరియర్స్ చెల్లింపులో సింగరేణి అధికారులు జాప్యం చేయడం సరికాదని విమర్శించారు.తక్షణమే పెండింగ్ ఏరియర్స్ చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం చంద్రశేఖర్,నరసింహ, ప్రభాకర్,ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

_పారిశ్రామిక కార్మికులు గా ఉన్నా ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండేలా చూడాలి

_పారిశ్రామిక కార్మికులు గా ఉన్నా ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండేలా చూడాలి

పారిశ్రామిక కార్మికులుగా ఉన్న ఆర్టీసి కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వుండేలా చూడటం, అమలులో వున్న అలవెన్సులను పూర్తిగా కొనసాగించాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నల్గొండ డిపో గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య . ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

  

 బుధవారం ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఆర్టీసీ విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు అనే బుక్ లెట్ ను నలగొండ డిపోలో ఆవిష్కరించి అనంతరం ఆర్ ఎం శ్రీదేవి కి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులు పారిశ్రామిక కార్మికులని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని పరిస్థితులకు, ఆర్టీసి కార్మికుల పని పరిస్థితులకు పూర్తి తేడా వుంటుందని అన్నారు. ఆర్టిసి కార్మికులకు స్థిరమైన పద్ధతిలో పని దినం వుండదు. ఒక రోజు తెల్లవారుఝామున వెళితే, మరో రోజు మరో సమయంలో డ్యూటీకి వెళ్ళవలసి వస్తుంది. ఇంటి భోజనం తినడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. బయట హోటల్లోనే భోజనం చేయాలి. అలాగే పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా ధైర్యంగా పని చేయాలి. అనుకోని పద్ధతిలో తమ తప్పు లేకపోయినా, ఎదుటివారి తప్పిదాల వలన జరిగే ప్రమాదాలలో కూడా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తమ ప్రాణానికి ముప్పు ఏర్పడిందని తెలుస్తున్న సందర్భాలలో కూడా ప్రయాణీకులను సురక్షితంగా వుండేలా చూసి, స్టీరింగ్ పైనే తమ ప్రాణాలను విడిచిన ఘటనలు కార్మికుల వారి క్రమ శిక్షణకు, అంకిత భావానికి నిదర్శనాలు.అటువంటి క్లిష్టతర పరిస్థితిలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా వుండాలని 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (జులై 20, 21 - 2015) కూడా నిర్దేశించింది. కావున ఆర్టీసి కార్మికులకు 2017, 2021 సం॥లలో రావలసిన వేతన ఒప్పందాలను అమలు చేసి, ఆ పిమ్మట ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కువగా వుండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుఅలాగే,65 సం॥రాల ఆర్టీసి ప్రస్తానంలో (ఉమ్మడి ఆర్టీసి గాను, టీఎస్ ఆర్టీసిగాను) కార్మికోద్యమం చేసిన ఆందోళనలు,ఐక్య పోరాటాలతో సంస్థను బ్రతికించుకోవడంతో పాటు, అనేక అలవెన్స్ లను, సౌకర్యాలను సాధించుకొన్నారు అవన్నీ కూడా పారిశ్రామిక వివాదాల చట్టం - సెక్షన్ 12 (3) క్రింద ఒప్పందం చేసుకొన్నా విలీనం అనంతరం కూడా ఆ అలవెన్స్లు,సౌకర్యాలను కొనసాగిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వున్న మెరుగైన సౌకర్యాలు, అలవెన్స్లు ఆర్టీసీ కార్మికులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు

  

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ చంద్రమౌళి డిపో కార్యదర్శి బోడ స్వామి రీజియన్ సహాయ కార్యదర్శి శ్యాంసుందర్ ,సాధిక్ పాష , శ్రీరాములు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు