/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై సహజ ప్రకంపనలు..? Yadagiri Goud
Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై సహజ ప్రకంపనలు..?

బెంగళూరు: జాబిల్లిపై శాస్త్రీయ పరిశోధనలు సాగిస్తోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పేలోడ్‌లు.. ఆసక్తికర సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్‌ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని ఇప్పటికే చేరవేశాయి..

ఈ క్రమంలోనే విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander)లోని ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ (ILSA) పేలోడ్‌.. తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేయడం గమనార్హం. ఈ మేరకు ఇస్రో (ISRO) ఓ ట్వీట్‌ చేసింది..

'చంద్రయాన్‌-3 ల్యాండర్‌లోని 'ఇల్సా' పేలోడ్‌.. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌, ఇతర పేలోడ్‌ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలు నమోదు చేసింది. వీటికి అదనంగా.. అక్కడ సహజంగా ఏర్పడినట్లు భావిస్తోన్న ప్రకంపనలనూ గుర్తించింది. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది. వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది. ఇదిలా ఉండగా.. 'ఇల్సా' పేలోడ్‌.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) సాంకేతిక ఆధారిత పరికరం' అని ఇస్రో తెలిపింది. 'ఇల్సా' పేలోడ్‌ను 'లేబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో- ఆప్టిక్స్‌ సిస్టమ్స్‌' రూపొందించిందని వెల్లడించింది. దాన్ని చంద్రుడి ఉపరితలంపై మోహరించే యంత్రాంగాన్ని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని తెలిపింది..

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్‌ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

SB NEWS

ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

శాలిగౌరారం:

అన్నా చెల్లెళ్లు,అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత, మమతానురాగాలు వెలకట్టలేనివని,వారి అన్యోన్యమైన అనుబంధానికి శుభసూచికగా నిలిచే రాఖీ పౌర్ణమి ఒక కుటుంబంలోనే కాక యావత్‌ సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని సామాజిక ఉద్యమకారులు వేముల గోపీనాథ్ అన్నారు.

ఈ సందర్భంగా

రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరిమణులు రాఖీ కట్టారు.గోపీనాథ్ సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.

రక్షా బంధన్‌ ఒక వేడుక మాత్రమే కాదని, కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటుతుందన్నారు.

డీఎస్సీకి అభ్య‌ర్థులు ఏకాగ్రతతో ప్రిపేర్ కావాలి: మంత్రి సబిత ఇంద్రారెడ్డి!

త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు అభ్య‌ర్థులు ప్రిపేర్ కావాల‌ని, రాజ‌కీయ నేతల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి గురువారం అధికారుల సమావేశంలో స్ప‌ష్టం చేశారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొంత మంది వ్యక్తులు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీని డీఎస్సీకి అప్పగించామని మంత్రి పేర్కొన్నారు.

ఉపాధ్యాయ ఖాళీల విషయంలో తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి స‌బిత‌ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి పెద్దపీట వేస్తుండటాన్నికాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు.

గడచిన తొమ్మిది సంవత్సరాల్లో విద్యా రంగం అభివృద్ధి కోసం రూ. 1,87,269 కోట్లు ఖర్చు చేశామంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్ధమవుతుందని తెలిపారు.తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2017లో మొదటిసారి 8,972 పోస్టులను భర్తీ చేయడం కోసం డీఎస్సీ నిర్వహించడం జరిగిందని వివరించారు.

ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమ‌రీ స్కూల్ హెడ్‌మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టులను, 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌న్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ, నూతన నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీలు ఏమైనా ఉంటే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత గురుకులాల్లో 11 ,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, 12 ,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ సమయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల ఖాళీల భర్తీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రక్రియను అడ్డుకొనే వారి మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై అనుచిత విమర్శలు చేస్తున్న నాయకుల మాటలను విశ్వసించకుండా నిరుద్యోగులు డీఎస్సీకి సిద్దమై విజయం సాధించాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.......

హైదరాబాద్ పోలీసుల అదుపులో పాక్ యువకుడు

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు అక్రమంగా హైదరాబాద్‌కు రావడం కలకలం రేపుతోంది. నేపాల్ మీదుగా అతడు భారత్‌లోకి ప్రవేశించి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని మొహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు.

దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ కొన్ని నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమె.. గర్భం దాల్చినట్లు అతడికి తెలిపింది. భార్యను కలుసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులతో ఫయాజ్ చెప్పాడు.

వీసా లేకుండా భారత్‌లోకి ఫయాజ్ అక్రమంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని ఫయాజ్ భార్య ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఫయాజ్ చెప్పిన విషయాలు నిజమా, కాదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది...

బండి సంజయ్ అమెరికా పర్యటన

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పాటు ఆయన యూఎస్‌లోనే ఉండనున్నారు.

సెప్టెంబర్ 1 శుక్రవారం తెల్లవారుజామున బండి సంజయ్ యూఎస్‌కు పయనం కానున్నారు. శనివారం సెప్టెంబర్ 2 అట్లాంటాలో జరిగే ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 15వ వార్షికోత్సవంలో బీజేపీ ఎంపీ ప్రసంగించనున్నారు.

వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పర్యటన ఖరారైంది.

అక్కడి తెలుగు ఎన్నారై సంఘాలతో ఆయన భేటీ అవుతారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, కళా, సాహిత్య, నాటక, సేవా, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశాల్లో పొల్గొననున్నారు.

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిక ఈ రాఖీ పండుగ: ఎమ్మెల్సీ కవిత ట్విట్

రాఖీ పండుగ అంటేనే అనుబంధాల‌కు ప్ర‌తీక‌. త‌మ సోద‌రుల‌కు తోబుట్టువులు రాఖీ క‌ట్టి.. ఈ అనుబంధం క‌ల‌కాలం కొన‌సాగాల‌ని కోరుకుంటారు. ఒకరికొక‌రు ఆశీర్వాదం తీసుకుంటారు. అంత‌టి ప్ర‌త్యేక‌మైన రాఖీ పండుగ రోజు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.

అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’ అంటూ మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

రాఖీ పండుగ నేప‌థ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ ట్విట్టర్‌ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. అన్నాచెల్లెళ్ల‌ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు......

వీఓఏలకు తెలంగాణ సర్కారు గౌరవ వేతనం పెంపు!!

వీఓఏలకు తెలంగాణ సర్కారు రాఖీ పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. వీఓఏలకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రూ.3,900 నుంచి రూ.5వేలకు వేతనాన్ని పెంచింది. అదనపు సాయం రూ.3వేలతో కలిపి నెలకు రూ.8వేలను వీఓఏలు అందుకోనున్నారు.

ఈ మేరకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 17,608 మంది వీఓఏలకు లబ్ధి చేకూరనుంది...

ప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులాంటివారు :హరీష్‌రావు ఎద్దేవా

నకిలీ హామీలు, వెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాలు పని అంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు. మొన్న అమిత్ షా, నిన్న ఖర్గే వచ్చి పేపర్ పై రాసిచ్చిన హామీలు చదివి వెళ్లారన్నారు. వారికి రాష్ట్రం పైన ఎలాంటి అవగాహన లేదని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే 3 వ స్థానంలో ఉన్నామన్నారు. తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రనికే కాదు దేశానికే అన్నం పెట్టె స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.

ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ వస్తుందని... హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రానున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ స్లోగన్‌లు చేసే పార్టీ కాదు... సొల్యూషన్ ఇచ్చే పార్టీ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.......

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది :రేపటి నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్, రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీ లతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది.

తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు సూచనలు చేస్తున్నారు.

  

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రేపటి నుండి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

వికలాంగులు, వృద్ధులు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ తేదీ కంటే మూడు రోజుల ముందే పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగుల ఇంటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకువెళ్లి వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని సూచించారు....