/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరు: బీఎస్పీ నకిరికల్ నియోజకవర్గ ఇన్చార్జ్ Mane Praveen
అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరు: బీఎస్పీ నకిరికల్ నియోజకవర్గ ఇన్చార్జ్

ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చలో సూర్యాపేట పిలుపు మేరకు, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మరియు నకిరేకల్ నియోజకవర్గ నాయకులు సూర్యాపేట కు తరలి వెళ్లగా మార్గ మధ్యలో పోలీస్ లు అరెస్టు చేసి అర్వపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. బీసీ బిడ్డ అయిన వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయిస్తూ వేధించడం చాలా సిగ్గుచేటని, బీసీలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా వారిని అణచివేయడంలో భాగంగానే ఈ అరెస్టులకు తెర లేపినారని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రామన్నపేట మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, చిట్యాల అడ్వైజర్ జిట్ట నర్సింహా రాజ్, అన్నమళ్ళ సైదులు తదితరులు ఉన్నారు.

అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్
తిరుమలగిరి సాగర్: బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ పై ఒక్క రాత్రిలోనే అక్రమంగా  71 కేసులను నమోదు చేయించారని ఆరోపిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ కు మద్దతుగా చలో సూర్యాపేట పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుమలగిరి మండల పోలీస్ అధికారులు బీఎస్పీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా నియోజవర్గ బీఎస్పీ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లడుతూ.. తక్షణమే ఒట్టే జానయ్య యాదవ్ పై అక్రమంగా నమోదు చేసిన 71 కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు.  బీఎస్పీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు అంగోత్ శివ నాయక్, బోడ రవి, తదితరులు ఉన్నారు.                        
DVK: రేషన్ డీలర్ పై రీ-ఎంక్వైరీచేయాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం
దేవరకొండ డివిజన్, పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామంలో గతంలో రేషన్ డీలర్ భర్త వెంక రెడ్డి పై,  రేషన్ బియ్యం బైక్ పై అక్రమంగా తరలిస్తున్న ఫోటోలు తీసి కంప్లీట్ చేయగా దాని విచారణలో కంప్లైంట్ దారునికి తెలియకుండా అధికారులు వచ్చి విచారణ చేశారని ఆరోపిస్తూ.. అదే గ్రామానికి చెందిన జిల్లా రాములు బుదవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయం లో మళ్లీ అట్టి రేషన్ డీలర్ పై రీ- ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పేరికే విజయ్ కుమార్, ధర్మపురం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
NLG: కలెక్టర్ కు రాఖీ కట్టిన సెకండ్ ఏఎన్ఎం లు
నల్లగొండ: గత 15 రోజులుగా  2వ ఏఎన్ఎం లు  చేస్తున్న సమ్మె పట్ల  ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో రెండవ ఏఎన్ఎంల నిరవధిక సమ్మె కలక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న సందర్భంగా బుధవారం ఉజ్జీని యాదగిరి రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లను అందరిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం లు ముందుగా జిల్లా కలెక్టర్ కర్ణన్ కు రాఖీ కట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి వి.లెనిన్, 2వ ఏ ఎన్ ఎం ల యూనియన్ జిల్లా అద్యక్షులు పోలే రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, హారతి, గీత, సరిత, అన్నపూర్ణ, శోభ, అండాలు, సౌజన్య, పద్మ, సలోని, సుచిత్ర , మాధురి, భవానీ, విద్య, నాగశ్రీ, సంతోష, భాగ్య, శైలజ, కవిత, అండాలు, సరళ, సువర్ణ, సత్యమ్మ, పార్వతి, సుమతి, పద్మావతి, శోభ, రుక్సానా, సుప్రియ సాలమ్మ,  నీలవేణి, శారద, విజయలక్ష్మి, జ్యోతి, లలిత, శ్రీలత, నూర్జహాన్, ధనలక్ష్మి, అరుణ, ప్రేమలత, సుమలత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ బీఎస్పీ నాయకుల ముందస్తు అరెస్టు
దేవరకొండ: బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి ఎర్ర కృష్ణ, అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ లను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా రమావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. బీసీ బిడ్డ వట్టే జానయ్య యాదవ్ పై  విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అక్రమంగా 71 కేసులు బనాయించినారని ఆరోపిస్తూ,  బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ కి అండగా నిలబడాలని, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు, ఈరోజు చలో సూర్యపేట కార్యక్రమానికి వెళ్ళనీయకుండా తమను అరెస్టు చేశారని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని,  అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, వట్టే జానయ్య యాదవ్ కుటుంబానికి అండగా బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుందని, రాబోయే ఎలక్షన్లలో బహుజన బిడ్డలందరూ ఏకమై బిఆర్ఎస్ ని ఇంటికి పంపించడం ఖాయమని ఆయన అన్నారు.
నల్లగొండలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పాలాభిషేకం
నలగొండ జిల్లా కేంద్రంలోని, గడియారం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "నలగొండ అసెంబ్లీ స్థానం బీసీలకు కేటాయిస్తాను, నేను త్యాగం చేస్తాను" అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నందుకు.. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు వర్షం వ్యక్తం చేస్తూ, బుధవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నామని తెలిపారు.

ఇచ్చిన మాట ప్రకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బీసీలకు ఇప్పించి గెలిచే విధంగా ప్రచారం చేసి సోనియా గాంధీకి నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బహుమానంగా ఇవ్వాలని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగాన్ని బీసీలు ఎప్పుడు మర్చిపోరని,  నల్గొండ అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసినందుకు బీసీలు ఎల్లప్పుడూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రుణపడి ఉంటారని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల విజయ్ కుమార్, సోమరాజు, కారింగు నరేష్ గౌడ్, పాన్దర్పల్లి నాగరాజు, కర్నాటి రాజు, జక్కల మహేందర్ యాదవ్, మాండ్ర యాదగిరి యాదవ్, పగిళ్ల మహేష్, పృథ్వీరాజ్, రాము, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
కురంపల్లి: పల్లెనిద్ర నిర్వహించిన బిజెపి నాయకులు నాగం వర్శిత్ రెడ్డి

నల్లగొండ నియోజకవర్గం, కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో పల్లెనిద్ర లో బాగంగా బిజెపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి మంగళ వారం రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార దాహంతో ఉచిత పథకాలు దళిత బందు,బిసి బందు, అమలు కానీ హామీలు చేస్తూ నమ్మబలికి నామమాత్రంగా వారి కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఆ వైఖరిని ఖండించారు.ఏంచేసిందయ్యా 9 ఎండ్ల లో బిఆర్ఎస్ పార్టీ అంటే.. ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజలపై అనేక పన్నుల భారాన్ని మోపింది అని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలను అణచివేయాలని కోరారు.

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అర్హులందరికీ ఇల్లు నిర్మాణం చేపట్టి "సబ్ కా సాత్ సబ్ కా వికాస్" అనే నినాదాన్ని, ఇంటింటికి బిజెపి పథకాలను ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలిపే విధంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేసారు.

ఈ కార్యక్రమంలో తీరందాసు కనకయ్య, ఓర్సు శ్రీనివాసులు, జనగాం భిక్షం, కొంగల రమేష్, తలారి కిరణ్, పోలోజు బిక్షమాచారి, ముత్యం,ఈశ్వర్, భుక్షం, జిల్లా శేఖర్, పొడిగుండ్ల శివాజీ, బండమీది సూరి, కట్ట హరిబాబు, మోహన్ బాబు, కట్ట చిన్ని, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆయన బిజెపి సీనియర్ నాయకులు ఒర్సు శ్రీను ఇంట్లో కార్యకర్తలతో కలిసి పల్లె నిద్ర చేశారు.

ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు
మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలో గత 18 సంవత్సరాలు నుండి గ్రామ ఆరోగ్య కార్యకర్తలుగా అనేక వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు 18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఆశ వర్కర్లు ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగులు పూర్తిచేసి గ్రామాలలో రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర జబ్బులు గుర్తించి, ప్రభుత్వం ఇస్తున్న మందులను సప్లై చేస్తూ ప్రజలకు తగిన ఆరోగ్య సూచనలు ఇస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు చిన్న పిల్లలకు, ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.

ఇంత పని చేస్తున్న ఆశ వర్కర్లకు వేతనం ఇవ్వకుండా పారితోషికాల పేరుతో పని భారం పెంచి, వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశ వర్కర్స్ కు 18 వేల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ ఈఎస్ఐ, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఏ ఎన్ఎం జిఎన్ఎం పోస్టులో ఆశలకు ప్రమోషన్, ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
          
ఆశ వర్కర్స్ కు టీబి లెప్రసీ కంటి వెలుగు కరోనాకాలంలో ఇవ్వవలసిన రిస్క్ అలవెన్స్, పెండింగ్ బిల్లులను ఇవ్వాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
        
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య , చండూరు మండల కన్వీనర్ జేరిపోతుల ధనంజయ, సిఐటియు మండల నాయకులు యాసరాని వీరయ్య,ఆశ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు రమావత్ కవిత, జిల్లా నాయకురాలు జంపాల వసంత, ఏర్పుల పద్మ, ఎం సునీత, ఎదుళ్ళ కవిత, కోరే లలిత, అరుణ యాదమ్మ, మమత, సైదా బేగం విజయమ్మ దుర్గమ్మ అరుణ ,కలమ్మ తదితరులు పాల్గొన్నారు.
NLG: రేపే రాఖీ పౌర్ణమి పండగ

నల్లగొండ: సోదరీ సోదరుడు మధ్య అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పండుగను ఈనెల 31న గురువారం జరుపుకోవాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బొల్ల వేణుగోపాలరావు, మరియు పురోహితులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, లక్ష్మీ నరసయ్య శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 

వేణుగోపాల రావు నల్గొండలో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18 వినాయక చవితి జరుపుకోవాలని, ఈనెల 31వ తేదీ గురువారం రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని తెలిపారు.
NLG: 2వ ఏఎన్ఎం ల పట్ల  ప్రభుత్వ కటిన వైఖరి మంచిది కాదు: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: గత 14 రోజులుగా  2వ ఏఎన్ఎం లు  చేస్తున్న సమ్మె పట్ల  ప్రభుత్వం కటిన వైఖరి మంచిది కాదని, సమస్యను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా  ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు  జరుగుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న 2వ ఏఎన్ఎంల నిరవధిక సమ్మెలో మంగళవారం మాట్లాడారు. గత 16 నుండి 20.ఏళ్లుగా  రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా  విధులు నిర్వహిస్తున్నారు. వారిని పర్మినెంట్ చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి డి వెంకన్న, డివిజన్ కార్యదర్శి వి. లెనిన్, 2వ ఏఎన్ఎం ల యూనియన్  జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, నాగమణి, హరిత, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.