/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్ Yadagiri Goud
ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్

నగరంలోని ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్ చేశాడు. ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోన్ని మంగళసూత్రాన్ని దొంగలించాడు.

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారెడ్డి గూడ చౌరస్తాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మూడున్నర తులాల బంగారం చైన్‌ను దొంగ అపహరించాడు.

బాధితురాలు కల్వకుంట్ల మంజుల (52) ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా హన్మకొండలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శివారెడ్డి గూడ చౌరస్తాలో బస్ స్టాండ్‌లో బస్ కోసం మంజుల ఎదురు చూస్తున్నారు. అక్కడకు వచ్చిన ఓ దొంగ.. కంట్లో కారం కొట్టి మంగళ సూత్రం దొంగలించి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పరారయ్యాడని బాధితురాలు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...

హైదరాబాద్‌పై మనసు పారేసుకున్న సినీ నటి

అతి తక్కువ కాలంలోనే మహాద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ మహానగరంపై సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండొచ్చిన వారు సైతం నగరాభివృద్ధికి ముచ్చటపడుతున్నారు. హైదరాబాద్‌ అమెరికాను తలపిస్తున్నదంటూ మనసులో మాటను బయటపెడుతున్నారు.

విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్తు సరఫరా, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాయి. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇటీవల హైదరాబాద్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరేమిటి ఎందరో సెలబ్రిటీలు హైదరాబాద్‌ను చూసి ఫిదా అవుతున్నారు.

తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్‌ నటి సోనాల్‌ చౌహాన్‌ చేరారు. బాలకృష్ణ సరసన లెజెండ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనాల్‌ ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ సినిమాలోనూ మెరిశారు. కడ్తాల్‌లో ఓ ప్రైవేటు డెవలపర్స్‌ లగ్జరీ విల్లాలకు సంబంధించి జూబ్లీహిల్స్‌లో జరిగిన బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరాభివృద్ధిని చూస్తుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనిపిస్తున్నదని పేర్కొన్నారు.బాలీవుడ్‌లోని పలువురు నటీనటులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిపారు.

శంషాబాద్‌ నుంచి కారులో జూబ్లీహిల్స్‌ వస్తుంటే విదేశాల్లో ఉన్నట్టే అనిపించిందని చెప్పుకొచ్చారు. దేశంలోని మరే నగరంలోనూ ఇంత భారీ భవనాలు కనిపించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి నిర్మాణాలు, అభివృద్ధి చూస్తుంటే తనకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వస్తున్నదని వివరించారు. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు తరలివస్తున్న విషయం తనకు తెలిసిందని సోనాల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

Telugu Bhasha Dinotsavam: తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

అమరావతి: తెలుగు భాషా దినోత్సవం (Telugu Basha Dinotsavam) సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) శుభాకాంక్షలు తెలియజేశారు..

ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ... ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయివుండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశమే అని చెప్పుకొచ్చారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు..

ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ - చంద్రబాబు

నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు..

ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని వెల్లడించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఇక అటు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని..ఈ వేళ. ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానునన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయి వుండాలని ఆయన ఆశించారని పేర్కొన్నారు..

కడియం శ్రీహరిపై మంద కృష్ణ సంచలన వ్యాఖ్యలు

హనుమకొండ : మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడియం ఒక గుంట నక్క అని మంద కృష్ణ విమర్శించారు.

గతంలో రాజయ్య డిప్యూటీ సీఎం పదవి పోవడానికి రాజయ్యే కారణమన్నారు.

కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దన్నారు. మాదిగ సీటును మాదిగకే ఇవ్వాలన్నారు. రాజయ్యకు ఇవ్వకపోతే మరో మాదిగకు ఇవ్వాలన్నారు. కడియం శ్రీహరికి బీ ఫామ్ ఎలా వస్తుందో చూస్తామని మంద కృష్ణ మాదిగ సవాల్ విసిరారు..

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ''ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు..

తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి.. వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు.. తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు'' అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

గిడుగు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు'' అని సీఎం ట్వీటర్‌లో పేర్కొన్నారు..

తెలుగు భాష ప్రాధాన్యతను పెంచిన పిడుగు

•నేడు తెలుగు భాష దినోత్సవం

అమ్మతో కష్టసుఖాలు పంచుకునే భాష ప్రస్తుత కాలంలో బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. తెలుగు భాష కనుమరువు అవుతూ ఇంగ్లీష్‌బాట పట్టే రోజులు ఉన్నాయి. ఎక్కడ చూసినా తెలుగు కాకుండా ఇంగ్లీష్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే గతంలో ఏపీ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి బోర్డు కూడా తెలుగులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము.

కానీ గిడుగు రామ్మూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో.. ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. అయితే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

తెలుగు భాష మాతృ భాషను పాఠశాలల్లోనూ సజీవంగా ఉంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష కనుమరుగు కాకుండా ఎంతో కృషి చేస్తున్నాయి.

ఈ సందర్బంగా వేమన, సుమతీ శతకాలు వంటి పద్యాలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

గురుకుల విద్యార్థిని కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా :ఆగస్టు 29

జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ‌లో ఉన్న గంధవారి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లు తెలిసింది.

ప్రమాదంలో అమ్మాయికి కాళ్లు, పళ్ళు విరగడంతో పాటు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు తెలియకుండా పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది దాచిపెడుతున్నట్లు సమాచారం.

కాగా, విద్యార్థిని భవనంపై నుండి దూకడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. అయితే, గురుకుల కాలేజీలో సరైన సౌకర్యాలు లేవని.. భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదేమిటని టీచర్లను ప్రశ్నిస్తే విద్యార్థులను వేధింపులకు గురిచేస్తారంటూ అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు కాలేజీలోకి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే వాళ్లను కూడా లోనికి రాకుండా అడ్డుకుంటారని పిల్లలు తెలిపారు...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భర్తను హతమార్చిన భార్య

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే బాధలు భరించలేక, భార్య, తన తల్లిదండ్రుల‌తో కలిసి గొడ్డలితో నరికి దారుణంగా చంపేసింది. ఈ ఘటన నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సోమవారం రాత్రి జ‌రిగింది.

రూరల్ సీఐ వెంకటనారాయణ, రూరల్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ కాలనీకి చెందిన కృష్ణకు అదే కాలనీకి చెందిన గంగతో వివాహం అయ్యింది.

అయితే భర్త కృష్ణ, భార్య గంగతోపాటు అత‌ని అత్తామామలతో తరచూ గొడవ పడేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కృష్ణ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ భార్య తో వాగ్వాదానికి దిగాడు. దీంతో విసిగిపోయిన భార్య, ఆమె తండ్రి మురళి, త‌ల్లి స‌త్తమ్మ క‌లిసి గొడ్డలితో నరికి హత్య చేశారు.

మొదట భర్త కంట్లో కారం చ‌ల్లి, అనంతరం గంగ తండ్రి, మురళి, తల్లి సత్తమ్మ గొడ్డలి తీసుకుని కృష్ణ పై దాడి చేసి, నరికి వేశారు. బయటకు వచ్చిన కృష్ణ అక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ, రూరల్ ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు......

మ‌రో రెండు కొత్త మండ‌లాలకు నోటిఫికేష‌న్

తెలంగాణ‌లో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసి అభిప్రాయాలను సేకరించింది. లేటెస్ట్‌గా దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది..

ఇక‌.. కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్‌నగర్‌ను నూతన మండలంగా,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ని ప్ర‌భుత్వం విడుదల చేసింది.

వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆ నోటిఫికేషన్లలో పేర్కొంది......