/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మాటిస్తున్నా! మెదక్ జిల్లాను అభివృద్ధి చేస్తా: సీఎం కేసీఆర్ Yadagiri Goud
మాటిస్తున్నా! మెదక్ జిల్లాను అభివృద్ధి చేస్తా: సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి మెదక్ జిల్లాలో ప్రగతి శంఖారావం సభ జరిగింది. బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.

పోయిన ఎన్నికల్లో మెదక్ వచ్చినప్పడు నేను ఒకటే మాట మీతో మనవి చేయడం జరగింది. పద్మ నా బిడ్డ, ఆమె అడిగితే నేను ఏదీ కూడా కాదనే పరిస్థితి ఉండదు. దాని ఫలితమే ఇంద్ర భవనం లాంటి కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు ఇవ్వాల చూస్తున్నారు. ఉద్యమంలో నాతో పాటు కలిసి ఉండి.. ఇవ్వాల్టి వరకు మనతో కలిసి ఉన్న బిడ్డ పద్మక్క. ఇప్పుడే నన్ను ఆమె కోరింది.

మెదక్ పట్టణంలో రోడ్లు చిందరవందరగా అయ్యాయి. వాటిని బాగు చేసుకోవాలే.. పంచాయతీలకు కూడా నిధులు కావాలనే అడిగింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగింది. మీకు ఎల్లుండి సాయంత్రంలో లోగా సాంక్షన్ చేసి జీవో కూడా పంపిస్తానని మాట ఇస్తున్నా.

రామాయంపేటలో డిగ్రీ కాలేజీ కూడా కావాలని కోరారు. అది కూడా మంజూరు చేస్తున్నా. మెదక్కు రింగ్రోడ్డు కూడా మంజూరు చేస్తున్నా.. అదేవిధంగా, ఏడు పాయల టెంపుల్ దుర్గ మాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో వంద కోట్ల రూపాయలు కావాలని అడిగారు.. దానికి కూడా మంజూరు ఇస్తున్నా.. కౌడిపల్లిలో కూడా డిగ్రీ కాలేజీ అడిగారు. దానికి కూడా మంజూరు చేస్తున్నా..

మెదక్ జిల్లాలో ప్రతి పంచాయతీకి నిధులుమంజూరు చేస్తున్నా.. అదేవిధంగా.. నాలుగు మున్సిపాలిటీలకు నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ కు తలా 25కోట్లు.. మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఫండ్స్తో పనులన్నీ చేయాలని చెబుతున్నా.

ఇగ ఇప్పుడు మీ పని అయిపోయింది.. ఇగ నాపని ఉన్నది.. మిమ్మల్నందరినీ కోరేది ఒక్కటే.. ఎవరూ ఆగమాగం కావద్దు.. పంట కోతలయినంక గంగెడ్ల వారు వచ్చినట్టు వస్తుంటరు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ వారు కోరుతున్నారు.

ఇప్పటికే వారికి చాలా చాన్స్లు ఇచ్చినం.. ఎవరూ గణపురం కాల్వలను బాగు చేయలే.. అప్పడు తుమ్మ చెట్ల మొలిచినయ్.మనం గణపురం కాల్వలు బాగుచేస్కున్నమ్. 40లక్షల ఎకరాల దాకా నీరు అందుతోంది. మంచిగ పంటలు పండుతున్నయ్.. గణపురం ఆయకట్టు కింద ఒక గుంట కూడా దెబ్బతినకుండా పంటలు పండిస్తున్నమ్.

తెలంగాణ రాకముందు చెట్టుకొక్కరు గుట్టకొకరు అయ్యారు. అందరం బాధపడ్డాం. రైతులను బాగు చేయాలనే సంకల్పం తీసుకుని దానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ వచ్చినం. రైతుబంధు, రైతు బీమాతో రైతులకు మేలు చేసినం. కాళేశ్వరం జలాలతో పంటపొలాలకు నీళ్లు పారుతున్నాయి.....

ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు సీఎం కేసీఆర్ అభినంద‌న‌లు

చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం సంపూర్ణ విజ‌యాన్ని సాధించ‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

చంద్రుని ద‌క్షిణ ధ్రువం మీద‌కు లాండ‌ర్ మాడ్యూల్‌ను చేర్చిన మొట్ట‌మొద‌టి దేశంగా ప్ర‌పంచ అంత‌రిక్ష ప‌రిశోధ‌న రంగంలో భార‌త‌దేశం స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ఇది ప్ర‌తీ భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు, ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంలో భాగ‌స్వాములైన ప్ర‌తి ఒక్క‌రికి అభినంద‌న‌లు.

చిర‌కాల ఆకాంక్ష నెర‌వేరిన సంద‌ర్భంలో యావ‌త్ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు ఇది పండుగ రోజు. భ‌విష్య‌త్‌లో ఇస్రో చేప‌ట్టే అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌కు, ప్ర‌యోగాల‌కు చంద్ర‌యాన్-3 విజ‌యం గొప్ప ప్రేర‌ణ‌ను ఇస్తుంది.

ఇదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ, దేశ కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను మ‌రింత‌గా పెంచే దిశ‌గా అంత‌రిక్ష ప‌రిశోధ‌న రంగంలో ఇస్రో త‌న విజ‌య పరంప‌ర‌ను కొన‌సాగించాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు...,......

చంద్రయాన్ - 3 విజయవంతం !

- యావత్ దేశం గర్వం

- చరిత్ర సృష్టించిన భారత్ దేశం

ఇస్రో ( శ్రీహరికోట ) ; విజయంతంగా లాండ్ అయిన చంద్రయాన్ - 3 .ల్యాండింగ్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు చంద్రుడ్ని ముద్దాడనుంది. ఇందుకు ఇస్రో ఏర్పాట్లును పూర్తిచేసింది.

ప్రస్తుతం ల్యాండర్ జాబిల్లికి 24 కి.మీ. దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ప్రాంతానికి సాయంత్రం 5.44 గంటలకు చేరుకుంది.

అదే సమయానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఎటువంటి అవరోధాలు లేకుండా ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యింది. దీంతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన నాలుగో దేశంగానూ ఘనత సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే అపురూప క్షణాలని మోదీ అన్నారు.

చంద్రుడిపై చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ దాని లోపల ఉన్న ప్రగ్యాన్ రోవర్ ఏం పని చేస్తాయి అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ల్యాండర్, రోవర్ పని గురించి ఇస్రో అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కాగానే.. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటికి రావడానికి 10 నిమిషాల సమయం పట్టనుంది.

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విజయం ఖాయం

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తోనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం

బిఆర్ఎస్వీ నేత కత్తుల వంశీ

వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరుపున అభ్యర్ధి అయినా ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విజయం ఖాయం అని బిఆర్ఎస్వీ నేత కత్తుల వంశీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సారి జరిగే ఎన్నికల్లో భూపాల్ రెడ్డి కి 50000 మెజార్టీ ఖాయం అని అన్నారు. ఈ సారి కూడా వెంకట్ రెడ్డి కి ఓటమి తప్పదని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలకు ఓటమి తప్పదని, ఓటమి భయంతోనే వెంకట్ రెడ్డి కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు అని,

నల్లగొండ నియోజక వర్గం అభివృద్ధి ని చూసి వెంకట్ మాట్లాడాలని అన్నారు. దమ్ముంటే నియోజక వర్గ అభివృద్ధి కి తాను సిద్దమా అని అన్నారు.

నియోజక వర్గ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా భూపాల్ రెడ్డి గెలుపు కోరుకుంటున్నారు అని పేర్కోన్నారు రాష్ర్టంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం పగటి కల అని, రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సిఎం కావడం ఖాయం అని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి చాలా అవసరం అని పేర్కొన్నారు.

బహుజనులంతా ఏకంకండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

దొరల పాలనతో బహుజనులకు తీరని నష్టం జరుగుతోందని తెలంగాణ బహుజన సమాజ్ వాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు.

బుధవారం నాడు నర్సంపేటకు చెందిన మదన్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బహుజన సమాజ్ వాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

బహుజన సమాజ్ వాదీ పార్టీ మరో విజయం సాధించింది. దొరల పార్టీ నుంచి, దొరల జెండా మోస్తూ చాకిరి చేసిన బహుజనుడు బహుజనుల పార్టీకి రావడం సంతోషం. ఒక శాతం ఉన్న అగ్రవర్ణాల అధికారాన్ని చేపడుతుంటే..90శాతం ఉన్న బహుజనులు ఏం చేయాలని ప్రశ్నించారు. బీసీ వర్గాల నుంచి 150కులాలు ఉంటే 6కులాలకే టికెట్లు ఇచ్చి..23సీట్లు మాత్రమే సీఎం కేసీఆర్‌ ఇచ్చారు. బహుజనులు మన బతుకుల బాగుకోసం మనం ఆలోచించాలి.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మళ్లీ దొరల పాలన వల్ల బహుజనులు నష్టపోతున్నాం. 99శాతం ఉన్న మన కోసం మన పార్టీ బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది.. మనం అందరం ఒక తాటిపైకి రావాలి. వంద కోట్ల లిక్కర్ స్కామ్‌లో నిందితురాలు అయిన ఎమ్మెల్సీ కవిత ను ముట్టుకోవడానికి భయపడుతున్నారు.

అదే బహుజన గిరిజన బంజారా లక్ష్మీ భాయ్‌ ను చిత్రహింసలకు గురిచేస్తే ఎవరు మాట్లాడరు.డాక్టర్ తాటికొండ రాజయ్య కు టికెట్ రాకపోతే అంబేడ్కర్ విగ్రహం వద్ద వలవల ఎడుస్తున్నారు.. ఆయనకు అంబేడ్కర్ ఏం చెప్పిండో తెలియదా? అంబెడ్కర్.. ఆత్మ గౌరవంతో బోధించు, సమీకరించు, ఆశించు అని జీవించమన్నారు.

రాజయ్య.. మీరు అలా ఏడవద్దు. ఎలక్షన్ ఓట్ల కోసమే రైతు రుణ మాఫీ, లాంటి బిస్కెట్లు వేసి కేసీఆర్ ఆకట్టుకుంటున్నారూ. అది నమ్మకండి’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు....

నల్లగొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న తండు సైదులు గౌడ్

రానున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా నల్గొండ నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు Ex జెడ్పిటిసి చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా.తండు సైదులు గౌడ్ గారు బుధవారం రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్స్ స్కీనింగ్ కమిటీకి ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఒకసారి జెడ్పిటిసిగా మరియు అనేక విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నటువంటి నాకు నేనొక బీసీ గౌడ బిడ్డగా ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కోరుతున్నాను

Flights: రెండు విమానాలు.. ఒకే సమయానికి ల్యాండింగ్‌, టేకాఫ్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్‌, టేకాఫ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి రావడంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అధికారులు అప్రమత్తమయ్యారు..

రెండూ.. విస్తారా విమానయాన సంస్థకు (Vistara Airlines) చెందిన విమానాలే కావడం గమనార్హం. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...

బుధవారం ఉదయం దిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే725 విమానం టేకాఫ్‌ అయ్యేందుకు దిల్లీ విమనాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేపైకి వచ్చింది. అదే సమయంలో అహ్మదాబాద్‌ నుంచి దిల్లీ వస్తున్న విస్తారా విమానానికి ఏటీసీ అనుమతి లభించడంతో పక్కనే ఉన్న మరో రన్‌వేపై ల్యాండ్‌ అయింది.

ఈ క్రమంలో ల్యాండ్‌ అయిన విమానం.. దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం ఉన్న రన్‌వేపైకి వస్తుండటాన్ని మహిళా పైలట్‌ గుర్తించి ఏటీసీని అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే తమ తప్పును గుర్తించిన ఏటీసీ అధికారులు.. టేకాఫ్‌ ఆపేయాలని దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం పైలట్‌కు సూచించారు.

దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 1.8 కి.మీలే. సాధారణంగా విమానం టేకాఫ్‌ అయ్యేప్పుడు రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలను అనుమతించరు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్‌ అవుతుంటే.. పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు..

Daggubati Purandeswari : నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలును హరిస్తున్నారు..

విశాఖలో నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు సమావేశం జరిగింది. ఏపీ బీజీపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ పదాధికారుల సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆందోళన కరంగా వుందిని ఆమె అన్నారు. నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలును హరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మరణాలను హత్యలుగానే చేస్తున్నట్లుగానే భావించాలన్నారు పురంధేశ్వరి..

అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం కృంగిపోతుందని, వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో ఏడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు పురంధేశ్వరి. ఎప్పుడు మీడియాకి దూరంగా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన ఈరోజు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని, ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేసిన పరిస్థితి అని ఆమె వ్యాఖ్యానించారు.

గ్రామపంచాయతీలు నిధులను దారి తప్పించారని, చిన్న చిన్న కాంట్రాక్టర్లుకు చెల్లించవలసిన బకాయిలు ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ ను నియమించారని ఆమె ధ్వజమెత్తారు. మతమార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల భక్తులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత టీటీడీ ఉందని ఆయన అన్నారు. కొండలు నరికేస్తే జంతువులు బయటకే వస్తాయని, ఎర్రచందనం బయటికి తరలించేస్తన్నారన్నారు పురంధేశ్వరి..

ఇస్రో గొప్పతనాన్ని తిలకించడానికి సిద్ధంకండి.. చంద్రయాన్ 3పై పురందేశ్వరి వాక్యలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్‌కు అంతా సిద్ధమైంది.

ఈరోజు సాయంత్రం కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇందుకోసం యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తోంది. చంద్రయాన్‌ 3లో కీలక ఘట్టంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా స్పందించారు. చరిత్రను తిలకించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రయాన్ 3 నిర్దేశించిన చంద్ర భూభాగాన్ని తాకేందుకు సిద్ధమవుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. చంద్రయాన్ విజయం కోసం ప్రార్థనలో 1.4 బిలియన్ల హృదయాలను కలుపుతోందన్నారు.

ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు చరిత్రను తిలకించడానికి ట్యూన్ చేస్తూనే ఉండాలని తెలిపారు. ఇస్రో గొప్ప తనాన్ని, వారి శ్రమ, కృషిని మెచ్చుకోవాలని ప్రజలను పురందేశ్వరి కోరారు.

కాగా.. చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్‌ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లూ చేసింది.

ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది.

ఈ నేపథ్యంలో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి...

చంద్రయాన్-3 జాబిల్లికి మరింత చేరువగా ల్యాండింగ్!!

చంద్రుడిపై మన వ్యోమనౌక అడుగు పెట్టే చారిత్రక క్షణాల కోసం భారతీయులంతా వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు.

చంద్రుడిపై పరిశోధనలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్య సాధనలో తుది అంకానికి చేరుకున్నది.

బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఈ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించడానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ జాబిల్లికి మరింత చేరువలోకి వెళ్లింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే చివరి 17 నిమిషాలు అత్యంత కీలకం అని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇప్పుడు ల్యాండింగ్ మాడ్యూల్ కదలికలను ఇస్రో శాస్త్రవేత్తలు అనుక్షణం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో ల్యాండింగ్ కావడానికి సూర్యోదయం కోసం వేచి చూస్తున్నామని ఇస్రో పేర్కొంది.

సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపడతారు. బుధవారం సాయంత్రం దాదాపు 5.45 గంటల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు.

ల్యాండింగ్ మాడ్యూల్ సాఫ్ట్ లాండింగ్‌లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.. 17 నిమిషాల టెర్రర్ అని ఇస్రో అధికారులు, నిపుణులు చెప్పారు.

పూర్తిగా స్వతంత్రమైన ఈ ప్రక్రియలో సరైన ఎత్తు, సరైన టైంలో సరిపడా ఇంధనం ఉపయోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. అటుపై తన వేగాన్ని తగ్గించుకుంటుంది. అటుపై సురక్షిత ల్యాండింగ్ కావడానికి సరైన ప్రదేశాన్ని స్వయంగా ల్యాండర్ స్కానింగ్ చేసుకుంటుంది.....