/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఏఎన్ఎం బాధలు తీర్చండి: పల్లా దేవేందర్ రెడ్డి Mane Praveen
NLG: ఏఎన్ఎం బాధలు తీర్చండి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న, 2వ ఏఎన్ఎం లు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు నాల్గవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏఎన్ఎం ల పట్ల కనికరం చూపక పోవటం అన్యాయమని, గత16 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు.
అలాంటి వారిని మళ్లీ పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవాలని చెప్పడం అన్యాయమని, ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లందరిని బే షరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలకు సేవలందించారు. వారిని కాదని 1520 మంది ఏఎన్ఎం లను కొత్తగా నియమించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది అన్యాయమని, నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదు అన్నారు. ఒక్కొక్క ఏఎన్ఎం 36 రిజిస్టర్లు ఆన్లైన్ మరియు అఫ్ లైన్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య వంతమైన సమాజాన్ని తయారు చేస్తున్న ఏఎన్ఎం లను పట్టించుకోక పోవటం అన్యాయం అని అన్నారు. యూనిఫాం అలవెన్స్ కూడా ఇవ్వటం లేదు. ప్రభుత్వం టాబ్ లు ఇచ్చినా, నెట్ బాలెన్స్ ఇవ్వటం లేదని అన్నారు. ఆరు నుండి పది వేల మంది జనాభాకు ఒక్క ఏఎన్ఎం పనిచేస్తుందని, ఎక్కడికి వెళ్ళినా టిఎ ,డిఎ లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, నాగమణి, వసంత, సుశీల, గీత, భూదేవి, లత, సైదమ్మ, రేణుక, సరిత, గాయత్రి, సత్యమ్మ, విజయసుధ, నిర్మల, లత, కౌసల్య, పార్వతి, సులోచన, సాలమ్మ, గీత, నీలవేణి, లక్ష్మమ్మ, జ్యోతి, శారద, పుష్ప, విజయలక్ష్మి, చంద్రకళ, రజిత, రెహానా, అనిత, సుప్రియ, నాగలక్ష్మి మాధురి, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో ఉన్న సమస్యల గురించి పురపాలక సంఘం కార్యాలయంలో, శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు కు సిపిఎం పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. అదేవిధంగా చేయాల్సినటువంటి పనులన్నీ పూర్తి చేపిస్తున్నామని, పెండింగ్లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి, ప్రజలకు అనుగుణంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామనిన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్, ఆకుల ధర్మయ్య, ఎర్ర ఉషయ, భావనపల్లి స్వామి, తూర్పునూరు మల్లేశం, సాతిరి మనోజ్, దాసరి ప్రకాష్, కొంగరి కనకయ్య, ఏనుగుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఫోటో జర్నలిజంలో రాణిస్తున్న ముచ్చర్ల బ్రదర్స్ కు రాష్ట్రస్థాయి అవార్డులు
NLG: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ( ఆగస్టు 19 ) సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ TPJA ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొన్న ఫోటో జర్నలిస్టుల విజేతల ఫలితాలు శుక్రవారం వెలువడినాయి. ఈ ఫలితాలలో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 20న సాయంత్రం గం. 4:00 లకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని టిపిజేఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లా నుండి ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల విజయ్ - ఆంధ్రజ్యోతి, ముచ్చర్ల శ్రీనివాస్ - హన్స్ ఇండియా, ఆర్. ఆకాష్ -నమస్తే తెలంగాణ  రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచారు. అయితే వీరిలో ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్ సొంత అన్నదమ్ములు కావడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన వీరిరువురు ఫోటోగ్రఫీ పైన మక్కువతో గత కొన్ని సంవత్సరాలుగా పత్రికా రంగంలో విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ముచ్చర్ల బ్రదర్స్ ను పలువురు ఫోటో జర్నలిస్టులు, రిపోర్టర్లు, మీడియా మిత్రులు అభినందిస్తున్నారు.
NLG: మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపిన సెకండ్ ఏఎన్ఎంలు
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు, సెకండ్ ఏఎన్ఎమ్ లను రెగ్యులర్ చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మె నేడు మూడో రోజుకు చేరుకుంది. ఏఐటియూసి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరవధిక సమ్మె లో భాగంగా, ఈరోజు మోకాళ్ళపై నిలబడి నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సెకండ్ ఏఎన్ఎం లు మాట్లాడుతూ.. 16 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను పర్మినెంట్ చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ల భర్తీ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, పలువురు సెకండ్ ఏఎన్ఎం లు పాల్గొన్నారు.
డిండి మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా, డిండి:
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటు వంటి హామీ ప్రతి మండలానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ..  పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, అట్టడుగు విద్యార్థులకు డిగ్రీ కళాశాల అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్  గత మూడు సంవత్సరాలుగా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని,  పెండింగ్లో ఉన్న 5,117 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరకొర వసతులతో, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతుంటే కనీసం పట్టించుకున్న నాధుడే కరువయ్యారని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని,  మన ఊరు మనబడి ప్రణాళికలో ఎంపికైన పాఠశాలను అభివృద్ధి చేసి విద్యార్థులని ఆదుకోవాలని అన్నారు  అనంతరం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిండి మండల కమిటీని 17 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి మండల అధ్యక్ష కార్యదర్శులుగా దేవేందర్, కృష్ణ, సహాయ కార్యదర్శులుగా గౌతమ్, తరుణ్, కమిటీ సభ్యులుగా చంద్రశేఖర్, అంజి, స్వరూప, మంజుల, రాజేశ్వరి, రోజా, మౌనిక లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్ నాయక్, కుర్ర రాహుల్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.
బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
నకిరేకల్: పట్టణ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నకిరేకల్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన వర్గాల అభ్యున్నతి కోసం వీరోచిత పోరాటం చేసిన గొప్ప ధీరుడు బహుజన చక్రవర్తి శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. దోపిడిదారులను అంతమొందించి, దొరల పెత్తందారుల ఆధిపత్యాలకు చరమగీతం పాడిన మహాత్ముడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆమె అన్నారు. అన్ని కులాల వారిని కలుపుకుని గోల్కొండ కోటను ఆక్రమించిన వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు.  సర్వాయి పాపన్న ఇచ్చిన దైర్యం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. బి ఎస్ పి పార్టీ అన్ని వర్గాలను కలుపుకును ముందుకువెళ్తుందని.. అందరికి ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. జనాభా ప్రాతపదికన సీట్లు కేటాయించే ఏకైక పార్టీ బిఎస్పి అని అన్నారు. ఇప్పటికైనా జనం బిఎస్ పార్టీలకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, కట్టాంగూర్ మండల అధ్యక్షులు మేడి శ్రీను, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రామన్నపేట మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, నార్కట్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, దొరపల్లి ప్రశాంత్, చెడిపల్లి అనిల్, నక్కల పవన్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధిస్తాం: రామావత్ రమేష్ నాయక్
నల్లగొండ జిల్లా, దేవరకొండ: ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ  నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో,  పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ కార్యక్రమంలో పాల్గొని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహుజనులకు రాజ్యాధికారం ఎట్లా ఉంటదో రూచి చూపించినటువంటి మహనీయుడు బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్, తను చిన్ననాటి నుండే మహా మేధావి, గౌడ సామాజిక వర్గంలో పుట్టి మనము ఎన్ని నాళ్ళు దోరల కింద బానిసవుగా ఉండాలని తన చిన్ననాడే తల్లితో చెప్పిన పాపన్న, తను పెద్ద అయ్యాక సైన్యాన్ని ఏర్పరచుకొని గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని, సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో శివాజీ మహారాజు వలె మొగలులను వణికించిన ధీరుడు కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తి, తెలంగాణ తొలి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన రారాజు,బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు అని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బాలునాయాక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్, మండల అధ్యక్షులు గ్యార యాదగిరి, కోశాధికారి మాతంగి జాన్, హేమంత్, రవి నాయక్, దత్తు నాయక్, అనిల్, జెస్సిక, తదితరులు పాల్గొన్నారు
NLG: రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
నల్గొండ: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ యందు గురువారం రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌతమి స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పోలీసులు వివరించి అవగాహన కల్పించారు. ఈ  అవగాహన కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: రెండవ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయండి: పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రెండోవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ కలక్టర్ కార్యలయం ముందు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..  గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను, న్యాయ బద్దంగా ఆలోచించి పర్మినెంట్ చేయాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న నేటికి పర్మినెంట్ చేయకపోవడం విచారకరమని అన్నారు. రెండవ  ఏఎన్ఎం  ల బాధలు రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకొని, వెంటనే వారిని  పర్మనెంట్ చేయాలని దేవేందర్ రెడ్డి కోరారు. కరోనా కాలంలో ప్రాణాలు సహితం పణంగా పెట్టి పనిచేసిన ఏఎన్ఎం ల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. చేసే పని ఒకే విధానమైనప్పుడు,, వేతనాల వ్యత్యాసం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.  పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే వారికి వచ్చే జీతం ఏమాత్రం సరిపోవట్లేదు అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 4000 మంది పనిచేస్తున్నారు. వారందరినీ పర్మినెంట్ చేయకుండా మళ్లీ కొత్త నోటిఫికేషన్ వేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. 50 ఏళ్ల వయస్సులో పోటీ పడి ఎగ్జామ్ ఎలా రాస్తారని  ఏఎన్ఎం లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం న్యాయం కాదని,  తక్షణమే ప్రస్తుతం పని చేస్తున్న ANM లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో AITUC డివిజన్ కార్యదర్శి వి. లెనిన్, 2 వ ANM ల సంఘం జిల్లా నాయకులు రత్నకుమారి, బి.నాగమణి, అరుణ, అండాలు, వసంత, అలివేలు, సులోచన, గీత, అరుణ  సుప్రియ, వరలక్ష్మి, అనిత, రేణుక, భవాని, సంతోష, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ప్రొఫెషన్స్ అవార్డులు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎం.ఆర్. వి ప్రసాద్ మరియు ఎంఏ భవాని ల ట్రస్ట్ ఆధ్వర్యంలో.. కళాశాలలో చదివినటువంటి విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహంగా విశ్రాంత అధ్యాపకులు కీర్తిశేషులు ఎం రవి ప్రసాద్ సంస్మరణ అర్థం ప్రొఫెషన్స్ అవార్డులను వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా విద్యను అభ్యసించినటువంటి కళాశాల విద్యార్థులకు ఫిజిక్స్ విభాగంలో సాధించినటువంటి మార్కు లకు గాను ప్రోత్సాహకం గా బహుమతితో పాటు గోల్డ్  మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందించారు. అమెరికాలో నివసిస్తున్నటువంటి రవి ప్రసాద్ గారి కుమారుడైన సుబ్రహ్మణ్య కుమార్ మరియు వారి కుమార్తె మరియు స్థానిక గవర్నమెంట్ టీచర్  శేఖర్  సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ట్రస్ట్ ద్వారా విద్యార్థుల విద్యార్థులకు సుమారుగా 25 వేల రూపాయలు  ప్రోత్సాహక బహుమతి రూపంలో అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్ మాట్లాడుతూ..  మారుతున్న కాలానికి  అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ అంతటి శ్రీనివాస్, ఎం ఆర్ వి ప్రసాద్ కుమారుడైన సుబ్రమణ్య కుమార్, వారి కుమార్తె  వైదేహి, వారి ప్రియ శిష్యుడు శేఖర్, విశ్రాంత భౌతిక శాస్త్ర అధ్యాపకులు బండి రాఘవ రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎం. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తెలుగు ఆచార్యులు  కృష్ణ కౌండిన్య, సుబ్బారావు,  లైబ్రేరియన్ ఆనందం దుర్గాప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.