బాధితుడికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు: మండలంలోని కిష్టాపురం గ్రామంలో జాజుల వెంకటయ్య ఆటో డ్రైవర్ నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా, ఆ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వెంటనే లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించగా, ఆ మొత్తాన్ని ఈరోజు కిష్టాపురం బీజేపీ నాయకులు వారి కుటుంబ సభ్యులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ రాధా రమేష్, బిజెపి జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్, మునుకుంట్ల మల్లయ్య, బోయ సురేష్, మునుకుట్ల కిష్టయ్య, బీమనపల్లి సాయిబాబా, ఐతరాజు వేణు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జాజుల శంకరయ్య, మాల్గు కొండల్, గంటల మోహన్ రావ్, తదితరులు పాల్గొన్నారు.
Aug 10 2023, 22:18