దళిత బంధులో మాలలకు 50% కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం
నల్లగొండ జిల్లా, మునుగోడు: నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, సోమవారం జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు చలిచీమల యాదగిరి మర్యాపూర్వకంగా కలిసి 2వ విడుత దళిత బందు పథకంలో నియోజకవర్గంలోని మాలలకు 50% కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శిర్గమళ్ళ కిశోర్, అద్దంకి రామలింగయ్య, బేరి రవీందర్, బెల్లం బాలశివరాజు, బాజా మనోజ్, సంకు యాదగిరి, ఈద పవన్, ముచ్చపోతుల నర్సింహా, వడ్డేపల్లి శంకర్, బండారు లింగస్వామి, చలిచీమల శంకరయ్య, నరసింహ, కట్ట పవన్ కళ్యాణ్, సంకు నరసింహ, పిట్టల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు
Aug 01 2023, 16:42