/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి Mane Praveen
స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే మానసికంగా దృఢంగా తయారవుతారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తనయుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలంలోని  ప్రభుత్వ పాఠశాలలో, విద్యార్థులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. అలాగే సర్వేల్ హైస్కూల్ లో కూడా స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేయనున్నట్లు తెలిపారు. మొత్తం 750 దాదాపు 50 లక్షల విలువగల కిట్లను KJR ఫౌండేషన్ ద్వారా అన్ని మండలాల మరియు గ్రామాలలోని యూత్ లకు కూడా స్పోర్ట్స్ కిట్లను అందజేస్తామని అన్నారు.
మర్రిగూడెం: 20వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో 20వ రోజు గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పాల్గొని మాట్లాడుతూ..  సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు గత 20 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ,ఈ రాష్ట్ర ప్రభుత్వానికి  కనువిప్పు కావడం లేదని ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరికి పక్క లింగయ్య, వంపు ముత్తమ్మ, పెరుమాండ్ల మంజుల, సునీత, పద్మ, ఎడ్ల నరసింహ, నక్క ఎల్లమ్మ, సుగుణమ్మ, నరసింహ, గ్యార యాదగిరి, జిల్లా అమృత, ఎడ్ల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తా: శేపూరి రవీందర్
నల్లగొండ జిల్లా, చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలో మొహారం పండగ సందర్భంగా.. ముస్లిం సోదరులకు 5000 రూపాయలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జడ్పీటీసీ చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్  శేపూరి రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా శేపూరి రవీందర్  మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గం లో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తాని, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొహరం నిర్వహించే పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
బట్లపల్లి గ్రామంలో టీబీ వ్యాధి పైన అవగాహన కార్యక్రమం
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలం: ప్రభుత్వ ఆసుపత్రి నుండి మండల టీబి మరియు లెప్రసీ నోడల్ అధికారి ప్రేమ్ కుమార్, ఎస్టిఎస్ సూపర్వైజర్ సైదులు ఆధ్వర్యంలో సోమవారం బట్లపల్లి గ్రామంలో ఏసీఎఫ్ క్యాంపు మరియు నిక్షయ్ దివాస్ టీబి మరియు న్యూట్రిషన్ ప్రోగ్రాంలో భాగంగా.. గ్రామ ప్రజలకు టీబి వ్యాధి వ్యాపించే విధానం, లక్షణాలు గురించి వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా తెమడ పరీక్ష చేస్తారని చెప్పారు. డాక్టరు సలహా మేరకు ఉచితంగా ఎక్స్ రే తీసి రోగ లక్షణాలను నిర్ధారణ చేసి, వ్యాధి నిర్ధారణ అయినవారికి ఉచితంగా మందులు ఇస్తారు. టీవీ వ్యాధిగ్రస్తులు తగిన పోషకాహారము అనగా పాలు, పండ్లు, గుడ్లు, చేపలు, చికెన్, మాంసం, ఆకుకూరలు, బెల్లం పట్టీలు ,పప్పు దినుసులు మొదలగు బలమైన ఆహారం తీసుకొనుటకు గాను వారికి ప్రభుత్వం నెలకు రూ. 500 చొప్పున ఆరు నెలలు మొత్తం వారికి రూ. 3000 వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 6 నెలలు ఉచిత టీ బి మందులు ఇవ్వడం జరుగుతుందని, ప్రాథమిక దశలోనే వ్యాధి లక్షణాలకు చికిత్స తీసుకొని, ఆరోగ్యవంతులుగా మారి టీబి వ్యాప్తిని అరికట్టవచ్చును అని తెలిపారు. గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుటకు, గ్రామ ప్రజలు సహకరించాలని గ్రామ ప్రజలను ఉద్దేశించి సూపర్వైజర్ సైదులు, మండల నోడల్ పర్సన్ ప్రేమ్, ఎమ్ ఎల్ హెచ్ పి హార్దిక  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ విజయ, ఏఎన్ఎం సరితా బాయి, ఆశా మంజుల, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
TS: గురుకులాల ప్రధాన కార్యాలయం ముందు గురుకులాల కాంట్రాక్టు టీచర్ల ధర్నా
HYD: మాసబ్ ట్యాంక్ లోని గురుకులాల ప్రధాన కార్యాలయం ముందు ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకులాలో కాంటాక్ట్ ప్రాతిపదికన నియమించబడిన టీచర్లు మరియు సిబ్బంది తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సంవత్సరంలో పది నెలల వేతనం కాకుండా  12 నెలల వేతనం అందజేయాలని, 11వ పిఆర్సి అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా  ప్రసూతి సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి అవకాశం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో  సన్న, చిన్న కారు రైతులకు పండ్ల తోటలు పెంచడానికి అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ వెంకటేశం తెలిపారు. నీటి వసతి కలిగి ఉన్న సన్న, చిన్న కారు రైతులు పూర్తి వివరాల కోసం సంబంధిత గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను, పంచాయతీ సెక్రెటరీ లను సంప్రదించాలన్నారు . మామిడి, బత్తాయి, జామ, నిమ్మ, సీతాఫలం, సపోటా, మునగ, డ్రాగన్ ఫ్రూట్, నేరేడు, దానిమ్మ, కొబ్బరి తోటలు పెంచడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 31. ఇట్టి రైతులకు పండ్ల తోటలు పెంచడానికి మూడు సంవత్సరాలకు మెయింటెనెన్స్ నెలవారిగా పేమెంట్ అందజేస్తారని అన్నారు. రాయితీపై డ్రిప్పు కూడా అందజేశారని తెలిపారు. ఈ సదవకాశాన్ని  రైతులు వినియోగించుకోవాలని కోరారు.
NLG: విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా, దేవరకొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందని, విద్య అభివృద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర విద్యారంగ ప్రగతి అగిపోయిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ విమర్శించారు. నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర ఆదివారం దేవరకొండ కు వచ్చిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడులు మొదలై నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లకు నోట్ బుక్ లు, యూనిఫామ్, పెట్టెలు, పెండింగ్ బిల్లులు  విడుదల చేయలేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంటర్ విద్యార్ధులకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, లెక్చరర్స్ లేరని గెస్ట్ లెక్చరర్స్ కు రెన్యూవల్ చేయలేదని, అన్నారు. గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, వర్షకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారనీ, సరైన సౌకర్యాలు లేక సరిపడా ముత్రశాలలు, మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారనీ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచినట్లు ఆర్బాటాలు చేసి ఇప్పటీకీ పెంచిన మెనూ అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 24,000 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయలేదని, పాఠ్యపుస్తకాలు లేకుండా, టీచర్లు లేకుండ ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. హస్టల్స్ విద్యార్ధులకు నెలకు అబ్బాయిలకు 62/- రూపాయలు, అమ్మాయిలకు 100/- రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు మాత్రమే ఇస్తున్నారు. విద్యార్థులు తమ అవసరాల ఆ డబ్బులు ఎలా సరిపోతాయని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల దుస్థితి గురించి సాక్షతూ కెసిఆర్ మనుమడే ఈ మద్య చెప్పాడని విమర్శించారు. రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేసి కార్పోరేట్ ఫీజులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్ షిప్స్ & రీయంబర్స్ మెంట్స్ 5,177 కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని తక్షణమే  వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ మహత్మ గాంధీ యూనివర్శిటీకి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఛలో హైదరాబాద్ కార్యక్రమాని కూడా నిర్వహిస్తామని   హెచ్చరించారు.

ఈ యాత్ర క్షేత్ర స్థాయిలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులు తెలుసుకోని, జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారు. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన లు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్, కోర్ర సైదా నాయక్, రవిందర్, జగన్  రవి, అనిల్, వీరన్న, సాయి  సంపత్, చంద్, నవదీప్, శ్రవణ్, రాహుల్, తరుణ్  తదితరులు పాల్గొన్నారు
మణిపూర్ ఘటన దోషులను ఉరి తీయాలి: ఏఐఎస్ఎస్డి, ఎమ్మార్పీఎస్
మణిపూర్ లో ఇటీవల గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ, ఆలిండియా సమతా సైనిక్ దళ్ మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల గోపాల్ మాట్లాడుతూ.. మణిపూర్ లో జరిగిన అత్యంత పాశవిక ఘటనలో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేయడం దుర్మార్గం అని అన్నారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని, సభ్య సమాజం తలదించుకొనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

కార్యక్రమంలో నాయకులు అందుగుల లక్ష్మీనారి, ఆదిరాల రమేష్, ఎదుల ఎల్లయ్య, ఆదిరాల రాము, అంజయ్య ,వెంకటేష్, గోవర్ధన్, సైదులు ,లచ్చయ్య, ముత్యాలు పాల్గొన్నారు.
NLG: వన్ టౌన్ నూతన సీఐ సత్యనారాయణ ను సన్మానించిన బిఆర్ఎస్వి నాయకులు
నల్లగొండ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధులు చేపట్టిన సిఐ జి. సత్యనారాయణ ను బిఆర్‌ఎస్‌వి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి, వారిని శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్ర పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌వి టౌన్ ప్రెసిడెంట్ అంబటి ప్రణీత్, బిఆర్‌ఎస్‌వి టౌన్ జనరల్ సెక్రటరీ కందుల సంపత్ కుమార్, బిఆర్‌ఎస్‌వి టౌన్ వైస్ ప్రెసిడెంట్ పెరిక నవీన్ కుమార్, బిఆర్ఎస్వి నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ జాన్ ప్రేమ్, బిఆర్‌ఎస్‌వి ఎన్జీ కళాశాల నాయకులు సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.
TS: తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌ సాధారణ ఎన్నికలు
HYD: తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌కు సాధారణ ఎన్నికలు (2023-2027) హైదరాబాద్‌లోని బిహెచ్ఇఎల్ రామచంద్రాపురంలోని అభినంద్ గ్రాండ్ హోటల్‌లో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గా డి.సతీష్‌ గౌడ్‌, తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ గా మాస్టర్‌ ఎ.ప్రవీణ్‌ కుమార్‌ లు నూతనంగా ఎంపికైనారు. అదేవిధంగా తెలంగాణ తైక్వాండో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి గా అవకాశం కల్పించినందుకు కమిటీ కార్యవర్గానికి ఎం.డి యూనస్ కమాల్ తన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి అంబటి ప్రణీత్, తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.