/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నిన్న ఢిల్లీలో ఇవాళ అస్సాంలో వరస భూ ప్రకంపనలు Yadagiri Goud
నిన్న ఢిల్లీలో ఇవాళ అస్సాంలో వరస భూ ప్రకంపనలు

అస్సాం:

సోనిత్‌పూర్‌లో ఈరోజు సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు వెల్లడించింది.

ఈ రోజు ఉదయం 8.03 గంటలకు 15 కిలోమీటర్ల లోతుతో భూకంపం సంభవించింది. ఇటీవలే బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు సంభవించగా.. ఇప్పుడు అస్సాంలోనూ ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.

గౌహతిలో 24 గంటల్లోనే రెండోసారి భూకంప ప్రకంపనలు సంభవించాయి. మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో మే 28న మధ్యాహ్నం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

మధ్యాహ్నం 2.58 గంటలకు 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. అంతకుముందు, సాయంత్రం 6:26 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.

పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఉదయం 11:20 గంటలకు సంభవించాయని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ తో వైయస్ షర్మిల భేటీ

కర్ణాటక:

బెంగళూర్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని డీకే నివాసంలో ఆయనతో భేటీ అయ్యి..శుభాకాంక్షలు తెలిపారు.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ డీకేకు కితాబునిచ్చారు. మహానేత YSR తో ఉన్న సాన్నిహిత్యాన్ని డీకే శివకుమార్.. వైఎస్ షర్మిల వద్ద గుర్తు చేశారు. మరోవైపు.. వైఎస్ షర్మిల మే 15 వ తేదీన డీకే శివకుమార్ బర్త్ డే రోజు కూడా భేటీ అయ్యి.. శుభాకాంక్షలు తెలిపారు.

ఈ భేటీ తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ క్రమంలో వారి మధ్య రాజకీయ పరమైన చర్చలు జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని జరుగుతున్న ప్రచారానికి.. ఈ భేటీ మరింత ఊతం ఇస్తోంది. మరోవైపు... రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది...

అడవిలో కారు దగ్ధం

చౌదరిగూడ:

జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచేర్ల శివారులో గల అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున కారుకు నిప్పంటించి దగ్ధం చేశారు.

అడవిలో వాచెర్ గా పనిచేస్తున్న అజహార్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా రాచకాల్వ దగ్గర కల్వర్టు పక్కన గుర్తు తెలియని కారు కాలిపోతుండడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వెంటనే చౌదరిగూడ మండల ఎస్సై సక్రం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అప్పటికే ఆ కారు గుర్తు పట్టకుండా పూర్తిగా తగలబడిపోయింది. కారు లోపల చుట్టుపక్కన ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమోనని చూడగా ఎవరు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కారును దగ్ధం చేసి ఉంటారని ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.....

SB NEWS

SB NEWS

IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

భారత వాయుసేన(IAF)కు చెందిన ఓ అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌( Apache helicopter) మధ్యప్రదేశ్‌లోని భింధ్‌ వద్ద అత్యవసరంగా ల్యాండ్‌ అయింది..

ఈ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించడంతో పైలట్‌ వెంటనే దీనిని పొలాల్లో ల్యాండ్‌ చేశాడు. పైలట్‌ అప్రమత్తతో ఓ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఈ హెలికాప్టర్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి మళ్లీ గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇప్పటికే దీనికి సాయం చేసేందుకు మరో హెలికాప్టర్‌ను అక్కడికి పంపారు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు సమాచారం. పైలట్‌ సురక్షితంగా ఉన్నారు. ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

భారత దళాల్లో వినియోగిస్తున్న హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత సైన్యానికి చెందిన ధ్రువ్‌ జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.

అనిల్‌ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి. మార్చిలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా పర్వత ప్రాంతాల్లో ఓ సైనిక హెలికాప్టర్‌ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అదే నెలలో భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్‌ ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు..

తీగలాగితే డొంక కదిలింది

వరంగల్‍జిల్లా :

స్కానింగ్‍ సెంటర్ల పేరుతో ఆస్పత్రులు పెడుతున్న కొంతమంది డాక్టర్లు స్కానింగ్​, అబార్షన్ల దందా నడుపుతున్నారు. రూల్స్​ను బ్రేక్​ చేస్తూ లింగనిర్ధారణ చేస్తున్నారు. స్కానింగ్​ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆడపిల్ల అని తేలితే అబార్షన్​ చేసేందుకు రూ. 50 వేల దాకా దండుకుంటున్నారు. గ్రేటర్‍ వరంగల్‍ సిటీలో పలు స్కానింగ్‍ సెంటర్ల డాక్టర్లు, వారికి సహకరించే ఆర్‍ఎంపీలు దీనిని ప్రొఫెషనల్‍గా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

రెండేళ్ల క్రితమే ఇలాంటి వరుస ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు అధికారులు హడావుడి చేసి పలు స్కానింగ్‍ సెంటర్లపై దాడులు నిర్వహించారు. అయితే మళ్లీ ఆ దందా బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని తమ అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. లింగనిర్ధారణ చేసుకునేవారిలో తమకు పుట్టే సంతానం మగ పిల్లాడు కావాలనుకునే పేద, మిడిల్‍ క్లాస్‍ పేరేంట్స్‍ ఎక్కువగా ఉంటున్నారు. అప్పటికే ఒకరిద్దరు ఆడపిల్లలు ఉండి అబ్బాయి కోసం చూసే వారిని గ్రామ, మండల స్థాయిలో ఆర్‍ఎంపీలు తమ కస్టమర్లుగా భావిస్తున్నారు. పుట్టబోయే బిడ్డ ఆడోమగో తెలుసుకునేందుకు స్కానింగ్‍ సెంటర్లకు పంపిస్తున్నారు. అబ్బాయి అయితే కూల్‍గా విషయం క్లోజ్‍ అవుతుంది. ఆడపిల్లలు వద్దనుకునే వారికి తక్కువ ఖర్చులో అబార్షన్‍ చేస్తామంటూ ఆఫర్‍ ఇస్తూ ఆపరేషన్లు చేస్తున్నారు.

వెంకన్నస్వామి, లక్ష్మీదేవి ఫోటోలతో..

కడుపులో ఉండే బిడ్డ ఆడో, మగో తల్లిదండ్రులకు చెప్పుందుకు నిర్వాహకులు కోడ్​ లాంగ్వేజీ వాడుతున్నారు. దీనికి కోసం దేవుళ్ల ఫొటోలు ఉపయోగిస్తున్నారు. తమవద్దకు వచ్చే తల్లిదండ్రులకు లింగ నిర్థారణ పరీక్షలు చేసే క్రమంలో సెంటర్‍ లోపలకు ఎవ్వరినీ మొబైల్‍ తీసుకురాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. నోటిమాటతో కాకుండా కడుపులో ఉన్నది చెప్పడానికి అబ్బాయైతే రాముడు, వెంకన్న స్వామి ఫోటోలు.. ఆడపిల్ల అయితే లక్ష్మిదేవి, సరస్వతి ఫోటోలను చూపుతున్నారు. కొంత దగ్గరివారైతే 'మీ పాప చాలా యాక్టివ్‍గా ఉందమ్మా' అని.. బాబు అయితే 'మీ అబ్బాయి చాలా యాక్టివ్‍గా ఉన్నాడని' సమాచారాన్ని చేరవేస్తున్నారు.

పోలీసుల అదుపులో.. నిర్వాహకులు.!

వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలో జరిగే అక్రమ దందాలు తన దృష్టికి తీసుకువచ్చేలా సీపీ రంగనాథ్‍ జనాలకు తన కాంటాక్ట్​ నంబర్‍ ఇచ్చారు. ఈ క్రమంలో భూకబ్జాలు, పేకాటలు, డ్రగ్స్‍ దందాల సమాచారం రెగ్యూలర్‍గా వస్తున్నాయి. ఇదే తరహాలో వారం కిందట ములుగురోడ్డు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఓ ప్రైవేట్‍ హస్పిటల్‍ నిర్వాహకులు అక్రమ స్కానింగులు, అబార్షన్లు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది. సీపీ రంగనాథ్‍ తన సిబ్బందితో రంగంలోకి దిగి నిర్వాహకులను రెడ్‍ హ్యండెడ్‍గా పట్టుకున్నారనే డిస్కషన్‍ నడిచింది. శనివారం సాయంత్రం పోలీస్‍ ల ప్రెస్‍మీట్‍ ఉన్నట్లు చెప్పడంతో నిందితుల అరెస్ట్​ చూపుతారని అందరూ భావించారు. చివర్లో ప్రెస్‍మీట్‍ క్యాన్సల్‍ అయింది. కాగా, దందాలో కొందరు పెద్ద డాక్టర్ల హస్తం ఉందని, విషయం అధికార పార్టీ పెద్ద లీడర్ల వరకు వెళ్లినట్టు సమాచారం.

సెంటర్ల అడ్రస్‍ చెబితే.. రూ. 2 వేల గిఫ్ట్​

గ్రేటర్‍ లో కొన్ని నెలల కింద ఇలాంటి వరుస ఘటనలు జరిగిన నేపథ్యంలో 'వీ6 వెలుగు పేపర్‍' వార్తలు ప్రచురించింది. స్పందించిన అప్పటి కలెక్టర్‍ రాజీవ్‍ గాంధీ హనుమంతు, డీఎంహెచ్‍ఓ లలితాదేవి నిర్వాహకులపై కేసులు పెట్టారు. టెస్టులు, అబార్షన్లు.. పర్మిషన్‍లేని స్కానింగ్‍ సెంటర్ల వివరాల ఇన్ఫర్మేషన్‍ ఇచ్చేవారికి రూ.2 వేలు మనీ గిఫ్ట్​ ఇస్తామని ప్రకటించారు. దీంతో కొన్ని రోజులు ఇలాంటి దందాలు ఆగినా.. కొత్తగా వచ్చిన అధికారులు లైట్‍ తీసుకోవడంతో ఈ దందా మళ్లీ జోరందుకున్నట్లు తెలుస్తోంది.....

గన్ వదిలి పెన్ను పట్టిన మాజీ నక్సలైట్ : పోలీస్ దళం లో చేరుతానంటున్న హిదామి

గడ్చిరోలి :

వయసు పదిహేను ఏళ్లే. కానీ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. కొండకోనలే ఆవాసాలు. మారణాయుధాలతో సహవాసం. అయితే ఆమెలో ప్రస్తుతం మార్పు వచ్చింది.

గన్‍లను వదిలి పుస్తకాలు, పెన్‌లను చేతబూనింది.. చదువుల్లో రాణించింది. ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆమెలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది. ఇందుకు కారణాలేంటో ఆమెను పలకరించిన కోకిల డిజిటల్ మీడియా

మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఇరావుల హిదామి తండ్రి.. చిన్నతనంలోనే మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయింది. ఒంటరైన ఈమెను ఎవరూ దగ్గరికి తీయలేదు. దీంతో తాను నక్సలిజంలో చేరిపోయింది. ఒడిశాలోని గడ్చిరోలి, మహారాషష్ట్రలోని గోండియా ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో చేరింది. పేరుమోపిన నక్సలైట్‍గా మారింది. పదిహేనేళ్లలోనే హిదామి పై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి,

అయితే గోండియా ప్రాంతానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి ఎస్పీ సందీప్ అతోల్ ఈ విశయంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆవిడను సరైన దిశగా మార‍్చడంలో విజయం సాధించారు. 2018లోనే ఎస‍్పీ సలహాతో అటవి మార్గం విడిచి, జనావాసాలను చేరింది.

పోలీసు అధికారి సందీప్ అతోల్ మద్దతుతో చదువును కొనసాగించింది. ఈ వారం వెలువడిన 12వ తరగతి బోర్డు పరీక్షలలో 45.83 శాతంతో ఉత్తీర‍్ణత సాధించింది. ఒకప్పుడు తుపాకి చేతబట్టి అడవులలో తిరిగిన హిదామి, ఆ బాటను మార్చుకొని చదువుపై దృష్టి సారించింది నా విజయాలకు ఎస్పీ సందీప్ అతోల్, కుటుంబమే కారణమని ఆ కుటుంబమే తన కుటుంబమని అంటోంది. భవిష్యత్‌లో పోలీసు దళంలో ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది. సమస్యల పరిష్కారానికి అటవి దారి ఒక్కటే మార్గం కాదని నక్సలైట్లకు ఆమె హితువు పలికారు..

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతిలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ప్రయోగించిన ఈ వాహకనౌక.. ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

రాకెట్‌ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి.మీ. ఎత్తులో జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ప్రవేశట్టింది. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్‌ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు.

ఈ ఉపగ్రహం భారత్‌ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందిస్తుంది.

SB NEWS

SB NEWS

హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షం

నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా భగభగ మండిన ఎండలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు అకస్మాత్తుగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది.

భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం పడింది.

విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతా­యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్‌ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.....

ఈరోజు కొనసాగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

ధోనీ ఫ్యాన్స్ పూజలకు దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరగపోతే పరిస్థితేంటి?

ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ డేకు చేరుకుంది. ఒక్కటంటే ఒక్క బంతి కూడా పడకూండా మ్యాచ్ రిజర్వ్ డేకు పోస్ట్ పోన్ అయ్యింది.ఇవాళ ఫైనల్ జరగనుంది.

దాదాపు రెండు నెలల పాటు అభిమానులను కనువిందు చేసిన ఐపీఎల్ టి20 టోర్నమెంట్‌కు ఇవాళ జరిగే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో తెరపడనుంది. తొలిసారి రిజర్వ్ డే రోజు ఫైనల్ జరగనుంది.

చెన్నై ఇప్పటికే నాలుగు టైటిల్స్‌ను గెలవగా డిఫెండింగ్ ఛాంపియన్ టైటాన్స్ ఆడిన రెండు సీజన్‌లలో ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఇప్పటి వరకు నాలుగు సార్లు ట్రోఫీలు గెలుచుకుంది. ఇవాళ జరిగే ఫైనల్లో కూడా గెలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేయాలని తహతహలాడుతోంది. ముంబై ఐదు ఐపీఎల్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

చెన్నై ఇప్పటికే నాలుగు టైటిల్స్‌ను గెలవగా డిఫెండింగ్ ఛాంపియన్ టైటాన్స్ ఆడిన రెండు సీజన్‌లలో ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఇప్పటి వరకు నాలుగు సార్లు ట్రోఫీలు గెలుచుకుంది. ఇవాళ జరిగే ఫైనల్లో కూడా గెలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేయాలని తహతహలాడుతోంది. ముంబై ఐదు ఐపీఎల్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.....

నిన్న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ఒక బంతి కూడా పడకూండానే రిజర్డ్ డేకు పోస్ట్ పోన్ అయ్యింది. ఇవాళ కూడా రెయిన్ పడి మ్యాచ్ జరగకపోతే నే విన్నర్ గా ప్రకటిస్తారు. టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ చెన్నై కంటే మూడు పాయింట్ల లీడ్ తో ఉంది.....

ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా ❓️

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయిన ట్లు కథనాలు వస్తున్నాయి. అందుకు నరేంద్ర మోడీ స్టేడియంలో చోటుచేసుకున్న టెక్నికల్ తప్పిదమే కారణం. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు టాస్ ఆలస్యమవుతున్నట్లుగా ప్రకటించారు.

ఈ విషయాన్ని ప్రదర్శించాల్సిన స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్ పై రన్నరప్ 'చెన్నై సూపర్ కింగ్స్' అని పడింది. ఇంకేముంది ఆట ప్రారంభం కాకముందే స్క్రీన్స్ పై చెన్నై అని పడడంతో ఫైనల్‌లో గుజరాత్ గెలవబోతోందని అభిమానులు అనుమానిస్తున్నారు.

ఈ సీజన్ లో చాలా మ్యాచులు ఊహకందని పలితాలతో అటు వీక్షకులను.. ఇటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్.. ఒకే ఓవర్ లో 5 సిక్సులు బాధి విజయాన్ని అందించటం, హైదరాబాద్ జట్టు ఆఖరి బంతికి 6 పరుగులు చేయాల్సిన సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ నోబాల్ వేయటం, ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచులో హర్షల్ పటేల్ మన్కడింగ్ చేయకుండా తప్పించటం.. ఇలా బోలెడు సంఘటనలు జరిగాయి. వీటికి తోడు అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు.. అభిమానులకు మరింత అనుమానాలు పెంచాయి.

ఇలాంటి పరిస్థితులలో ఆఖరి మ్యాచ్ అయినా.. సజావుగా సాగుతుందా? అంటే అదీ లేదు. మ్యాచ్ ఇంకా మొదలు కాకముందే రన్నరప్ చెన్నైగా ప్రకటించడమంటే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ గెలవబోతుందని ముందుగానే రాసి పెట్టారా? అని అభిమానులు అనుమానిస్తున్నారు.

ఇది టెక్నికల్ తప్పిదమే అయినా చెన్నై జట్టే.. రన్నరప్ అవుతుందని ఎలా ఊహించారు? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై గుజరాత్ టైటాన్స్ బాగా ఆడి గెలిచినా.. టోర్నీ స్క్రిప్ట్ అన్న వాదనలు మరింత పెరుగుతాయి. అయితే ఇది స్క్రీన్ టెస్ట్‌లో భాగంగా డిస్ ప్లే చేశారన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ తప్పిదంపై బీసీసీఐ ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి....