వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
NLG: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రేడియో డయాగ్నొస్టిక్ హబ్, రేడియాలజీ (రొమ్ము కాన్సర్) మరియు ఎక్స్ రే పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేడియో డయాగ్నొస్టిక్ హబ్ ప్రారంభించి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు... ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్య గౌడ్ గారు,
DMHO అనిమల్ల కొండల్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటిండెంట్ లచ్చు నాయక్, వైద్య కార్మికుల సంఘం పల్లా దేవేందర్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు గార్లు తదితరులు పాల్గొన్నారు.
May 11 2023, 22:14