చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో రైలు హుగ్లీ నది క్రింద విజయవంతంగా ట్రయల్ రన్
దేశంలో మొట్ట మొదటిసారిగా హుగ్లీ నది క్రింద సొరంగం ద్వారా విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది కోల్‌కతా మెట్రో. ఇది దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఈ మార్గంలో వచ్చే 7 నెలల పాటు రెగ్యులర్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని,
ఆ తరువాత, సాధారణ ప్రజలకు సాధారణ సేవలు ప్రారంభమవుతాయని కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ పి.ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.
హౌరా నుండి ఎస్ప్లానేడ్ వరకు విస్తరించి ఉన్న మార్గం పొడవు సుమారు 4.8 కి.మీ. ఇందులో 520 మీటర్లు హుగ్లీ నది కింద సొరంగం ద్వారా ఉంటుంది. సొరంగం నీటి ఉపరితల మట్టం క్రింద 32 మీటర్లు ఉంది.
Apr 14 2023, 12:30