/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz మహిళలపై వేధింపుల్లో తెలంగాణ స్థానమెంత? TS breaking
మహిళలపై వేధింపుల్లో తెలంగాణ స్థానమెంత?

దేశంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై వేధింపులు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. “విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022” పేరుతో ఒక సర్వేను నిర్వహించింది. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న 75 శాతం గృహ హింస కేసుల్లో ఒక్క అస్సాంలోనే నమోదవుతున్నట్టు ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో 50.4 శాతం గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. 48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 

మహిళలపై మూడో వంతు దాడులు వారి భర్తలు, అత్తింటివారు, వారి బంధువులే చేస్తున్నవే కావడం గమనార్హం. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వాటిలో ఉద్దేశపూర్వకదాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతంగా ఉండగా, 2019-21 నాటికి ఇవి స్వల్ప తగ్గుముఖం పట్టి 31.9 శాతానికి దిగివచ్చాయి. ఇపుడు మళ్లీ ఈ కేసులు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. 

మరోవైపు మహిళపై జరుగుతున్న దాడుల కేసుల్లో అనేకం వెలుగులోకి రావడం లేదు. అలా వచ్చిన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో 21.22 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. వీటిలో 83,536 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. అదేవిధంగా గత 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, 2011 నాటికి ఈ సంఖ్య 47,746కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 45,026కు తగ్గింది.

TS : సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట మట్టిపాలైంది. దీంతో ఆయన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి వెళ్ళి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అలాగే, నష్టపోయిన రైతుల్లో మనోధైర్యం, భరోసా కల్పించేలా ఓదార్చుతారు. 

ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టుకు చేరుకునే సీఎం కేసీఆర్ ఆక్కడ నుంచి హెలికాఫ్టరులో ఖమ్మంకు చేరుకుంటారు. 11.15 గంటలకు జిల్లాలోని బొనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఉదయం 11.45 గంటలకు రామాపురం గ్రామం నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పాలమూరు జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. 

మధ్యాహ్నం 12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అడవి రంగాపురంగాపురం గ్రామం నుంచి 1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రాపూర్‌లో దెబ్బతిన్న పంటలను ఆయన పరశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు లక్ష్మీపురం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం ఆయా జిల్లాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

శ్రీ శోభకృత్ రాష్ట్రప్రజలకు సకల శుభాలను కలుగజేయాలంటూ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

తెలుగువారు జరుపుకునే మొదటి పండగల్లో ఒకటి ఉగాది ఒకటి. తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ‘శ్రీ శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ఉగాది పండగ అన్నదాతలకు, అన్ని రంగాల్లోని వారికీ, రాష్ట్ర ప్రజలకు శుభాలను కలుగజేయాలని కేసీఆర్ కోరుకున్నారు. శ్రీ శోభకృత్‌ సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా రైతులకు సకల శుభాలను చేకూర్చాలని సూచించారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, సాగు నీరు, పచ్చని పంటలతో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. ‘శోభకృత్‌’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారు.

గవర్నర్ తమిళిసై

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా, తెలంగాణ ప్రజలకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగాది ఆనందం , ఆశల పండుగ అని, కొత్త సంవత్సరం కొత్త ఉల్లాసాన్ని , ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

“శ్రీ శోభకృతు నామ సంవత్సరం సమాజంలోని ప్రజలందరికి.. అన్ని వర్గాలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, ఆరోగ్యం, సంతోషాన్ని కలిగిస్తుందని తాను విశ్వసిస్తున్నాను” అని ఆమె తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి… తెలంగాణ హైకోర్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పోటీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఈ పోటీ పరీక్షల పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు సక్రమంగా జరగలేదనే వాదనకు పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు అభిప్రాయపడింది. అదేసమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినపిస్తూ, ‘రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్‌ ఇది. లీకేజీ కేసులో సిట్‌ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. కేవలం ఇద్దరినే అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు’ అని కోర్టుకు వివరించారు.

ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధించిన న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 11వ తేదీకి వాయిదా వేసింది.

N5 H1 వైరస్ కరోనా కంటే చాలా ప్రమాదకరమా..?

నిన్నటి వరకూ కరోనా పీడ వెంటాడింది. ఇప్పుడు మరో కొత్త రకం వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్.. కరోనా కంటే చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. కొన్ని రకాల జంతువుల నుంచి సోకుతున్న వైరస్.. కరోనా మహమ్మారిగా కంటే ప్రమాదకరమా..? ఇప్పుడు చర్చ యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది.

ఏవియన్ ఫ్లూ కొత్తరకం వైరస్ H5N1(బర్డ్‌ ఫ్లూ) ఐరోపాలోని అడవి జంతువులు, పక్షుల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ముంగిస, పందులు, ఎలుగుబంట్లు వంటి క్షీరదాలను ఇది తవ్రంగా ప్రభావితం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షులకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి H5N1. 

1997లోనే H5N1ను తొలిసారి గుర్తించారు. గత 20 ఏళ్లలో 850 మంది మనుషులు ఈ ఫ్లూ బారినపడ్డారు. హెచ్‌5ఎన్‌1 సోకిన వారిలో 50 శాతం మంది ఇప్పటివరకూ మృత్యువాత పడ్డారు. అంటే ఇన్‌ఫ్లూయెంజా వెయ్యి మందికి సోకితే 500 మంది ప్రాణాలు కోల్పోతారట. అందుకే ఇది భవిష్యత్తులో మరో మహమ్మారిగా అవతరించే ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2020లో ఏవియన్ ఫ్లూ-ఏ(H5N1) అనే కొత్త వైరస్ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇది అడవి పక్షుల ద్వారా మాత్రమే కాకుండా పందులు, ఎలుగుబంట్లు వంటి నిర్దిష్ట జాతుల క్షీరదాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ 10 కంటే తక్కువ మంది మనుషులకే సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒక్కరు మాత్రమే చనిపోయారు. 2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో 6,615 జంతువులు ఈ ఫ్లూ బారినపడ్డాయి. అక్టోబర్ 2022 నుంచి ఇప్పటివరకు 2,701 కేసులు నమోదయ్యాయి. 

బర్డ్‌ఫ్లూ మరణాల రేటు 50 శాతం నమోదవడంతో శాస్త్రవేత్తలు, వైద్యాధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 2009 హెచ్‌1ఎన్‌1 నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్‌లలో మరణాల రేటు దీనికే ఎక్కువ ఉందంటున్నారు. ఒకవేళ హెచ్‌5ఎన్‌1 మానవులకు కూడా వేగంగా వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య హెచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడిన వారందరూ అడవి పక్షులతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిచర్డ్ పిబాడీ చెప్పిన విషయం తెలిసిందే. 

అనారోగ్యానికి గురైన పక్షులు, జంతువులకు దూరంగా ఉంటే హైచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ… పక్షులు, క్షీరదాలతో పాటు ఇతర జంతువులకు వైరస్ వ్యాపించడం మొదలైందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ…

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ ప్రజలతోపాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖనే ఉదాహరణ. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ ఇయాళ కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాయడం వెనుక పెద్ద కకుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్ కు వస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌజ్ కే పరిమితమై పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు.

తన కుటుంబమే పరమావధిగా వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమయ్యే సరికి అకస్మాత్తుగా కార్యకర్తలపైన ప్రేమ పుట్టకొచ్చింది. పేపర్ లీకేజీలో కొడుకు, లిక్కర్ స్కామ్ లో బిడ్డ పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోవడంతోపాటు అనేక స్కాముల్లో పాలుపంచుకుందనడానికి రుజువు దొరుకుతుండటంతో తన కుటుంబ అవినీతిపై చర్చ జరగకుండా మరోసారి కార్యకర్తల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో భాగంగానే కేసీఆర్ ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే కాళేశ్వరం స్కామ్, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాల కు కారణమైన ఐటీ స్కాం, ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అనేక కుంభకోణాల వెనుక కేటీఆర్ కుటుంబ సభ్యుల హస్తమే ఉందని తెలంగాణ సమాజానికి అవగతమైంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా ఉండేందుకు ముందుగానే వారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశాడన్నారు.

EDకి కల్వకుంట్ల కవిత లేఖ..ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు !

ఢిల్లీ లిక్కర్ స్కాం కల్వకుంట్ల కవిత మెడ చుట్టూ బిగుసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు ఈడి విచారణను ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత… ఇవాళ మరోసారి ఈడి అధికారుల ముందుకు వెళ్ళనుంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి… ఈడి ఆఫీస్ కు కల్వకుంట్ల కవిత బయలు దేరారు.

ఈ తరుణంలోనే తన దగ్గర ఉన్న 9 ఫోన్ లను కవిత తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఈడీకి లేఖ రాశారు కవిత. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని… నాపై తప్పుడు ప్రచారం ఈడి చేస్తుందని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే తన ఫోన్లను విచ్చేస్తున్నానని కవిత ఈ లేఖ ద్వారా వివరించారు. తనను ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కల్వకుంట్ల కవిత.

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. ప్రారంభనికి సిద్ధంగా ఉన్న మరో ఫ్లైఓవర్..

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు దశల వారిగా పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్‌ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటి, పరిశ్రమలు శాఖామంత్రి కేటిఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి ప్రారంభం కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా చొరవ చూపడం జరిగింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా వాటిలో ఎల్బీనగర్ ఆర్.హెచ్.ఎస్ ఫ్లైఓవర్ 19గా అందుబాటులోకి రానున్నది.

ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులు కాగా జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన పనులలో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనులలో మూడు పూర్తికాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో కలవు. గోల్నాక నుండి అంబర్ పెట్ వరకు గల ఫ్లైఓవర్ జాతీయ రహదారుల శాఖ ద్వారా ఉప్పల్ జంక్షన్ నుండి సి.పి.ఆర్.ఐ (మేడిపల్లి) వరకు గల ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ వరకు చేపట్టనున్న ఈ రెండు 6 లైన్ల ఫ్లైఓవర్లను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టారు. అట్టి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది.జి హెచ్ ఏం సి కి సంభందించిన రూ. 2335.42 కోట్ల విలువ గల వివిధ రకాల10 పనులలో ఫ్లై ఓవర్ లు, ఇతర పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగినది.

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ ఆర్ హెచ్ ఎస్ ఫ్లై ఓవర్ ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్ తో పాటు భూసేకరణతో సహా మొత్తం రూ.32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుండి వచ్చే ప్రజలతోపాటు నగర వాసులకు హయత్ నగర్ మీదుగా నగరంలో ఇతర ప్రాంతాల వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది. 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వలన వాహన వేగం కూడా పెరుగనున్నది ఎల్ బి నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది.

ప్రజావాణిలో స్టూడెంట్ల తల్లిదండ్రుల నిరసన

 టీచర్లు లేక తమ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారని, కనీసం ఏబీసీడీలు వస్తలేవని, ఎక్కాలు చెప్పలేకపోతున్నారని, వెంటనే టీచర్లను నియమించాలని జగిత్యాల మండలం కొడిమ్యాల తహసీల్దార్​ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్​లో 86 మంది చదువుతుండగా, వీరికి కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు అవసరం కాగా  గతంలో ఒక్క టీచర్​మాత్రమే ఉండేవారు. సమస్యను ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్తే మరో టీచర్​ను అడ్జస్ట్​ చేశారు. 

అప్పటి నుంచి ఈ ఇద్దరితో పిల్లలందరికీ పాఠాలు చెప్పడం సాధ్య కావడం లేదు. దీంతో అందరినీ ఒకే చోట కూర్చుండబెట్టి గంపగుత్త చదువులు చెప్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో 30 మంది స్టూడెంట్ల తల్లిదండ్రులు సోమవారం తహసీల్దార్​ఆఫీసులోని ప్రజావాణికి తరలివచ్చారు. టీచర్లతో పాటు అటెండర్ గాని స్కావెంజర్ గాని లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే టీచర్లను రిక్రూట్ చేసి స్టూడెంట్ల చదువుకునేందుకు సాయం చేయాలని కోరారు.

లోన్‌ కోసం వెళితే.. తన పేరుపై 38 అకౌంట్లు..

ఇంటి నిర్మాణం కోసం లోన్‌ కోసం బ్యాంక్‌ కు వెళ్లిన వ్యక్తి కనీ వినీ ఎరుగని రీతిలో బ్యాంక్‌ అధికారులు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. అతని పేరుపై ఇప్పటికే 38 ఖాతాలు ఉన్నట్లు చెప్పడంతో.. లోన్‌ కోసం వెళ్లిన వ్యక్తం ఆశ్చర్యానికిగి గురయ్యాడు. తను లోన్‌ తీసుకోలేదని అయినా 38 ఖాతాలు బ్యాంక్‌ వారు ఎలా చేశారని ప్రశ్నించడంతో బ్యాంక్‌ సిబ్బంది కూడా సమాధానం చెప్పలేక షాక్‌ తిన్నారు. ఒక వ్యక్తిపై 38 ఖాతాలు ఎలా ఓపెన్ చేశారనేది అందరికి ప్రశ్నార్థంగా మారింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది.

వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు మీద 38 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన మంగళి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. కొంతమేర పనులు పూర్తి చేసిన అనంతయ్య మిగిలిన పనులు పూర్తి చేసేందుకు లోన్ తీసుకుందామని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. 

ఈనేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంక్‌ లో అనంతయ్య నుంచి వివరాలు సేకరించిన బ్యాంకు సిబ్బంది షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. అనంతయ్య పేరుతో 38 అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. అందులోనూ.. 12 అకౌంట్లు యాక్టివ్‌లో, మిగతా 26 క్లోజ్‌ అయ్యాయని, తన పేరు మీద ఓ లోన్ కూడా ఉందని చెప్పడంతో అనంతయ్యకు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను ఇప్పటి వరకు ఏలోన్‌ తీసుకోలేదని బ్యాంక్‌ సిబ్బంది తను లేకుండా ఎలా లోన్‌ ఇచ్చారని, ఖాతాలు ఎలా చేశారని ప్రశ్నించాడు.

అయితే బ్యాంక్‌ సిబ్బంది ఎవరూ స్పందిచకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించాడు. తనకే తెలియకుండా ఎవరో తన పేరు మీద బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారనే అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈసంఘటనతో తాను షాక్‌కు గురయ్యానని అనంతయ్య తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం వెళితేగానీ ఈ విషయం తెలియలేదని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరి దీనిపై పోలీసులు, బ్యాంక్‌ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు. అసలు అనంతయ్యకు తెలియకుండా బ్యాంక్‌ సిబ్బంది లోన్‌లు ఎలా ఇచ్చారు. దీని వెనుక ఎవరి హస్తం ఉన్నదానిపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు.