/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ… TS breaking
తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ…

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ ప్రజలతోపాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖనే ఉదాహరణ. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ ఇయాళ కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాయడం వెనుక పెద్ద కకుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్ కు వస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌజ్ కే పరిమితమై పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు.

తన కుటుంబమే పరమావధిగా వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమయ్యే సరికి అకస్మాత్తుగా కార్యకర్తలపైన ప్రేమ పుట్టకొచ్చింది. పేపర్ లీకేజీలో కొడుకు, లిక్కర్ స్కామ్ లో బిడ్డ పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోవడంతోపాటు అనేక స్కాముల్లో పాలుపంచుకుందనడానికి రుజువు దొరుకుతుండటంతో తన కుటుంబ అవినీతిపై చర్చ జరగకుండా మరోసారి కార్యకర్తల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో భాగంగానే కేసీఆర్ ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే కాళేశ్వరం స్కామ్, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాల కు కారణమైన ఐటీ స్కాం, ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అనేక కుంభకోణాల వెనుక కేటీఆర్ కుటుంబ సభ్యుల హస్తమే ఉందని తెలంగాణ సమాజానికి అవగతమైంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా ఉండేందుకు ముందుగానే వారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశాడన్నారు.

EDకి కల్వకుంట్ల కవిత లేఖ..ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు !

ఢిల్లీ లిక్కర్ స్కాం కల్వకుంట్ల కవిత మెడ చుట్టూ బిగుసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు ఈడి విచారణను ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత… ఇవాళ మరోసారి ఈడి అధికారుల ముందుకు వెళ్ళనుంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి… ఈడి ఆఫీస్ కు కల్వకుంట్ల కవిత బయలు దేరారు.

ఈ తరుణంలోనే తన దగ్గర ఉన్న 9 ఫోన్ లను కవిత తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఈడీకి లేఖ రాశారు కవిత. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని… నాపై తప్పుడు ప్రచారం ఈడి చేస్తుందని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే తన ఫోన్లను విచ్చేస్తున్నానని కవిత ఈ లేఖ ద్వారా వివరించారు. తనను ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కల్వకుంట్ల కవిత.

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. ప్రారంభనికి సిద్ధంగా ఉన్న మరో ఫ్లైఓవర్..

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు దశల వారిగా పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్‌ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటి, పరిశ్రమలు శాఖామంత్రి కేటిఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి ప్రారంభం కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా చొరవ చూపడం జరిగింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా వాటిలో ఎల్బీనగర్ ఆర్.హెచ్.ఎస్ ఫ్లైఓవర్ 19గా అందుబాటులోకి రానున్నది.

ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులు కాగా జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన పనులలో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనులలో మూడు పూర్తికాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో కలవు. గోల్నాక నుండి అంబర్ పెట్ వరకు గల ఫ్లైఓవర్ జాతీయ రహదారుల శాఖ ద్వారా ఉప్పల్ జంక్షన్ నుండి సి.పి.ఆర్.ఐ (మేడిపల్లి) వరకు గల ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ వరకు చేపట్టనున్న ఈ రెండు 6 లైన్ల ఫ్లైఓవర్లను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టారు. అట్టి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది.జి హెచ్ ఏం సి కి సంభందించిన రూ. 2335.42 కోట్ల విలువ గల వివిధ రకాల10 పనులలో ఫ్లై ఓవర్ లు, ఇతర పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగినది.

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ ఆర్ హెచ్ ఎస్ ఫ్లై ఓవర్ ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్ తో పాటు భూసేకరణతో సహా మొత్తం రూ.32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుండి వచ్చే ప్రజలతోపాటు నగర వాసులకు హయత్ నగర్ మీదుగా నగరంలో ఇతర ప్రాంతాల వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది. 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వలన వాహన వేగం కూడా పెరుగనున్నది ఎల్ బి నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు ఎంతగానో దోహద పడుతుంది.

ప్రజావాణిలో స్టూడెంట్ల తల్లిదండ్రుల నిరసన

 టీచర్లు లేక తమ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారని, కనీసం ఏబీసీడీలు వస్తలేవని, ఎక్కాలు చెప్పలేకపోతున్నారని, వెంటనే టీచర్లను నియమించాలని జగిత్యాల మండలం కొడిమ్యాల తహసీల్దార్​ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్​లో 86 మంది చదువుతుండగా, వీరికి కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు అవసరం కాగా  గతంలో ఒక్క టీచర్​మాత్రమే ఉండేవారు. సమస్యను ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్తే మరో టీచర్​ను అడ్జస్ట్​ చేశారు. 

అప్పటి నుంచి ఈ ఇద్దరితో పిల్లలందరికీ పాఠాలు చెప్పడం సాధ్య కావడం లేదు. దీంతో అందరినీ ఒకే చోట కూర్చుండబెట్టి గంపగుత్త చదువులు చెప్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో 30 మంది స్టూడెంట్ల తల్లిదండ్రులు సోమవారం తహసీల్దార్​ఆఫీసులోని ప్రజావాణికి తరలివచ్చారు. టీచర్లతో పాటు అటెండర్ గాని స్కావెంజర్ గాని లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే టీచర్లను రిక్రూట్ చేసి స్టూడెంట్ల చదువుకునేందుకు సాయం చేయాలని కోరారు.

లోన్‌ కోసం వెళితే.. తన పేరుపై 38 అకౌంట్లు..

ఇంటి నిర్మాణం కోసం లోన్‌ కోసం బ్యాంక్‌ కు వెళ్లిన వ్యక్తి కనీ వినీ ఎరుగని రీతిలో బ్యాంక్‌ అధికారులు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. అతని పేరుపై ఇప్పటికే 38 ఖాతాలు ఉన్నట్లు చెప్పడంతో.. లోన్‌ కోసం వెళ్లిన వ్యక్తం ఆశ్చర్యానికిగి గురయ్యాడు. తను లోన్‌ తీసుకోలేదని అయినా 38 ఖాతాలు బ్యాంక్‌ వారు ఎలా చేశారని ప్రశ్నించడంతో బ్యాంక్‌ సిబ్బంది కూడా సమాధానం చెప్పలేక షాక్‌ తిన్నారు. ఒక వ్యక్తిపై 38 ఖాతాలు ఎలా ఓపెన్ చేశారనేది అందరికి ప్రశ్నార్థంగా మారింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది.

వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు మీద 38 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన మంగళి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. కొంతమేర పనులు పూర్తి చేసిన అనంతయ్య మిగిలిన పనులు పూర్తి చేసేందుకు లోన్ తీసుకుందామని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. 

ఈనేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంక్‌ లో అనంతయ్య నుంచి వివరాలు సేకరించిన బ్యాంకు సిబ్బంది షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. అనంతయ్య పేరుతో 38 అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. అందులోనూ.. 12 అకౌంట్లు యాక్టివ్‌లో, మిగతా 26 క్లోజ్‌ అయ్యాయని, తన పేరు మీద ఓ లోన్ కూడా ఉందని చెప్పడంతో అనంతయ్యకు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను ఇప్పటి వరకు ఏలోన్‌ తీసుకోలేదని బ్యాంక్‌ సిబ్బంది తను లేకుండా ఎలా లోన్‌ ఇచ్చారని, ఖాతాలు ఎలా చేశారని ప్రశ్నించాడు.

అయితే బ్యాంక్‌ సిబ్బంది ఎవరూ స్పందిచకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించాడు. తనకే తెలియకుండా ఎవరో తన పేరు మీద బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారనే అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈసంఘటనతో తాను షాక్‌కు గురయ్యానని అనంతయ్య తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం వెళితేగానీ ఈ విషయం తెలియలేదని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరి దీనిపై పోలీసులు, బ్యాంక్‌ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు. అసలు అనంతయ్యకు తెలియకుండా బ్యాంక్‌ సిబ్బంది లోన్‌లు ఎలా ఇచ్చారు. దీని వెనుక ఎవరి హస్తం ఉన్నదానిపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు.

"క్యూ న్యూస్" ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య - జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ఖండన

జగిత్యాల జిల్లా కేంద్రం 

మార్చి 20, 2023

ప్రజా సమస్యలను వెలికి తీసి పరిస్కారానికి కృషి చేస్తున్న "క్యూ న్యూస్" కార్యాలయంపై దాడిచేయ డాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరునగరి శ్రీనివాస్ లు కోరారు.

ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా వార్త ప్రసారసాధనాలు పనిచేస్తున్నాయని అటువంటి ప్రసారసాధనల కార్యాలయాలపై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి శ్రీనివాస్ లు సోమవారం ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న తీన్మార్ మల్లన్న ప్రజాధారణ పొందుతున్నాడని అక్కసు పెంచుకున్న కొందరు వ్యక్తులు కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేయడం పత్రిక స్వేచ్ఛను కాలరాయాడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగంలో వార్త ప్రసారసాధనాలకు గౌరవం ఉందని ఫోర్త్ ఎస్టేట్ గా భావించే వార్త ప్రసారసాధనలను ఆగౌరవపరిచేవిధంగా దాడులకు పాల్పడడం క్షమించరానిదన్నారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి, శ్రీనివాస్ లు అన్నారు.

ఫీజుల పేరిట పదవతరగతి విద్యార్థులకు హాల్ టికెట్ లు ఇవ్వకుంటే సహించేది లేదు ఏ ఐ పి ఎస్ యు మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్

అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, ఫీజుల పేరిట పదవ తరగతి విద్యార్థులకు, పలు ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.

 జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే మా అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై భౌతిక దాడులు చేయడానికి వెనుకాడబొమని ఏ ఐ పి ఎస్ యు మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం ను హెచ్చరించారు. హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే, తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఏ ఐ పి ఎస్ యు జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు ఒక ప్రకటన లో తెలిపారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా హాల్ టికెట్స్ విషయం లో ఇబ్బంది పడితే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించాలని ఆయన అన్నారు. (9885588299, 8466806702.)

ఈ కార్యక్రమం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు రమేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

పేపర్ లీక్ : రేవంత్ రెడ్డికి నోటీసులు పంపిన సిట్

పేపర్ లీక్​ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్​పై రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్​ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించారు. ఇందులో కేటీఆర్​ పాత్ర కూడా ఉందన్నారు. లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్,​ మంత్రి కేటీఆర్​ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్​కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్​ పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్​ ఆరోపించారు.

మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్​ షాడో సీఎం అయితే, ఆయన పీఏ షాడో మంత్రి అని రేవంత్ అన్నారు.. మంత్రి పీఏ సొంతూరు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలమని, రాజశేఖర్​ది కూడా ఇదే మండలమని, గ్రూప్1 పరీక్షలో ఈ మండలానికి చెందిన 100 మందికి పైగా 103కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపణలు గుప్పించారు. అయితే వీటిపై వివరాలు ఇవ్వాలని సిట్ కోరింది. పేపర్ లీక్ పై ఆరోపణలు చేసే రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులు తనకు అందలేదని, అందితే స్పందిస్తానని రేవంత్ తెలిపారు.

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు – రైతుల ఆందోళన

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, పిడుగులు, ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గత రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురిశాయి. తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అదేసమయంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గత రెండు రోజుల్లోనే 5 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. దీనికితోడు ఈదురు గాలులు బలంగా వీస్తుండంతో ప్రజలు వణికిపోతున్నారు.

ఎవర్నీ కించపరచలే.. తెలంగాణలోని సామెతను చెప్పిన : బండి సంజయ్

తాను ఎవరిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మార్చి 18న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణలోని సామెతను మాత్రమే చెప్పానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు రెండు పేజీల్లో వివరణ ఇచ్చారు. ఆయన సమాధానం పట్ట మహిళా కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది . 

 ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవినుద్దేశించి వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులిచ్చింది. మార్చి 15న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. పార్లమెంట్ సమావేశాలున్నందును మార్చి 15న హాజరు కాలేనని 18న హాజరవుతానని మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.