కుక్కపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు చేసిన పోలీసులు
బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు వీధి ఆడ కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ చర్య అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటన హోలీ రోజున జరిగింది. ఫుల్వారీ షరీఫ్ లోని ఫైసల్ కాలనీలో ఇది చోటు చేసుకుందని ప్రియా అనే జంతు ప్రేమికురాలు వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భూరి ఫౌండేషన్ అనే జంతు స్వచ్ఛంద సంస్థ నుంచి ఆమె ఫిర్యాదు చేసింది.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కోరారు. దీంతో పాట్నా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దుశ్చర్యపై ఫిర్యాదు అందింది. ఐపీసీ, జంతు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫుల్వారీ షరీఫ్ మనీష్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి అసహజమైన, హేయమైన చర్య జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో ఢిల్లీ ఇంద్రపురి ప్రాంతంలోని జేజే కాలనీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అక్కడ ఆడ కుక్కపై అత్యాచారం చేస్తూ సతీష్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.
నాగ్ పూర్ లోని హడ్కేశ్వర్ ప్రాంతంలో కూడా 40 ఏళ్ల వ్యక్తి వీధికుక్కపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నంచాడు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో నిందితుడిపై సెక్షన్ 377(ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా శారీరక సంబంధం), 294( అశ్లీలత), భారతీయ శిక్షాస్మృతి, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఇతర నేరాల కింద అభియోగాలు మోపారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. ముంబై పోవాయ్ లోని హీరా పన్నా మాల్ లో 6 నెలల కుక్కపిల్లపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో జంతు కార్యకర్త, బాంబే యానిమల్ రైట్స్ అనే స్వచ్చంద సంస్థ అతడిపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
Mar 20 2023, 14:52