ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తీరని అన్యాయం
బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.
తెలంగాణ శాసనమండలికి త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు తీరని అన్యాయం చేశారని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను మూడు స్థానాలు అగ్రవర్ణాల వారినే ఖరారు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అత్యధికంగా సగానికి పైగా జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మొండిచేయి చూపి తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుని బీసీలపై భారాస ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇదే ధోరణి కొనసాగితే వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలు భారాసా పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని కట్టెకోలు దీపెందర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొళ్ళ నాగరాజు, శివేంద్ర, మారోజు రాజ్ కుమార్, వంశీ, దినేష్, శివకుమార్, ప్రవీణ్, గణేష్, అనిల్, లోకేష్, రాజు, ప్రశాంత్, సాయిహర్షిత్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Mar 08 2023, 21:07