పాలేరులో లోకల్ సెంటిమెంట్ పాలిటిక్స్.. : ఎమ్మెల్యే కందాల.
ఖమ్మంజిల్లా పాలేరులో లోకల్ సెంటిమెంట్ పొలిటికల్ హీటెక్కిస్తోంది. ఇక్కడున్నవాళ్లు ఈ ప్రాంత బిడ్డలు, మనకు పరాయినాయకులు కావాలా? అంటూ లోకల్ సెంటిమెంట్‌తో ప్రత్యర్థులను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్ టీపీ నాయకురాలు షర్మిలను ఉద్దేశించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
మన ప్రాంతాన్ని మనం బాగుచేసుకోలేమా..? ఇతర ప్రాంతాల నాయకులు రావాలా అంటూ లోకల్ సెంటిమెంట్ ప్రయోగించారు. మట్టికైనా మనోళ్లే కావాలంటారు. అలాంటిది మనకు పరాయి నాయకులు వచ్చి ఏం చేస్తారు? వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
కూసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తన అభిమతం, ఆశయం కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడమేనన్నారాయన. ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా డబ్బుంది. కానీ మన ప్రాంతం ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యమని.. అందుకే వేరే ప్రాంతాల వాళ్ల మాయమాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
![]()
పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. గతంలో పోటీచేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడే పోటీచేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డి సిట్టింగ్ సీటు నాదే అంటే ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. తుమ్మల లోకల్ కాదు.. నేను లోకల్ అంటూ కందాళ పదేపదే చెబుతున్నారు. అటు వైఎస్ షర్మిల కూడా లోకల్ కాదని…ఈ ప్రాంతం కూడా కాదంటూ ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లను నమ్మవద్దని.. మీకు తోడుగా ఉంటానంటూ మరోసారి సెంటిమెంట్ రాగం ఆలపించారు.
Mar 05 2023, 10:20