NLG: గురుకుల పాఠశాల నూతన భవన సముదాయం ను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గం:
సంస్థాన్ నారాయణపూర్ మండలం, సర్వేల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన సముదాయం ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ ప్రారంభించారు. ఈ మేరకు గురుకుల పాఠశాల సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం విగ్రహాల కు పూలమాల లు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, 18.61 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, 1 కోటి రూపాయల వ్యయం తో ఫర్నిచర్ తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దేశంలోనే సర్వేలు పాఠశాలకు ఉన్నతమైన ఘన చరిత్ర ఉంది.మద్ది నారాయణరెడ్డి తన 44 ఎకరాల స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు.
డబ్బు తో గౌరవం రాదు, విద్యతోనే వస్తుంది. చదువుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. రాజకీయ నాయకులు,కలెక్టర్లు,డాక్టర్లు, శాస్త్రవేత్తలు కావచ్చని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం కృషి చేస్తుందని,
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపనలో భాగంగా మునుగోడు వద్ద 300 కోట్ల రూపాయల తో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.మునుగోడు నియోజకవర్గంలో మండలానికి 5 పాఠశాలల చొప్పున 30 స్కూల్ లను నిర్మించేలా కృషి చేస్తానని అన్నారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం విషయంలో తేడా రావొద్దని పాఠశాల సిబ్బంది కి సూచించారు.
కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పలువురు నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు నియోజకవర్గం:
గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం విగ్రహాల కు పూలమాల లు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, 18.61 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, 1 కోటి రూపాయల వ్యయం తో ఫర్నిచర్ తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దేశంలోనే సర్వేలు పాఠశాలకు ఉన్నతమైన ఘన చరిత్ర ఉంది.మద్ది నారాయణరెడ్డి తన 44 ఎకరాల స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు.
డబ్బు తో గౌరవం రాదు, విద్యతోనే వస్తుంది. చదువుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. రాజకీయ నాయకులు,కలెక్టర్లు,డాక్టర్లు, శాస్త్రవేత్తలు కావచ్చని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం కృషి చేస్తుందని,
మునుగోడు నియోజకవర్గంలో మండలానికి 5 పాఠశాలల చొప్పున 30 స్కూల్ లను నిర్మించేలా కృషి చేస్తానని అన్నారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం విషయంలో తేడా రావొద్దని పాఠశాల సిబ్బంది కి సూచించారు.
కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పలువురు నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా, దేవరకొండ:
నాంపల్లి పట్టణంలోని గుర్రంపోడు రోడ్డు నుండి కస్తూరిబా బాలికల విద్యాలయం వరకు 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేసారు.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తమ్మడపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నల్లగొండ: భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా.. జిల్లా కేంద్రంలోని మాస్టర్ స్కూల్ లో సంవిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు పాశం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పత్రాలు పంపిణీ చేశారు.
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా నల్గొండకు విచ్చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎస్ ను ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
Nov 27 2024, 18:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.1k