NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుక
నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తాలూకా కమిటీ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్ మూర్తి యాదవ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ పీఠిక ను ప్రతిజ్ఞ చేశారు.
ఈ మేరకు ఎస్ఐ రామ్ మూర్తి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు.
ప్రపంచ దేశాల కెల్లా భారత రాజ్యాంగం దృఢమైనటువంటిది, గొప్పది అని, యావత్ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు, విధులు అందించిన మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ రచన కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
భారతదేశంలో ప్రజలందరికీ హక్కులను ఇచ్చి మనిషిని మనిషిగా చూసే గొప్ప సంకల్పాన్ని భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డదని అన్నారు.
కొండమల్లేపల్లి విఓ డాకు నాయక్, ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించిందని అన్ని కులాల జాతుల వారికి సమాన హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగం గొప్పతనం గురించి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బహుజన మేధావి డాక్టర్ ఏకుల రాజారావు, ఏఐఎస్ఎస్డి నాయకులు ధర్మపురం శ్రీను, ఏకుల సురేష్, గ్యార యాదగిరి, డివిజన్ నాయకులు ఊరే సురేష్, చేపూరి రాజేష్, వెంకన్న, కూర సాలయ్య, అన్యపాక సంజీవ, కొండమల్లేపల్లి మండల కన్వీనర్ మేదరి ప్రసాద్, చేపురి లక్ష్మయ్య, ఆడెపు శోభన్ బాబు, ఇరిగి రవి, సహదేవ్, చంటి, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, డీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పెరిక వెంకటేశ్వర్లు, కందుల చంటి, తదితరులు పాల్గొన్నారు
Nov 26 2024, 22:14