/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ Raghu ram reddy
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తున్నారు. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు వినియోగించాలి. ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ను తీసుకొస్తోంది.

భారతీయ రైల్వే (Indian Railways) వ్యవస్థ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది. రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ (IRCTC)ని ఉపయోగిస్తున్నారు. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు వినియోగించాలి. ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ను తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి (IRCTC Super APP).

రైల్వేశాఖకు సంబంధించి టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రాకింగ్‌ స్టేటస్‌ కోసం రకరకాల యాప్స్‌ని ఉపయోగించడం చాలా కష్టం అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇండియన్ రైల్వేస్ సరికొత్త సూపర్‌ యాప్‌ని తీసుకురాబోతోంది. ఇకపై ఈ యాప్‌లోనే టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రెయిన్‌ ట్రాకింగ్‌ చేసేందుకు వీలుంటుంది.

అంతేకాదు రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందట. ఇక, ప్లాట్‌ఫారమ్‌ టికెట్ నుంచి జనరల్‌ టికెట్‌ వరకు ఆన్‌లైన్‌ మోడ్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది. డిసెంబర్ చివరి నాటి ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తుందట.

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను 10 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్‌గా నిలిచింది. రైల్ మదద్, యూటీఎస్, సటార్క్, టీఎమ్‌సీ-నిరీక్షన్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్‌రీడ్‌ వంటి యాప్‌లు కూడా రైల్వే సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. వీటన్నింటిలోనూ ఉన్న సేవలను ఓకే సూపర్ యాప్ ద్వారా అందించేందుకు రైల్వే సిద్ధమవుతోంది.

దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే

దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాలుష్యపూరితమైన గాలిలో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి ఉన్న నగరం/నగరాలు ఏంటో తెలుసా? ఉత్తమ గాలి నాణ్యత ఉన్న నగరం ఏది? దేశంలో స్వచ్ఛమైన గాలి ఉన్న టాప్ 10 నగరాలు/ప్రాంతాల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చన్నరాయపట్నం నగరంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఉంది. అందుకే ఈ ప్రాంతం టాప్ 1 లో నిలిచింది. చన్నరాయపట్నంలోని AQI సోమవారం ఉదయం 8 గంటలకు 8 పాయింట్స్‌గా నమోదైంది.

పరిశుభ్రమైన గాలి ఉన్న నగరాల జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్ రెండో స్థానంలో ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు బిష్ణుపూర్ ఏక్యూఐ 10 పాయింట్స్‌ నమోదైంది.

అస్సాంకు చెందిన సిల్చార్, మణిపూర్‌కు చెందిన కక్చింగ్, కర్ణాటకలోని బేలూర్ నగరం మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు 11 పాయింట్స్‌ నమోదైంది.

నాగాలాండ్ రాజధాని కోహిమా పరిశుభ్రమైన గాలిలో ఆరవ స్థానంలో ఉంది. ఇక్కడ సోమవారం ఉదయం 8 గంటలకు AQI 12 గా నమోదైంది.

దేశంలోని స్వచ్ఛమైన గాలిలో కర్ణాటకలోని హసన్ నగరం, మణిపూర్ రాజధాని ఇంఫాల్ కూడా టాప్ 10లో ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 13 నమోదైంది.

మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కూడా గాలి చాలా శుభ్రంగా ఉంది. గాలి నాణ్యత ఆధారంగా ఐజ్వాల్ తొమ్మిదవ స్థానంలో ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఐజ్వాల్‌లో ఏక్యూఐ 14 నమోదైంది.

పరిశుభ్రమైన గాలి ఉన్న మొదటి 10 నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి 10వ స్థానంలో ఉంది. ఇక్కడ సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 15 పాయింట్స్‌ నమోదైంది.

రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి అంకానికి , అభ్యర్థుల ప్రచారం

అమెరికా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది.పోలింగ్‌ తేదీ కంటే ముందుగానే ఓటు వేసేందుకు కోట్ల మంది యూఎస్ పౌరులు ముందుకు వస్తున్నారు. రేపే (మంగళవారం) పోలింగ్‌ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇక, ముందస్తు ఓటింగ్‌కు ఓటర్లు గతంలో కంటే ఈసారి ఎక్కువగా వస్తుండటంతో పోలింగ్‌ కేంద్రాలను పెంచాల్సి వచ్చింది.

న్యూయార్క్‌లోని 42 బ్రాడ్‌వేలో ఉన్న బోర్డు ఆఫ్‌ ఎలక్షన్స్‌ ఆఫీసు ఈ ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్, ఆయన డిప్యూటీ విన్సెంట్‌ ఇగ్నిజియో ఎన్నికల పనుల్లో స్పీడ్ పెంచారు. ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్‌ రికార్డు సృష్టించగా.. అది ఇంకా కొనసాగుతోందని ర్యాన్‌ వెల్లడించారు. న్యూయార్కే కాదు.. అమెరికా మొత్తం ఇదే ట్రెండ్‌ నడుస్తుంది. మెయిల్స్, పోలింగ్‌ కేంద్రాల ద్వారా వారంతా ఓట్లు వేస్తున్నారు.

ఇక, గత ఎన్నికల్లో న్యూయార్క్‌లో ముందస్తు పోలింగ్‌ కేంద్రాలను 100 ఏర్పాటు చేయగా.. ఈసారి 50 శాతం అధికంగా ఏర్పాటు చేశారు. అయితే, అసాధారణ వాతావరణ పరిస్థితులు, పోలింగ్‌ రోజున భారీ క్యూలతో ప్రజల ఇబ్బందులు, ఎన్నికల రోజున గొడవలు.. ముందస్తు ఓటింగ్‌కు కారణాలుగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌.. తనకు అనుకూలమైన నార్త్‌ కరోలినాలో మకాం వేశారు. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రేపటి (మంగళవారం) వరకూ నార్త్‌ కరోలినాలో ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా నజర్ పెట్టారు.

అలాగే, న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. నార్త్‌ కరోలినాలోని గ్యాస్తోనియా, ఛార్లెట్, గ్రీన్స్‌బరోల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఆదివారం కింగ్‌స్టన్‌లో ప్రచారం చేయగా.. ఈరోజు (సోమవారం) రాలేగ్‌లో నిర్వహించే ప్రచారంలో ఆయన పాల్గొంటారు. దీంతో నార్త్‌ కరోలినాలోనే అక్టోబరు 1 నుంచి ఆయన 9 ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ 6సార్లు ఈ రాష్ట్రంలో పర్యటించారు.

కమలా హారిస్‌ కూడా శనివారం నార్త్‌ కరోలినాలోని ఛార్లెట్‌లో ప్రచారం చేయగా.. ఇవాళ తన భర్త డగ్‌ ఎంహాఫ్‌ను గ్రీన్‌విల్లేకు పంపబోతున్నారు. తుఫాన్ కారణంగా నార్త్‌ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. శుక్రవారం నాటికి నార్త్‌ కరోలినాలో 78 లక్షలమంది ఓటు వేశారు.

ఉద్యోగులకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాం

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని చెరుకూరివారి తోటలో ఆదివారం జరిగిన ఖమ్మం జిల్లా సకల ఉద్యోగుల వనసమారాధన, ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, రెవెన్యూ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రభుత్వాల తలరాతను మార్చే శక్తి కలిగిన ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని తెలిపారు.

అయితే వాటిని పరిష్కరించేందుకు కాస్త సమయం కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకుంటూ ప్రాధాన్య క్రమంలో ఒక్కో రంగం సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఇక, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు నిరంతరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పాక్ వింత వాదన

పాకిస్థాన్ లోని పంజాబ్ సిటీలో దారుణంగా రికార్డయిన ఏక్యూఐ

మన దేశం నుంచి వీచే గాలులతో వాయు కాలుష్యం పెరిగిందని ఆరోపణ

ఓ టీవీ ఇంటర్వ్యూలో పాక్ పంజాబ్ మంత్రి విమర్శలు

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని వింత వాదన తెరపైకి తెచ్చింది. ఈమేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

శీతాకాలంలో ఢిల్లీ, హర్యాణా, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అసాధారణ స్థాయిలో రికార్డవుతుంది. మన దేశంలోనే కాదు పాకిస్థాన్ లోనూ పంజాబ్ రాష్ట్రం ఉంది. అక్కడి లాహోర్ సిటీలో వాయు కాలుష్యం ఇటీవల భారీగా పెరిగింది.

ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్ లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు.

ఆదివారం లాహోర్ లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. వీచే గాలిని ఆపడం కుదరదని, భారత్ తో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు.

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం

సాంకేతిక సమస్య కారణంగా హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో మెట్రో సేవలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో దాదాపు 30 నిమిషాలుగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్ -రాయదుర్గం, ఎల్బీ నగర్ - మియాపూర్ కారిడార్లలో ట్రైన్లు నిలిచిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయం కావటంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.

ట్రైన్లు సకాలంలో రాకపోవటంతో మెట్రో ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్నారు. ట్రైన్లలో ఉన్నవారు ట్రైన్లలో.. స్టేషన్లలో ఉన్నవారు స్టేషన్లలోనే ఉండిపోయారు. అయితే ఈ అంతరాయంపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

హైదరాబాద్‌ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం రెండ్రోజుల క్రితం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సెకండ్ ఫేజ్‌లో మెుత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనుండగా.. అందుకు అనుమతి లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

మొత్తం మెట్రో ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. అందులో తెలంగాణ ప్రభుత్వ వాటారూ.7,313 కోట్లు ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతుండగా.. కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ విస్తరించనున్నారు. నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలో మీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు మెట్రోను విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

కేంద్రం కొత్త వరాలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల పెంపు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పలు రాష్ట్రాల్లో రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ పెంపుకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 60 వేల కిలో మీటర్ల మేర నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసింది. విజన్ - 2047 అమల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఏపీతో పాటుగా తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. పలు నూతన ప్రాజెక్టులను ప్రకటించారు.

కేంద్రం తాజాగా ఖరారు చేసిన హైస్పీడ్ కారిడార్లలో ఏపీ - తెలంగాణ మీదుగా పలు ప్రాజెక్టుల కు చోటు కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్దం అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్ల ను వైడెనింగ్ చేయటం తో పాటుగ అంతర్గత రోడ్ల అనుసంధానం కు నిధులు కేటాయించారు. కేంద్రం ఖరారు చేసిన హైస్పీడ్ కారిడార్లలో ఏపీకి 9, తెలంగాణకు 6 ప్రాజెక్టులు దక్కాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. వీటిని రెండు దశల్లో పూర్తి చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాల పైన కసరత్తు పూర్తి చేసారు. అయితే, అధికారికంగా ఈ ప్రాజెక్టుల రూట్ మ్యాప్ తో పాటుగా భూ సేకరణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ప్రాజెక్టులకు సంబంధించి రెండు సంస్థల నుంచి కేంద్రం నివేదికలు సేకరించింది. మొత్తం గా దాదాపు 60 వేల కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం కు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలతో పాటుగా భవిష్యత్ రద్దీకి అనుగుణంగా ప్రణాళికల పైన కసరత్తు కొనసాగుతోంది. 2047 లోగా వీటి నిర్మాణం పూర్తి చేయాలనేది కేంద్రం లక్ష్యంగా ఉంది. తెలంగాణ లో హైదరాబాద్ నుంచి రాయపూర్ వరకు హైస్పీడ్ కారిడార్ రానుంది. అదే విధంగా నాగపూర్ - హైదరాబాద్ ప్రతిపాదన మరొకటి. హైదరాబాద్‌- విశాఖపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్దం చేసారు.

ఏపీకి ఈ ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. అందులో హైదరాబాద్‌- బెంగళూరు వరకు ప్రతి పాదించిన మార్గం ఏపీలో 261 కి.మీ వరకు ఉండనుంది. ఖరగ్‌పూర్‌- కటక్‌- విశాఖపట్నం మార్గం ఒడిశా మీదకు ఏపీ వరకు కొనసాగనుంది. చౌటుప్పల్‌ ఎన్‌హెచ్‌-65 నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మరో ప్రతిపాదన సిద్దమైంది.

ఏపీ పరిధిలో 335 కిలో మీటర్ల మేర అతి పెద్ద హై స్పీడ్ కారిడార్ వైజాగ్‌- కాకినాడ- రామేశ్వరం- విజయవాడ- గుంటూరు- ఒంగోలు వరకు ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ బీచ్‌, అదే విధంగా నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి తంగలం, సూళ్లూరు పేట- మోమిడి వరకు రోడ్ల ఏర్పాటుకు ఆమోదం దక్కనుంది.

నిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స

చిన్నతనం నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న యువకుడికి నిమ్స్‌ వైద్యులు(Nims doctors) అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మహబూబాబాద్‌(Mahbubabad) జిల్లా కుర్వి మండలం నారాయణపురం తండాకు చెందిన బానోత్‌ అశోక్‌ (20) చిన్నతనం నుంచే ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా హృద్రోగ సమస్య ఉందని గుర్తించారు.

చిన్నతనం నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న యువకుడికి నిమ్స్‌ వైద్యులు(Nims doctors) అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మహబూబాబాద్‌(Mahbubabad) జిల్లా కుర్వి మండలం నారాయణపురం తండాకు చెందిన బానోత్‌ అశోక్‌ (20) చిన్నతనం నుంచే ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా హృద్రోగ సమస్య ఉందని గుర్తించారు. ఐదేళ్ల వయసులో ప్రైవేట్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయగా కోలుకున్న అతను నాలుగేళ్లుగా ఆయాసం, గుండెదడతో బాధపడుతున్నాడు.

పరీక్షించిన వైద్యులు అతడి పల్మనరీ వాల్‌ లీక్‌ అవుతుందని గ్రహించారు. వెంటనే శస్త్ర చికిత్స చేయించాలని, అందుకు రూ. 25లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దాంతో అతడిని నిమ్స్‌కు తరలించగా కార్డియాలజీ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సాయి సతీష్‌(Senior Professor Dr. Sai Satish) ఆధ్వర్యంలో ఆధునిక పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు పరిశీలించి రక్తనాళాల ద్వారా కృత్రిమ పల్మనరీ వాల్వ్‌ను అమర్చేందుకు నిర్ణయించారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సహకారంతో డాక్టర్‌ సాయి సతీష్‌ నేతృత్వంలో వైద్యులు హేమంత్‌, శైలేష్‌ భాటియా, రాజశేఖర్‌, అమర్నాథ్‌, త్యాగి, అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ అద్నాన్‌, తదతరులతో కూడిన వైద్యబృందం అక్టోబరు 25న శస్త్ర చికిత్సను నిర్వహించింది. రోగికి 35 మిల్లీమీటర్ల సైజు మై వాల్‌ కృత్రిమ పల్మనరీ కవాటాన్ని అమర్చారు. ఈ రకం పల్మనరీ కృత్రిమ కవాటం అమర్చడం భారతదేశంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్దదని నిమ్స్‌ కార్డియాలజీ వైద్యులు సతీష్‌ తెలిపారు.

చంద్రబాబు.. ప్రజా ముఖ్యమంత్రి

సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పందించారు. చంద్రబాబు పర్యటన చాలా సాదా సీదాగా జరిగిందన్నారు. జిల్లాలో సమస్యలపై ఓ సీఎం ఇలా సమీక్ష చేయడం ప్రపంచంలో గతంలో ఎక్కడ జరగలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజా ముఖ్యమంత్రి అని అభివర్ణించారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా ముఖ్యమంత్రి అని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చాలా నిరాడంబరంగా జరిగిందని ఆయన తెలిపారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం శ్రీకాకుళంలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన దిగ్విజయం అయిందన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు.

ఒక ముఖ్యమంత్రి.. జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించటం గత చరిత్రలో ఎప్పుడు, ఎక్కడా లేదన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని ఆయన వివరించారు. ఈ సందర్బంగా జిల్లా సమస్యలపై సీఎం చంద్రబాబు చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ జిల్లాలో గత ఐదేళ్లలో నీటి పారుదల వ్యవస్థను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ కేంద్రమంత్రి మండిపడ్డారు.

జిల్లాలోని వంశధార పేజ్-2 ద్వారా 90 టీఎంసీ నీటిని అందుబాటులోకి తేవటానికి చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని నదులను అనుసంధానం చేయటానికి గతంలోనే ఓ ప్రయత్నం చేశామన్నారు. అయితే నదులు అనుసంధాన ప్రాజెక్ట్‌లో భాగంగా అసంపూర్తిగా ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ఆదేశించారని ఆయన తెలిపారు.

ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కొత్త డిపిఆర్ తీసుకుని వాటి పనులు చేపట్టడానికి సీఎం అంగీకరించారన్నారు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వలసలు నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందుకోసం మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. ఇక మూలపేట పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామికాభివృద్ధి సైతం చేపట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. అందుకోసం మూలపేట సమీపంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన అరసవెల్లి అభివృద్ధికి సైతం చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. గ్లోబల్ స్టాండర్డ్స్ స్థాయిలో ఈ దేవాలయం అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఈ ఆలయాభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్‌లో భాగంగా చేపడతామని వివరించారు. ఇక జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు సైతం తీసుకుంటామని ఆయన జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

జిల్లాలో విస్తృతమైన ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సైతం జిల్లాకు ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకే సారి జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి వస్తే.. ఉచిత సిలిండర్‌తోపాటు మరో ఐదు పథకాలు అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ మ్యానిఫెస్టోలో ‘సూపర్ సిక్స్’ పేరిట ఈ పథకాలను ఆ పార్టీ పొందు పరిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు.

అనంతరం లబ్దిదారుడి నివాసంలో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. అనంతరం ఈ టీని అందరు తాగారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడితోపాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడం పట్ల.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం పైవిధంగా స్పందించారు.

సముద్ర గర్భంలోకి

భూగోళం మూడొంతులు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జీవరాశుల్ని లెక్కించడం తలకు మించిన భారమే. ఇప్పటిదాకా రెండున్నర లక్షల జాతుల జీవుల్ని గుర్తించారు. మనకు తెలియని ఈ ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కలిగిస్తోంది ‘ఓషన్‌ ఒడిస్సీ

భూగోళం మూడొంతులు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జీవరాశుల్ని లెక్కించడం తలకు మించిన భారమే. ఇప్పటిదాకా రెండున్నర లక్షల జాతుల జీవుల్ని గుర్తించారు. మనకు తెలియని ఈ ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కలిగిస్తోంది ‘ఓషన్‌ ఒడిస్సీ’.

అందరూ పూర్తిగా లీనమయ్యే ఎగ్జిబిషన్‌ ఇది. సముద్రాల్లో జీవరాశుల జీవన వీడియోలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

వీటిని క్యాప్చర్‌ చేసింది ప్రసిద్ధ ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌’ ఫొటోగ్రాఫర్‌ బ్రియన్‌ స్కెర్రీ. పది వేలకు పైగా గంటలను వివిధ సముద్రాల్లో గడిపి ఎన్నో అరుదైన దృశ్యాలను ఆయన చిత్రీకరించారు.

ఆ వీడియోలను వివిధ నగరాలలో ‘ఓషన్‌ ఒడిస్సీ’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జర్మనీలోని డార్ట్‌మండ్‌ నగరంలో ఈ ఎగ్జిబిషన్‌ జరుగుతోంది. ఆడియో వీడియో ప్రెజెంటేషన్‌ చూసి సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు.