/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఆ విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వండి.. కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు Raghu ram reddy
ఆ విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వండి.. కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు

కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్‌లో పాఠశాల విద్యను అభ్యసించి.. హైదరాబాద్‌లోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ విద్యార్థినికి స్థానిక కోటాలో అడ్మిషన్‌ ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపిన ఘటనలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేశింది. సదరు విద్యార్థినికి స్థానిక కోటాలోనే సీటు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఓ విద్యార్థినికి ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ విషయంలో వచ్చిన ధర్మ సంకటంపై కాళోజీ విశ్వవిద్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరు విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వాలని యూనివర్సిటీని ఆదేశించింది. దుబాయ్‌లో పాఠశాల విద్యను అభ్యసించి.. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన.. హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన అనుమత ఫరూక్‌ను.. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ మీద విచారణ చేపట్టిన.. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం.. ఈ తీర్పును వెలువరించింది.

అయితే.. ఫరూక్ 1998 నుంచి 2008 వరకు (10వ తరగతి వరకు) దుబాయ్‌లో విద్యాభ్యాసం చేసింది. 2019 నుంచి తెలంగాణలోనే నివాసం ఉంటోంది. తెలంగాణలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్షకు హాజరయ్యారైనట్టు.. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జులైలో తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టానికి ఇటీవల చేసిన సవరణల ప్రకారం.. ఒక విద్యార్థి తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివినా.. లేదా అదే వ్యవధిలో రాష్ట్రంలో నివసించినా.. వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయవాది వివరించారు.

నివాస అవసరాన్ని పూర్తి చేసి.. అవసరమైన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించినప్పటికీ.. పిటిషనర్‌ను స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవటం దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థినిని ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌ను ఆదేశించింది. లోకల్ కేటగిరీ కింద అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆ విద్యార్థినికి అనుమతి ఇవ్వాలని యూనివర్సిటీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తెలంగాణ స్థానికతపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై సర్వత్రా వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. కోర్టు వివాదాలతో.. కౌన్సిలింగ్‌ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించింది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.

.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం పని చేస్తోంది. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో మాట్లాడారు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుందని చెప్పారు.

మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రలతో భేటీ అవుతున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణకు వరద సాయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నమామీ గంగకు నిధులు కేటాయించినట్లుగానే రాష్ట్రంలోని మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్ల సహాయం ప్రకటించగా.. తెలంగాణ మాత్రం రూ.416.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో వరదలతో చాలా నష్టపోయిందని రేవంత్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రె అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై వార్తలు వస్తుండడంతో రేవంత్ పార్టీ పెద్దలతో ఇందుకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోమవారం రాత్రికి లేదా.. మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.

కొండా సురేఖపై నాగార్జున పిటీషన్ విచారణ.. కోర్టు కీలక ఆదేశాలు!

అక్కినేని కుటుంబంపై నాగచైతన్య సమంతల విడాకులపైన కొండా సురేఖ చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున కొండ సురేఖ వ్యాఖ్యల విషయంలో చాలా సీరియస్ గా స్పందిస్తున్న విషయం తెలిసిందే.

నాగార్జున పిటీషన్ పై విచారణ

అయితే తాజాగా సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపైన నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపు న్యాయవాది ఈరోజు కోర్టులో తమ వాదన వినిపించారు. సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో తమ వాదనను వినిపిస్తూ నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తమ కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున

గత గురువారం నాడు నాంపల్లి కోర్టులో మంత్రి కొండ సురేఖ పైన నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు . క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన నాగార్జున తమ కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబం పైన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని పేర్కొన్నారు.

నాగార్జున పిటీషన్ విచారణ రేపటికి వాయిదా

నిజా నిజాలు తెలుసుకోకుండా తమ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఆమె పైన చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నేడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు రేపు నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని ఆదేశించి విచారణను రేపటికి వాయిదా వేసింది.

కొండా సురేఖపై నాగార్జున ఫైర్

అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నాగార్జున తన కుటుంబం విషయంలో తాను చాలా బలవంతుడిననీ ఎవరైనా సరే తన కుటుంబం జోలికొస్తే తాను ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. మంత్రి కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో తమ కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తీవ్ర అసహనంలో నాగార్జున

మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దంటూ కొండా సురేఖ పై అసహనం వ్యక్తం చేసిన నాగార్జున ఆమె పైన 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు . అంతే కాదు క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేసి సురేఖ పైన సమర శంఖం పూరించారు.

30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ?

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలగా పునర్విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇందు కోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు. ఏపీ చిన్నా తక్కువ జనాభా ఉన్న, 17 మాత్రమే పార్లమెంట్ స్థానాలు అదీ కూడా గ్రేటర్ పరిధిలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికి 33 జిల్లాలుగా చేశారు. కానీ ఏపీలో 26 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడో వందల కిలోమీటర్ల దూరం ఉంది. అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరి చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది.

తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ మార్కాపురం, మదనపల్లి, హిందూపురం,ఆదోని గా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగన్ జిల్లాలను మార్చారు కానీ… ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడమే. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందనుకున్నారు జగన్. కానీ ఉద్యోగులు, ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి.. మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

తెలంగాణా రైతుల రుణమాఫీపై షాకింగ్ లెక్కలు!

రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని అవలంబిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతాంగంతో పాటు యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ ను ఇరకాటంలో పెట్టేలా రుణమాఫీపై షాకింగ్ లెక్కలు చెప్పారు.

రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన మోసం

ఈ బహిరంగ లేఖలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఆ హామీని నిలబెట్టుకోలేదని హరీష్ రావు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కానీ రాష్ట్రంలో రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని హరీష్ రావు వెల్లడించారు.

రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ చేసింది ఇదే

రుణమాఫీ పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్న హరీష్ రావు సెప్టెంబర్ 25వ తేదీన ఆర్టిఐ దరఖాస్తుకు ఎస్బిఐ ఇచ్చిన సమాచారంతో రుణమాఫీ పూర్తిగా కాలేదని తేలిపోయిందని స్పష్టం చేశారు. లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణం తీసుకున్న రైతుల సంఖ్య రెండు లక్షల 62,341 కాగా ఇప్పటివరకు లక్ష 30 వేలు 915 మంది రైతులకు రుణమాఫీ అయిందని పేర్కొన్నారు.

లెక్కలతో బయటపెట్టిన హరీష్ రావు

ఇక లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5 లక్షల 74,137 కాగా, 2 లక్షల 99 వేల 445 మంది రైతులకు రుణమాఫీ అయిందని మిగతా వారికి కాలేదన్నారు. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య రాష్ట్రంలో 1,65,67 మంది కాగా ఇప్పటివరకు 65,231 మందికి రైతు రుణమాఫీ పూర్తయినట్టు ఎస్బిఐ డేటా అందించిందని హరీష్ రావు పేర్కొన్నారు.

రుణ మాఫీపై బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు

మొత్తంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని రైతులను పక్కా మోసం చేసిందని హరీష్ రావు ఆధారాలతో సహా బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, తెలంగాణనే కాదు భారతదేశాన్ని కూడా మోసం చేసిందని హరీష్ రావు వెల్లడించారు. రుణమాఫీ అమలు చేయకుండానే అమలు చేసినట్టు ఫోజులు కొట్టడం దుర్మార్గమని రైతు రుణమాఫీనే శుద్ధ అబద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో బాంబు పేల్చిన ఆరా మస్తాన్

వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి. గత 15 ఏళ్లుగా చేసిన సర్వేల్లో ఆరా చెప్పిన ఫలితాలే రావడంతో మెజార్టీ ప్రజలు ఆయన ఆ సంస్థ చెప్పిన ఫలితాలే వస్తాయని భావించారు.ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఓ నిబద్ధత ఉంటుంది. ఆయన చేసిన సర్వే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. తన సర్వే నిజం అవుతుందని.. మరోసారి జగనే సీఎం అని ఆయన బల్ల గుద్ది మరి చెప్పడం జరిగింది.

ఆరా మస్తాన్ సర్వే తర్వాత వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగాయి. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది.కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆరా మస్తాన్ జగన్‌ను గుడ్డిగా నమ్మడంతోనే అతి విశ్వాసానికి వెళ్లాడని విమర్శలొచ్చాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత ఆరా మస్తాన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజుల పూర్తయిన తర్వాత మరోసారి మస్తాన్ యాక్టివ్ అయ్యారు.దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయ చర్చ జరిపేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా మస్తాన్ స్పందించారు.పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20ని అధికారిక వెబ్ సైట్‌లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత 48 గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్ సైట్‌లో ఉంచాలని మస్తాన్ తెలిపారు. కానీ వంద రోజులు పూర్తయిన తర్వత దాన్ని ఎందుకు అధికారికంగా అప్ లోడ్ చేశారని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆరా మస్తాన్ కోరుతున్నారు.అయితే ఎన్నికల తతంగం ముగిసిన 100 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫలితాల గురించి ఆరా మస్తాన్ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆరా మస్తాన్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుందో లేదో చూడాలి.

వదంతులేం నమ్మొద్దు.. అంతా బాగానే ఉంది.. ఆ వార్తలపై రతన్ టాటా క్లారిటీ!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సోమవారం రోజు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలొచ్చాయి. లో బీపీతో ఆస్పత్రిలో చేరారని.. ఐసీయూలో చేరారని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే వార్తలు విస్తృతమవుతున్న తరుణంలోనే రతన్ టాటా ట్విట్టర్‌లో దీని గురించి స్పందించారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పారు.

తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై స్పందించారు టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని.. తాను బాగానే ఉన్నానని అన్నారు. బీపీ డౌన్ అయి ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ట్విట్టర్‌లో (x) పేర్కొన్నారు. ఇప్పటికీ తాను ఉత్సాహంగానే ఉన్నట్లు వివరించారు. అంతకుముందు.. తీవ్ర అనారోగ్యంతో.. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారని, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు మీడియాల్లో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే.. సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో స్వయంగా రతన్ టాటానే స్పందించాల్సి వచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వదంతులేనని ఖండించారు. తన ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు.

నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు/ఊహాగానాల గురించి తెలిసింది. అందుకే నేను దీని గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. నా వయసు రీత్యా.. సాధారణ వైద్య చికిత్సల కోసమే ఆస్పత్రికి వెళ్లాను. ఇక్కడ ఆందోళన అవసరం లేదు. నేను ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నా. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని.. ప్రజలు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.' అని రతన్ టాటా ట్వీట్ చేశారు.

ఏపీలో మరో 10 రూపాయల డాక్టర్-దసరా నుంచే..! ఎక్కడో తెలుసా

ఏపీలో ప్రస్తుతం ఏ చిన్న ఆస్పత్రికి వెళ్లినా ఔట్ పేషెంట్ (ఓపీ) సర్వీస్ కోసం కనీసం 500 సమర్పించుకోవాల్సిందే. ఆ తర్వాత పరీక్షలు, మందులు, సర్జరీలు కావాలంటే భారీ మొత్తం ఇచ్చుకోక తప్పదు. కానీ ఇంకా రాష్ట్రంలో పది రూపాయల డాక్టర్లు అక్కడక్కడా తమ సేవలు అందిస్తూనే ఉన్నారు. అంతే కాదు ఇదే కోవలో మరికొందరు పది రూపాయల డాక్టర్లు కూడా తమ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పులివెందులలో 10 రూపాయల డాక్టర్ గానే పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయవాడ నుంచి వెళ్లి కడపలో ఇదే పది రూపాయల కాన్పెప్ట్ తో నూరీ పరీ అనే మహిళా డాక్టర్ కూడా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు చేస్తున్న డాక్టర్లు చాలా మందే ఉన్నారు. ఇదే కోవలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మరో 10 రూపాయల డాక్టర్ సేవ చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ ఎం. లక్ష్మీప్రియ తన సొంత గడ్డ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు అందించేందుకు సిద్దమవుతున్నారు. ఈ దసరా నుంచే ఈ సత్ కార్యం మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

జనరల్ కేసులు, పీడియాట్రిక్ కేసులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్, దీర్ఘకాలిక సమస్యలకు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 8 వరకు డాక్టర్ లక్ష్మీప్రియ అందుబాటులో ఉండనున్నారు. నందిగామలో ప్రభుత్వ హాస్పిటల్ రోడ్ లోని యాదవుల బావి దగ్గర ఉన్న లత క్లినిక్స్, C/O అజయ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో ఈ పది రూపాయల డాక్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ పోస్టుల పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదులు

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు

అసభ్యకరమైన, అసత్యమైన ఫేక్ పోస్టులు చేయడం ఆపకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాల పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హమీల అమలుపైన ఫొకస్ చేయాలని సూచన

ఇప్పటికైనా తీరు మార్చుకొని ఫేక్ పోస్టులు ఆపకుంటే బుద్ధి చెబుతామని హెచ్చరిక

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వకాధ్యక్షులు కేటీఆర్ గారి పైన పదేపదే తప్పుడు పొస్టులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న అసహ్యకరమైన అడ్డగోలు, ఫేక్ పోస్టుల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సలహా మేరకు నిజామాబాద్ జిల్లా కమిషనర్ కి పార్టీనేతలు పలు సామాజిక మాద్యమాల్లో ఉన్న పోస్టులపైన ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోనూ సిసిఎస్ కేంద్ర కార్యాలయంలో గోషామహల్ నియోజకవర్గం నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్, తదితరులు స్థానిక ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు సిరిసిల్లలోనూ పలువురు యువ నాయకులు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కేటీఆర్ గారి పైన పెట్టిన పలు పోస్టుల పైన ఫిర్యాదు చేశారు. వరంగల్లోనూ పలు చోట్ల ఈ అసత్యమైన సోషల్ మీడియా పోస్టుల పైన ఫిర్యాదు చేశారు. 

ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సోషల్ మీడియాలో ఇతర పార్టీలు తమపైన దుష్ప్రచారం చేస్తున్నాయని మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు తన పార్టీ కార్యకర్తలు, పెయిడ్ ట్రోల్స్ తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నిరంతరంగా దుష్ప్రచారం చేయిస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అసహ్యకరమైన ఈ దుష్ప్రచారాన్ని ఆపకుంటే గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఈ ఈ నీచమైన ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ తెరలెపిందన్నారు. ఇప్పటికైనా తమ బుద్ధి మార్చుకొని ఇతరులకు సుద్దులు చెబుతున్న తీరుగా, తమ సొంత పార్టీ సోషల్ మీడియాను నియంత్రణలో ఉంచాలని ముఖ్యమంత్రికి సూచించారు.

జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు

ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ వివాదం జాతీయ అవార్డు రద్దు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

తనను లైగింక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో 2022కుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు ఆశ్రయించారు.

2022లో తిరుచిత్రబలం(తెలుగులో తిరు) చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది.

అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ జానీ మాస్టర్‌ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఇప్పుడు నార్సింగి పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో జానీ మాస్టర్ ఏం జరుగుతుందో చూడాలి.