/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి Mane Praveen
NLG: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి
నల్లగొండ: సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, దోపిడీలకు ఎదురోడి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకొని గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని సాగర్ రోడ్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు పోరాట పటిమ ను నేర్చుకోవాలని, ఆమెను ఆదర్శంగా తీసుకొని తమ హక్కుల కోసం ఉద్యమించాలని, రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరును కోటి ఉమెన్స్ కాలేజీకి పెట్టడం శుభపరిణామం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్, సాగర్, మహేష్, యాదగిరి, పృథ్వీరాజ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు
NLG: సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండలం, నరసింహుల గూడెం గ్రామంలో రూ. 3 కోట్ల వ్యయంతో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణానికి గురువారం మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ప్రజలు లోవోల్టేజీ సమస్య కారణంగా ఇబ్బందులు పడకుండా సబ్ స్టేషన్ ను నిర్మించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జన్మదినం సందర్భంగా, ఈ రోజు రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, వారి చేతుల మీదుగా ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణ మర్రిగూడ లో జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఆమె పోరాట పటిమ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పేదల కోసం, బడుగు బలహీనవర్గాల కోసం, మహిళల కోసం ఇందిరమ్మ పాలన వచ్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విగ్రహ దాత మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్, పగడాల ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు, మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పాక నగేష్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఇతర ముఖ్య నాయకులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో, గాంధీ సెంటర్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ ను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.

తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్పూర్తిదాయకమని కొనియాడారు.
లెంకలపల్లి: అంగన్వాడీ కేంద్రం -1లో పౌష్టిక వారోత్సవాలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం -1 ఆధ్వర్యంలో బుధవారం  పౌష్టిక వారోత్సవాలు నిర్వహించారు.

ఈ మేరకు ఎమ్ ఎల్ హెచ్ పి డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్థాల గురించి అంగన్వాడీ లోని  పిల్లల తల్లులకు వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అయితగోని అండాలు, ఆశాలు సైదాబి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.
చండూరు మండల సిపిఎం కార్యదర్శిగా జెర్రిపోతుల ధనంజయ గౌడ్ ఏకగ్రీవం
నల్లగొండ జిల్లా:
చండూరు మండల సిపిఎం కార్యదర్శిగా జెర్రిపోతుల ధనంజయ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు చండూరు మండల కేంద్రంలో జరిగిన మండల మహాసభలో ఆయన ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ.. చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రధాన రహదారి అద్వానంగా తయారైందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
NLG: తమ్మడపల్లి లో బెల్టు షాపుల నిర్మూల కమిటీని ఏర్పాటు చేసి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ మర్రిగూడ మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీని వేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ మేరకు బెల్ట్ షాపులు అరికట్టాలని,ఒక్క బెల్టు షాపు కూడా నిర్వహించకూడదని, ఈరోజు నుంచి ఏ ఒక్కరు మందు గానీ, గుడంబా గానీ అమ్మితే  వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ కమిటీ ద్వారా మండల ఎస్ఐ రంగారెడ్డి హెచ్చరించారు.

ఈ కమిటీ సభ్యులుగా గ్రామ నాయకులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొట్టం రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఇడగోని  వెంకటేష్, కొట్టం శీను, రమేష్, జంగయ్య, ఎం.డి నజీర్, డి.సతీష్ యాదయ్య, మహిళలు  ఆయిలి ఉషమ్మ, అండాలు, నిర్మలమ్మ, నాగమణి, ఎం. డి మిశ్రీన్, సిపిఐ నాయకులు పాండురంగారావు, మాజీ ఎంపీటీసీ యాదయ్య, బాలకిషన్, ఎం. నరసింహ, గ్రామ పెద్దలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: గంజాయి రహిత సమాజాన్ని  తీర్చిదిద్దడం మన అందరి లక్ష్యం: సీఐ రాజశేఖర్ రెడ్డి
నల్గొండ పట్టణం లోని ప్రభుత్వ జేబిఎస్ పాఠశాలలో మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పై వన్ టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి రహిత సమాజాన్ని తీర్చిదిద్దడం మనందరి లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నల్లగొండలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ తహసిల్దార్ కార్యాలయం ఆధునీకరణకు రూ. 25 లక్షలు
నల్గొండ:  పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేరు వేరుగా తహశీల్దార్ కార్యాలయాల ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ని ఆదేశించారు.

మంగళవారం నల్గొండ తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 1,00,116  చొప్పున  117 చెక్కులను మంత్రి కోమటిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కల్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జనాభా రెండు లక్షలు దాటడం తో ప్రస్తుత తహసిల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి పెరిగిందని అన్నారు.

కనగల్, తిప్పర్తి మండలాల నుండి నల్గొండ తహశీల్ పరిధిలో గ్రామాలు కలవడం ,  నల్గొండ జిల్లా కేంద్రం కావటం, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణం, గ్రామీణ ప్రాంతాలకు వేరు వేరుగా తహసిల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు .  నల్గొండకు ప్రత్యేక తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత తహసిల్దార్ కార్యాలయాన్ని 25 లక్షల రూపాయల ఎం ఎల్ ఏ ఎస్ డి ఎఫ్  నిధులతో పూర్తిస్థాయిలో ఆధునికరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, టాయిలెట్స్ తో పాటు, అన్ని గదులను ఆధునికరించడం,ఏ సి సౌకర్యం, అవసరమైన సౌకర్యాలు అన్నింటిని కల్పించాలని, ఇందుకు అంచనాలను రూపొందించాలని  పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం బాగుందని, రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ముందు ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాం నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 27,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, జిల్లా కలెక్టర్ చొరవతో వాటిని పరిష్కరించి ఆ సంఖ్యను 4000  కు తీసుకురావడం జరిగిందని, ప్రత్యేకించి నల్గొండ తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించి 1400 దరఖాస్తులలో 1100 ఇదివరకే పరిష్కరించడం జరిగిందని, మిగిలినవి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

పని నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని, ఎవరైనా పేదవారికి ఇబ్బంది కలిగించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు.

గతంలో ధరణిలో అనేక రకాల అక్రమాలు జరిగాయని ,వీటిని దృష్టిలో ఉంచుకొని తమ  ప్రభుత్వం సాధ్యమైనంతవరకు సమస్యలు లేకుండా పరిష్కరించేందుకుగాను ధరణి స్థానంలో భూమాతను  తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు .దీనిద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇన్చార్జ్ ఆర్డిఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, నల్గొండ తహసిల్దార్ శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.
NLG: జమిలి ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తి కి విరుద్ధం: సిపిఎం
నల్లగొండ జిల్లా:
జమిలి ఎన్నికల విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైనది కాదు అని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల మహాసభ సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షత నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశ పెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీలు జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదని చెప్తూ వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. గత ఏడాది పది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయని, వీటికి2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి వస్తుందని అన్నారు.

అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు. హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్  రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల, రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మిస్తామని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామన్న వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని  ప్రభుత్వం వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మహాసభలో  గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యల కోసం పనిచేసిన పోరాటాలను సమీక్షించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలను నిర్వహించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

డిండి ఎత్తిపోతల పథకం డి పి ఆర్ ను ఆమోదించి వెంటనే పనులు పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు  ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, వెంకటేశం, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, బల్లెం స్వామి ఈరటి వెంకన్న, లింగస్వామి, సైదులు, స్వామి, లక్ష్మమ్మ, లింగమ్మ,తదితరులు పాల్గొన్నారు.