TG: రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పాలకులుగా డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఎంపిక
HYD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్, గ్రంథ పాలకులు, డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రాష్ట్ర స్థాయి కళాశాల ఉన్నత విద్య ఉత్తమ గ్రంథపాలకునిగా ఎంపిక అయ్యారు.బుధవారం రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తమ అధ్యాపకుల అవార్డు లలో భాగంగా డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం 5 వ తేదీ రవీంద్ర భారతిలో ఉత్తమ గంధ పాలకుడు అవార్డు తీసుకోబోతున్నారు.
దుర్గాప్రసాద్ గత 11 సంవత్సరాలలో ఆరు సంవత్సరాలు నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్గొండ లో (2018-2024) దాదాపుగా 63 వేల పుస్తకాలు నిర్వహణ, 55 పత్రికల నిర్వహణ, ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, కెరీర్ గైడెన్స్ విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ హాస్టల్లో ఉచితంగా కెరీర్ గైడెన్స్ పై శిక్షణ, మరొక ఐదు సంవత్సరాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అటానమస్ లో (2013-2018) కళాశాల గ్రంథ పాలకులుగా 53,000 పుస్తకాలు, 45 పత్రికలు, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ ద్వారా ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, కళాశాల అనుబంధ హాస్టల్లో ఉచితంగా కెరీర్ గైడెన్స్ పై శిక్షణ విద్యార్థులకు అందించారు.
గ్రంథాలయ నిర్వహణ, పుస్తకాల ఎంపిక, జర్నల్ లు, మ్యాగజైన్ లు నిర్వహణ, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ ద్వారా ఈ బుక్స్ ఈ జర్నల్స్ నిర్వహణ, గ్రంథాలయ అభివృద్ధి గ్రంథాలయ వనరులు, గ్రంథాలయ సేవలు, పరిశోధన విధానం, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ పై మూడు పుస్తకాలు ప్రచురణ, రాష్ట్రస్థాయి జాతీయస్థాయి సెమినార్లు, వేబినార్లు , వర్క్ షాప్ లో నిర్వహణ, రిసోర్స్ పర్సన్ గా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ప్రజెంటేషన్, 42 పరిశోధన వ్యాసాలు, ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాక్ ద్వారా విద్య ఉద్యోగ సమాచారం సమాజాభివృద్ధి కోసం , విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం సేవ చేయడం ద్వారా పనిచేస్తున్న కళాశాలల విద్యార్థులతో పాటు, విద్యార్థుల ప్రగతిని రికార్డ్స్ లో మరియు గూగుల్ ఫామ్స్ లలో నిర్వహణ , రాష్ట్రంలో దేశంలో వివిధ స్థాయిలలో వివిధ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్ ద్వారా ఒకరోజులో 24 గంటలలో, రౌండ్ ద క్లాక్, ఎప్పుడైనా, ఎక్కడనైనా, అకాడమిక్ రీసెర్చ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సమాచారాన్ని 7 లక్షల మందికి పైగా, 144 దేశాల పాఠకులు ఉపయోగించుకున్నారని తద్వారా. ఎంతోమంది విద్యార్థులు జాతీయ మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం తోడ్పడ్డారని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం సమాచార వనరులు సామాజిక మాధ్యమం ద్వారా విద్యార్థులకు ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ద్వారా విద్య ఉద్యోగ సమాచార వనరులను అందించడంలో, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిసోర్స్ పర్సన్ గా ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ పై అధ్యాపకులకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, గ్రంథాలయ సమాచార సేవ చేసినందుకు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథపాలకుని అవార్డుకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోత్స్న ప్రభ తెలిపారు.
ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించారు.

HYD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్, గ్రంథ పాలకులు, డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రాష్ట్ర స్థాయి కళాశాల ఉన్నత విద్య ఉత్తమ గ్రంథపాలకునిగా ఎంపిక అయ్యారు.బుధవారం రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తమ అధ్యాపకుల అవార్డు లలో భాగంగా డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ బుధవారం తెలిపారు. వాణిజ్య శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ర్యాక శ్రీధర్ మరియు రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అనిల్ అబ్రహం లకు అవార్డులు లభించాయని ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం నుండి ఉత్తర్వులు అందినట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి దశ అడ్మిషన్ల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ విడుదల అయినట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 4 వ తేది నుంచి 9 వ తేది లోపు దోస్త్ వెబ్ సైట్ లో రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.
దేవరకొండ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ పోరు యాత్ర మంగళవారం దేవరకొండ కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగంలో ఉండే హాస్టల్ విద్యార్థుల బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా హాస్టల్లో ఉండే విద్యార్థులు ఆరు బయట స్నానాలు చేయాలా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయని అన్నారు.
నల్లగొండ జిల్లా, చండూరు:
నల్గొండ జిల్లా, చండూరు:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్లో ఉండాలని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని అన్నారు.
ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను, అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ లలో పాతబడిన డ్రైనేజీ లను గుర్తించి వాటిని పునర్ నిర్మించి మురుగునీరు సాఫీగా వెళ్ళేలా చూడాలని సూచించారు.
వసతి గృహాలల్లో విద్యుత్ సర్క్యూట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటూనే విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో 197 కోట్లు విద్యుత్ శాఖ కు మంజూరయ్యాయని విద్యుత్ అధికారులు తెలపడంతో.. ప్రియారిటీ ఆఫ్ లిస్టు ప్రకారం విద్యుత్ పనులు చేయాలని, చండూరు లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు డెడికేటెడ్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ ని పెట్టాలని అధికారులను ఆదేశించారు.
చండూరు రెవెన్యూ డివిజన్ అయిన సందర్భంగా ఆర్డిఓ ఎమ్మార్వో ఎంపీడీవో ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ప్రతి ప్రభుత్వ నిర్మాణం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని అధికారులను కోరారు.ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నిర్వహించబడిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్, 2024 లో నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ జనాభా కేటగిరీ-3 (<3 లక్షలు)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి ఘనత సాధించింది.
ఈ మేరకు ఎన్సీఏపి డైరెక్టర్ డా. ప్రశాంత్ మార్గదర్శకాలకు అనుగుణంగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించ గా, వాటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మూల్యాంకనం చేసింది.
Sep 05 2024, 13:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.6k