రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి
రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేసి, అనంతరం దళిత బంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుపేద దళితులను గుర్తించి ఆర్థిక భరోసగా దళిత బంధులో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని తెలిపారు.
ఎంపిక సమయంలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుండి వాటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకొని పరిశీలన చేసి దళిత బంధు పోర్టల్ లో పేర్లను నమోదు చేశారని పేర్కొన్నారు.
బ్యాంకులో కూడా దళిత బంధు లబ్ధిదారులతో జీరో ఎకౌంటును తీయించారని వెల్లడించారు. దళిత బందులో నిధులను విడుదల చేశారని, లబ్ధిదారులకు రూ. 10 లక్షలు జమాయ్యాయి. గ్రౌండింగ్ జరిగే లోపు ఎన్నికల నియామవళి రావడంతో లబ్ధిదారులకు గ్రౌండిగ్ చేయలేదన్నారు.
ఎన్నికల తర్వాత గ్రౌండిగ్ చేస్తారు అనుకున్నాం కానీ ఎకౌంటు లను ఫ్రీజింగ్లో పెట్టి ఇప్పటివరకు గ్రౌండిగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి దళిత జాతికి రావాల్సిన దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళిత బంధు కోసం సాగే పోరాటంలో దళిత బంధు లబ్ధిదారులంతా పాల్గొనాలని కోరారు.
కార్యక్రమంలో పోతేపాక నవీన్, దొడ్డి రమేష్, పుల్లెంల ఏడుకొండలు, కొప్పోలు విమలమ్మ, మామిడి ఎల్లయ్య, పేరపాక నరసింహ, అద్దంకి రవీందర్, బాకి నరసింహ, బొజ్జ శ్రీను, బొజ్జ సురేష్, దర్శనం రాంబాబు, అప్పల మధు, ఉదారి శ్రీకాంత్, కొండేటి నాగయ్య, బాలస్వామి, చింతకింది సైదులు, పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










తాజా ఆరోపణలతో అదానీ స్టాక్స్ పడిపోతాయా? మార్కెట్ నిపుణుల సమాధానమిదే..! అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సెబీ చైర్‌పర్సన్ మాధుబి పురి బచ్, ఆమె భర్తకు అదానీ ఆఫ్‌షోర్ వ్యాపారంలో వాటాలు ఉన్నాయని ఆరోపించింది. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమవుతాయా? మార్కెట్ నిపుణుల ఏమంటున్నారు? అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, ఈసారి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్ పర్సన్ మాధుబి పురి బచ్‌ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ గ్రూప్ మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కొత్త ఇన్వెస్ట్‌గేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పనితీరుపై చర్చకు దారితీసింది. సోమవారం ఆగస్టు 12వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పతనమయ్యే అవకాశం ఉందా? అనేది ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరి ఈ అంశంపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? 2023లో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి లాభపడిందని, స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ సమయంలో గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. అయితే, ఆ తర్వాత తమ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ షేర్లు వేగంగా కోలుకున్నాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణల ముందు సమయంలోని విలువను దాటి ట్రేడింగ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. అవి అదానీ పోర్ట్స్ అండే సెజ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్‌డీటీవీ ఉన్నాయి. తాజా ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందిస్తున్నారు. 2023తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు వేరని గుర్తు చేశారు. హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు ఉండకపోవచ్చని, అలాగే స్టాక్ మార్కెట్ సైతం భారీ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలేమీ ఉండకపోవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మొదట్లో ప్రభావం కనిపించవచ్చు కానీ, మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయి. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. మార్కెట్లు ప్రారంభమైన తర్వాత అదానీ స్టాక్స్ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. కానీ, మళ్లీ రికవరీ అవుతాయి.' అని ఇండిట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నట్లు మింట్ వెల్లడించింది.
Aug 13 2024, 08:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.4k