/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పంద Raghu ram reddy
తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పంద
తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) స్పందించారు.

హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరమని అన్నారు. 19వ గేటు చైన్‌ లింక్‌ తెగిపోవడంతో సమస్య తలెత్తిందని అన్నారు.

17వ గేటు నుంచి 32వ గేట్ల నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. నిపుణుల బృందం జలాశయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. కేంద్ర జల సంఘం కూడా నిపుణులను పంపిందని వివరించారు. జలాశయం నుంచి నీరు పెద్ద ఎత్తున బయటకు పోతోందని అన్నారు. జలాశయం దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ డ్యామ్ కర్నాటక - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మూడు రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచినట్లు తెలిపారు. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని వివరించారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని చెప్పారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనని.. రైతులు సహకరించాలని డిప్యూటీ సీఎం శివకుమార్ కోరారు. తుంగభద్ర రిజర్వాయర్‌ గేటు తెగిపోయిన ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. తుంగభద్ర జలాశయం వద్ద తాజా పరిణామాలపై సీఎం ఆరా తీశారు.

జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్‌ ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. ఎల్లుండి (మంగళవారం) జలాశయం వద్దకు సీఎం సిద్దరామయ్య వెళ్లనున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో డ్యామ్ గేటు ఊడింది. కర్ణాటకలో హోస్పేట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు (Tungabhadra Dam 19Th Gate) నిన్న రాత్రి (శనివారం) ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. గేటు తెగడంతో నీటి ప్రవావం పోటెత్తింది. తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. ప్రాజెక్ట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు బయటకు వస్తోంది.

ప్రాజెక్ట్ నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్దరణ పనులు చేపడతామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆదివారం ఉదయం డ్యామ్‌ను కర్ణాటక మంత్రి శివరాజ్ సందర్శించారు. డ్యాట్ గేటు కొట్టుకోని పోవడంతో కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాలు ప్రజలపై ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో కోరింది. సహాయం కోసం 1070 112, 1800 425 0101 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది.

తుంగభద్ర డ్యామ్ గేటు ఊడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డ్యామ్ వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని కోరారు. అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యామ్ గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. డ్యామ్ 19వ గేటు నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు గుర్తించారు.
కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్ రెడ్డి బృందం

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చబోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం 'ది ఫ్యూచర్ స్టేట్'కు పర్యాయపదంగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిన్న ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వివరించారు.మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి... అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

ఇప్పటివరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించామన్నారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామన్నారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు.

ఔటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదమని, టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారని, అలాగే కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని గుర్తు చేశారు.

భారత్‌లో రాష్టాలకు ఇలాంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్నారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలాంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందామన్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నామని... తెలంగాణ 'ఫ్యూచర్ స్టేట్'గా పిలుద్దామని ప్రకటించారు. 

ఈ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని... అందుకే అందరినీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు.

రఘురామ కేసులో మాజీ సీఐడీ అధికారికి హైకోర్టులో బిగ్ షాక్

రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ హైకోర్టును ఆశ్రయించగా

శుక్రవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. విజయపాల్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కే కృష్ణాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.  

వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజుపై రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తనను అరెస్టు చేసిన రోజు రాత్రి సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నం చేశారంటూ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ సహా పలువురిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది కిశోర్ కుమార్ వాదనలు వినిపించారు. రఘురామను నిబంధనల ప్రకారమే సీఐడీ అరెస్టు చేసి విచారణ జరిపిందని, కస్టడీలో చిత్రహింసలకు గురి చేయలేదని, రఘురామ శరీరంపై గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని విజయపాల్న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.

అయితే ఈ వాదనలను పోలీసుల తరపున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పీపీ మెండ లక్ష్మీనారాయణ ఖండించారు. రఘురామకు గాయాలు అయినట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందని వివరించారు.

ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి .. విజయ్ పాల్‌కు మధ్యంతర మందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు

బిగ్ అప్డేట్.. కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ప్రధాన అర్హతలు ఇవే..!

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్ వచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీపై సమావేశమైన సబ్ కమిటీ.. కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై కూడా చర్చించిన సబ్ కమిటి.. మిగతా ప్రజాప్రతినిధులు సలహాలు తీసుకుని త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణలోని అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు.. స్వైపింగ్ కార్డుల తరహాలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక.. కొత్తగా మంజూలు చేసే రేషన్ కార్డులకు సంబంధించిన విధివిధానాలపై కూడా చర్చించగా.. తదుపరి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

అయితే.. కొత్తగా పంపిణీ చేసే తెల్లరేషన్ కార్డులు పొందేందుకు.. కొన్ని నింబంధనలు కూడా పెట్టాలని సబ్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లబ్ధిదారులకు భూమి విషయంతో పాటు ఆదాయం విషయంలో నిబంధనలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఇందులో భాగంగానే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి వార్షిక ఆదాయం లక్షన్నరగానూ, మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాలుగా ఉండాలని సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.. ఇక.. పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నవారి వార్షిక ఆదాయం 2 లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. పాత కార్డుల స్థానంలో కొత్తకార్డులు ఇవ్వాలని, అది కూడా స్వైపింగ్ మోడల్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు.. సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను అందరి ముందు ఉంచుతామని.. రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. సభ్యుల ఆలోచనలు, సూచనలను పరిగణలోకి తీసుకుని తుది విధివిధానాలను ఖరారు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే.. సక్సెనా కమిటీ సిఫారసులను పరిశీలించాలని..

ఒక కుటుంబానికి ఒకే తెల్లరేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు జారీకి ఎలాంటి విధివిధానాలు అమలు చేస్తున్నారన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉన్నవారికి.. ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

జలాశయాలకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం..

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,11,236 క్యూసెక్కులు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 2,86,919 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,11,236 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..

ప్రస్తుతం : 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 202.0439 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయడంతో సాగర్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ప్రాజెక్టు నుంచి 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు పదిఅడుగుల మేర…..10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 3,60,691 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 588 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 306.10 టీఎంసీలకు చేరుకుంది. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు మరింతగా పెరిగింది. 15 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పులిచింతలకు ఎగువ నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 32.16 టీఎంసీలకు చేరుకుంది.

మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317.850 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ 8.319 టీఎంసీ (86.14%)లకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,78,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,55,566 క్యూసెక్కులు.

ప్రాజెక్టుకు సంబంధించిన 34 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1537 క్యూ సెక్కులు కాగా.. నంది పంప్ హౌజ్ కు 3150, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 331క్యూసెక్కులు,ఎన్టీపీసీ కి 121క్యూసెక్కులు విడుదల చేశారు.

కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 988 క్యూ సెక్కులు, అవుట్ ఫ్లో 833 క్యూ సెక్కులు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 697.925 అడుగులకు చేరుకుంది.

ప్లీజ్ మాకు రైస్ సహాయం చేయండి.. 10 కుటుంబాలు అయినా విరాళం ఇవ్వండంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు.

ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల ఆద్య, అకిరా నందన్ బాధ్యతలను చూసుకుంటుంది.

అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది.

తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, కుక్క పిల్లలకు డొనేషన్‌గా రైస్ కావాలంటూ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో భాగంగా.. అర్జెంట్ రిక్వెస్ట్.. మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి ఎవరైనా మాకు బియ్యం సహాయం చేయగలరా? ప్లీజ్ మాకు ప్రతి నెలా 300kgs కావాలి.. 4 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24kgs/నెల బియ్యం అందుతుంది.

కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇవ్వగలరా. అలా 10 కుటుంబాలు అయినా విరాళం ఇవ్వగలిగితే, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

దయచేసి మీ స్నేహితులు మరియు బంధువులతో ఈ విషయాన్ని షేర్ చేయండి.. అంటూ రాసుకొచ్చింది. కాగా ఆమె 50 కేజీల రైస్ ఇచ్చినట్లు ఆ పోస్ట్‌లోనే పేర్కొంది. ప్రస్తుతం ఈమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

గాజాలో పాఠశాలపై ఇజ్రాయేల్ బాంబు దాడి.. 100 మందికిపైగా మృతి

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ మరింత ప్రమాదకరంగా మారిపోతున్నాయి. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు నెలకున్నాయి. హమాస్ అగ్రనేత హనియా హత్యతో ఇరాన్ రగిలిపోతోంది. తమ రాజధాని నగరంలోని అత్యంత కట్టుదిట్టమైన ప్రదేశంలో ఆయనను బాంబుతో హతమార్చింది ఇజ్రాయేల్. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. దీంతో ఏ క్షణమైనా ఇజ్రాయేల్‌పై హమాస్, ఇరాన్ దాడులతో విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాయి. ఇటు, గాజా నగరంలోని స్కూల్స్, హాస్పిటల్స్‌పై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది.

హమాస్, హెజ్బొల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఏ క్షణమైనా ఇజ్రాయేల్‌పై హమాస్, ఇరాన్ దాడులతో విరుచుకుపడే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలోనూ గాజాపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా, తూర్పు గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది. ఈ ఘటనలో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. నిరాశ్రయులు తలదాచుకుంటున స్కూల్‌పై టెల్ అవీవ్ సైన్యం విచక్షణారహితంగా దాడులకు తెగబడింది. అయితే, ఇది హమాస్ కమాండ్ సెంటర్ అని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది.

అల్-సాహబా ప్రాంతంలో అల్- తబీన్ స్కూల్‌పై ఇజ్రాయేల్ జరిపిన దాడిలో 40 మంది వీరులు అమరులయ్యారు.. డజన్ల కొద్దీ గాయపడ్డారు’ అని హమాస్ అధికార ప్రతినిధి మొహమూద్ బసల్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది భయంకరమైన ఊచకోత అని, పలువురు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంటలను అదుపుచేసి అమరుల మృతదేహాలు బయటకు తీయడం, గాయాలతో ఉన్నవారిని రక్షించడానికి రెస్క్యూ దళాలు ప్రయత్నిస్తున్నాయని బసల్ తెలిపారు.

గత వారం కూడా గాజాలోని మూడు స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్‌ దాడి చేసింది. ఇటీవల ఓ పాఠశాలపై జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారు. ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. తాజా దాడిని ఇజ్రాయేల్ సమర్ధించుకుంది. గాజా నగరంలోని పాఠశాలలను హమాస్ కమాండ్ సెంటర్లు మార్చుకుందని ఆరోపించింది.

గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్‌.. నరమేథానికి తెగబడింది. ఈ మెరుపు దాడులకు అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్‌ వైమానిక దాడులు, క్షిపణలు, బాంబులతో గత 10 నెలలుగా విరుచుకుపడుతోంది. హమాస్, ఇజ్రాయేల్ యుద్ధంలో ఇప్పటివరకు 40,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

గత నెలలో జరిగిన హమాస్‌, హెజ్బొల్లా సంస్థల ముఖ్య నేతల హత్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్‌ను భూస్థాపితం చేస్తామని ప్రతిజ్ఞ‌ చేసిన ఇజ్రాయేల్‌.. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.

హమాస్‌తో భీకర యుద్ధం తర్వాత గాజా దక్షిణ ప్రాంతం ఖాన్ యూనిస్ నుంచి ఏప్రిల్‌లో బలగాలను ఉపసంహరించుకున్న ఇజ్రాయేల్.. మళ్లీ ప్రాంతానికి శనివారం తన సైన్యాలను పంపింది. ఈ ప్రాంతం వీడాలని ఇజ్రాయేల్ ఆదేశించడంతో వేలాది మంది ప్రాణాలను రక్షించుకోడానికి సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్నారు. మూడు రోజుల్లోనే ఖాన్ యూనిస్ నుంచి 60 వేల మంది పాలస్తీనియన్లు పశ్చిమ ప్రాంతానికి తరలిపోయినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్

దేశంలోని ప్రతి వ్యక్తిని స్వేచ్చగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాంతో 17 నెలల తర్వాత... ఈ రోజు ఉదయం ఇలా స్వేచ్చగా టీ తాగుతున్నాను. ప్రతి ఒక్కరితో కలిసి బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛను మాకు దేవుడు కల్పించాడని.. మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

మద్యం కుంభకోణం కేసులో దాదాపు 17 నెలల అనంతరం తీహాడ్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా శనివారం ఉదయం తనదైన శైలిలో స్పందించారు. తన భార్యతో కలిసి టీ తాగుతూ.. సెల్ఫీ తీసుకుని దానిని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశంలోని ప్రతి వ్యక్తిని స్వేచ్చగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాంతో 17 నెలల తర్వాత... ఈ రోజు ఉదయం ఇలా స్వేచ్చగా టీ తాగుతున్నాను. ప్రతి ఒక్కరితో కలిసి బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛను మాకు దేవుడు కల్పించాడని.. మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు శుక్రవారం జస్టిస్ ఏ.ఆర్. గవాయి, కె. వి. విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం తీహాడ్ జైలు నుంచి మనీశ్ సిసోడియా విడుదలయ్యారు. ఆ తర్వాత ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. ఆయన తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంపై అరవింద్ కేజ్రీవాల్ భార్య స్పందించారు. న్యాయం జరగడం కాస్తా ఆలస్యం అవుతుందేమో కానీ.. న్యాయం తిరస్కారానికి గురి కాదన్నారు.

ఇక మనీశ్ సిసోడియా విడుదల కావడంతో.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్బంగా ఆప్ అగ్రనేతలు అతిషి, సంజయ్ సింగ్, రాఘవ చద్దా తదితరులు స్పందించారు. అయితే వీరి స్పందనపై బీజేపీ ఢిల్లీ చీఫ్ ఘాటుగా స్పందించారు. మనీశ్ సిసోడియా కేవలం బెయిల్‌పై మాత్రమే విడులయ్యారన్నారు. అంతేకానీ.. ఆయనపై కేసులు మాత్రం అలాగే ఉన్నాయని ఆప్ నేతలకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఢిల్లీ చీఫ్ డిమాండ్ చేశారు.

మద్యం కుంభకోణం కేసులో 2023, ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఇదే కేసులో ఈడీ సైతం ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆ క్రమంలో అదే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు.

నాటి నుంచి తీహాడ్ జైల్లోనే ఉన్న మనీశ్ పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించి.. చివరకు భంగపడ్డారు. దాదాపు 17 నెలల అనంతరం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మాత్రం దక్కక పోవడం గమనార్హం.

70 వేల మార్క్ చేరిన బంగారం ధర

పెళ్లిళ్ల సీజన్ దగ్గరికి వచ్చేసింది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధరలు.. ఈ రోజు (శనివారం) నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవడంతో బంగారం ధరలు పెరిగాయి.

పెళ్లిళ్ల సీజన్ దగ్గరికి వచ్చేసింది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధరలు.. ఈ రోజు (శనివారం) నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవడంతో బంగారం ధరలు పెరిగాయి.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260కి చేరింది. నిన్నటితో పోలిస్తే రూ.770 పెరిగింది. ఈ రోజు రూ.64,260గా ఉంది.

మేలిమి బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న 10 గ్రాముల ధర రూ.69,260గా ఉండగా ఈ రోజు రూ.70,100కి చేరింది. విశాఖపట్టణం, విజయవాడలో కూడా ఇదేవిధంగా బంగారం ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగింది. నిన్న 63,640 ఉండగా ఈ రోజు రూ.64,410కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న రూ.69,410గా ఉండగా ఈ రోజు రూ.70,250కి చేరింది.

కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.770 పెరిగింది. నిన్న రూ.63,490గా ఉండగా ఈ రోజు రూ. 64,260కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న రూ.69,260 ఉండగా ఈ రోజు రూ70,100 పెరిగింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.70,100గా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.88,100కి చేరింది

పారిస్ ఒలింపిక్స్ 2024 లో అత్యుత్తమ నైతిక విలువలు ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు.

కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు. కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను " ఇంకా పరుగెత్తాలి " అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు.

తరువాత ఓ జర్నలిస్టు స్పానిష్ ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ మానవునిలోని దైవాన్ని చూపుతుంది.

జర్నలిస్టు : " మీరు అలా ఎందుకు చేశారు "

ఇవాన్ ఫెర్నాండెజ్ : ఏదో ఒకరోజు మనం ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటూ అందరం గెలిచే సమాజం కోసం అలా చేశాను. "

జ: మీరు ఆ కెన్యా రన్నర్ కు మీకు రావలసిన బంగారు పతకం ధార పోశారు తెలుసా ? 

ఇవాన్ : నేనేం అతనికి సహాయం చేయలేదు. ఈ రేసు అతను గెలవబోతున్నాడు. కేవలం భాష రాకపోవటం వలన ఆయన ఆగాడు. 

జ: కానీ మీరు గెలిచేవారే కదా !

ఇవాన్ : అవును. బంగారు పతకం గెలిచేవాడినే. కానీ ఆ బంగారు పతకానికి అప్పుడు ఏమి విలువ ఉంటుంది. 

జర్నలిస్టు ఇవాన్ ని వదలకుండా ప్రశ్నిస్తునే ఉన్నాడు. 

జ : మీరు బంగారు పతకాన్ని గెలిచేవారే కదా